కేసీయార్… తను ఎలాంటి పాలకుడైనా కావచ్చు… ఏళ్ల తరబడీ సెక్రెటేరియట్కే రాకపోవచ్చు… అసలు సెక్రెటేరియట్ మీద కోపమొచ్చి, దాన్ని కూలగొట్టవచ్చు… వేల ఫైళ్లు పెండింగులో ఉండవచ్చు… సీరియస్ ఇష్యూస్ తెర మీదకు వచ్చినా తను జాడాపత్తా లేకుండా పోవచ్చు… నెలల తరబడీ అసలు ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఆయన్ని సీఎంను చేసిన ప్రజలకే తెలియకపోవచ్చు… ఇంకా, ఇంకా, ఏమైనా మనకు ఆక్షేపణలు, అభ్యంతరాలు ఉండవచ్చు గాక………….. అయినా సరే, ఈ ఇష్యూలో మాత్రం కేసీయార్నే సపోర్ట్ చేయాలి… విషయం ఏమిటయ్యా అంటే… తెలంగాణ యువసేన అనే ఓ పార్టీ ఉంది… దేశంలో, రాష్ట్రంలో చాలా పార్టీలున్నయ్…
ఈ పార్టీ లీడర్ అడపా సురేందర్… కేసీయార్ను కలవడానికి మస్తు ప్రయత్నాలు చేశాడట… కుదర్లేదట… ఫోఫోవయ్యా, మా సారు పెద్ద పెద్ద మంత్రులకు, ఉన్నతాధికారులకే దొరకడు.., నువ్వు అడగ్గానే… రా, సురేందర్, రా, వచ్చి కూర్చో, ఏం తీసుకుంటావ్ అని అడుగుతాడా..? అంటూ అందరూ లైట్ తీసుకున్నారేమో బహుశా.., దాంతో సురేందర్ ఏం చేశాడంటే..? అయ్యా, సీఎం సారూ, చాలా సీరియస్ ఇష్యూ చెప్పాలి నీకు, పర్సనల్గా కలవాలి, టైమివ్వు అని దిశ అనే ఈ-పేపర్లో ఫస్ట్ పేజీలో సగం పేజీ ప్రకటన ఇచ్చుకున్నాడు… అదేమో డిజిటల్ పత్రిక తప్ప, భౌతికంగా కాగితం మీద ముద్రించబడే పేపర్ కాదు… మార్కెట్లో కనిపించదు… ఫలితం లేకుండా పోయింది… నమస్తే తెలంగాణకు ఆ ప్రకటన ఇచ్చినా బాగుండు… లేకపోతే నమస్తే ప్రభ, నమస్తే సాక్షి, మన తెలంగాణ ఎట్సెట్రా పత్రికలకు ఇచ్చిన బాగుండు…
Ads
పెద్ద పెద్ద సీరియస్ ఇష్యూసే ఆయన దగ్గరకు పోవడం లేదు… ఇక ఈ ప్రకటనను సీఎం దాకా తీసుకెళ్లేదెవరు..? ఏమో, తన దాకా వెళ్లి ఉంటే, అరెరె, ఏదో సీరియస్ ఇష్యూ మాట్లాడాలి అంటున్నాడు కదా, రమ్మను అనేవాడేమో…… చూసీ చూసీ సురేందర్ అదే పత్రికలో, అదే ప్లేసులో మరో అరపేజీ ప్రకటన ఇచ్చాడు… ‘నా ప్రకటన చూసి, సీఎం రమ్మంటాడు అనుకున్నారు అందరూ, కానీ లాభం లేదు, పోనీలెండి సార్, హెల్దీగా ఉండు, చివరిసారి అడుగుతున్నా, రమ్మంటావా, టైమ్ ఇస్తావా, నీ ఇష్టం, లేకపోతే నీకే నష్టం అన్నట్టుగా కాస్త వ్యంగ్యాన్ని, కాస్త కోపాన్ని, కాస్త జాలితోపాటు అన్ని రకాల ఎమోషన్లనూ కాస్త కాస్త కలిపి మరో ప్రకటన ఇచ్చాడు…
సార్, మూడ్ బాగాలేదు… జనానికి దూరంగా ఉంటున్నాడు… హేమిటో ఈ దిక్కుమాలిన పదవులు, రాజభోగాలు అనుకుంటూ, ఏదో వైరాగ్యంలో పడి.., పూజలు, యాగాలు, హోమాలు గట్రా చేసుకుంటున్నాడు… ఈ స్థితిలో సాక్షాత్తూ జో బైడెన్, కమలా హారిస్ కలిసి వచ్చినా సరే.., పుతిన్, జిన్పింగ్ జాయింటుగా అపాయింట్మెంట్ అడిగినా సరే… తను టైమ్ ఇచ్చి, నాలుగు బిస్కెట్లు ఇచ్చి, చాయ్ పోసి, మర్యాద చేసి, బాగున్నారా అని అడిగే మూడ్లో లేడు… జస్ట్, ఆయన కేవలం మోడీ, అమిత్ షా తప్ప ఇంకెవరికీ టైమ్ ఇవ్వడు… అదీ ఢిల్లీకి వెళ్లి, పోనీలే అని పలకరించి, మంచీ మర్యాద అరుసుకుని వస్తాడు… అంతే తప్ప, ఇలా ఎవరుపడితే వాళ్లు, అడగ్గానే టైమ్ ఇచ్చి, ఎవరు అడిగినా సరే, రండి రండి అని ఆహ్వానించాలా..? ఆయన టైమ్ ఇవ్వాలే గానీ, 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ‘‘చాలా సీరియస్ ఇష్యూస్’’ సీఎంకు పర్సనల్గా చెప్పడానికి రెడీగా ఉన్నారు… అందరూ దిశ పేపర్లో ప్రకటనలు ఇవ్వలేరు కదా… సురేందర్, పోనీ, హైకోర్టులో ఓ పిల్ వేసి.., సీఎం టైమ్ అనేది కూడా జనసౌలభ్యంగా, జనసౌకర్యంగా ఉండేలా ఓ కొత్త విధానం రూపొందాలని అడిగితే బెటరేమో,.. మనకూ ఓ క్లారిటీ వస్తుంది… లేకపోతే, ఇంతదూరం వచ్చాక, ఆయనకే ఇంట్రస్టు లేకపోతే ఎలా… ఇక ఆ ఇష్యూ ఏమిటో అదే పత్రికలో, అదే స్పేసులో కక్కేసి, జనానికి కూడా చెప్పేస్తే బెటరేమో.,.!!
Share this Article