Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘మిస్ బిహేవ్’ అంటే… మిస్ వరల్డ్ వివాదం రేవంత్ మెడకు చుట్టడమా..?!

May 31, 2025 by M S R

.

ప్రజెంట్ జర్నలిజం ట్రెండ్ వేరు… అదే దర్యాప్తు చేస్తుంది, అదే విచారిస్తుంది, అదే తీర్పు చెబుతుంది… అవసరమైతే కథకు ఉపకథల్ని, తనకు ఉపకరించే కథల్ని పుట్టిస్తుంది… తీరా చూస్తే ఆలూ లేదు, చూలూ లేదు… కొడుకు పేరు మీడియా అని…

ఎస్, మిస్ ఇంగ్లండ్ బాధపడింది నిజం… ఎవరో అసభ్యంగా ప్రవర్తించారనో, రూమ్‌కు రమ్మన్నారనో ఆమె ఆరోపించలేదు… గెస్టులను ఎంటర్‌టెయిన్ చేయడానికి తామను తోలుబొమ్మల్లా ప్రదర్శించారు, మేమేమైనా కోతులమా అనడిగింది… ఆమె ఆవేదనలో అర్థముంది…

Ads

ఆమె అర్థంతరంగా పోటీల నుంచి పారిపోయిందీ అంటేనే ఆమె ఎంత విసిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.,.. సరే, తనకు నచ్చలేదు, ఆమె ప్లేసులో మిస్ ఇంగ్లండ్ రన్నరప్‌ను తీసుకొచ్చారు… గుడ్… ఆమె ఆరోపణల్ని ఖండించారు, సహజమే…

వాళ్ల కాళ్లు కడగడం దగ్గర నుంచి కుర్చీ మడతపెట్టి వంటి బూతు పాటలకూ వాళ్లతో శేఖర్ మాస్టర్ బాపతు వెగటు స్టెప్పుల్ని వేయించడం కూడా ఈ పోటీల నిర్వహణ మీద చాలా విమర్శలకు దారితీసింది… (అనాథ పిల్లలతో ఈ అందగత్తెల భేటీలు మాత్రం అభినందనీయమైన ప్రోగ్రాం)…

సీన్ కట్ చేస్తే…. నలభై ఏళ్ల వయస్సులోపున్న ఇద్దరు నాయకులు అట… అందులో ఒకరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడట, మరొకరు సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఏదో కార్పొరేషన్ చైర్మన్ అట… నమస్తే తెలంగాణ అనబడే పింక్ పత్రిక రాసుకొచ్చింది… అంటే, చివరకు దీన్ని కూడా రేవంత్ రెడ్డి మెడలో వేసే ప్రయత్నం…

ఎవరో ముగ్గురు ఐపీఎస్ అధికార్లతో విచారణ కమిటీ వేశారనీ, ఆ కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చిందనీ చాలామంది రాశారు… నిజానికి ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎప్పుడో వదిలేసింది… కమిటీల్లేవు, విచారణల్లేవ్… గ్రాండ్ ఫినాలే మీద కాన్సంట్రేట్ చేస్తోంది…

దాదాపు 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం… మొత్తం ఫ్యాషన్ వరల్డ్ చూస్తుంది…. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఉపయోగకరం… (తప్పులెన్నువారు అన్నట్టుగా మిస్ వరల్డ్ విమర్శకులకు ఫార్ములా రేస్ అక్రమాలు, ఖర్చులు కనిపించవు, అదేమో బ్రాండ్ ఇమేజీ అట, ఈ పోటీలేమో అన్యాయం అట… ఆ ఫార్ములా రేసుల నిర్వహణ కూడా అడ్డదిడ్డం…)

అంతేనా… మీడియా ఇంకా రాసిందంటే… ఈ ప్రపంచ అందగత్తెలు తమ దేశాలకు తిరిగి వెళ్లాక మిస్ ఇంగ్లండ్‌లాగే తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారేమోనని భయపడి… మిస్ వరల్డ్ నిర్వాహకులతో లండన్‌లో మిస్ ఇంగ్లండ్ మీద కేసు పెట్టించిందట… తద్వారా ఇక కేసులకు భయపడి ఇంకెవరూ నోళ్లు విప్పరట… వావ్…

ఆమె మీద చర్యలు ఏమీ ఉండబోవని జయేష్ రంజన్ అత్యంత ఉదారంగా ప్రకటించాడని మరో వార్త… మిస్ ఇంగ్లండ్ తనే బాధితురాలు, మరి నిందితురాలు ఎలా అవుతుంది..? ఏమని కేసు పెడతారు..? మిస్ వరల్డ్ నిర్వాహకులు ఇలాంటి అంశాల్లో ఇంటర్నేషనల్ ముదుర్స్, అనగా ఆరితేరినవాళ్లు… పలు దేశాల చట్టాలు, పరిస్థితులు తెలుసు…

రేవంత్ రెడ్డి శిబిరం సంతోషించాల్సిన అంశం ఒకటి ఉంది… మిస్ ఇంగ్లండ్ రేవంత్ రెడ్డి మీద అంతర్జాతీయ కోర్టును ఆశ్రయిస్తున్నట్టుగా రాయలేదు… ఎందుకంటే, ఫాఫం, ఆయన అత్యంత సన్నిహిత నేతలే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని రాశారు కదా… ఆమె మైనర్ కాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడే పోక్సో కేసు పెట్టించేవాళ్లేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…
  • డార్క్ వెబ్ అంటే… అది ఇల్లీగల్ కాదు, క్షుద్రమూ కాదు నానీ…
  • లోకేష్‌కు రాధాకృష్ణ సర్టిఫికెట్… తమరిక తప్పుకోవాలి బాబు గారూ…
  • అదెలా..? కేసీయార్‌కు నోటీసులిస్తే తెలంగాణకు ఇచ్చినట్టేమిటి..?!
  • ఫాఫం సాక్షి… నానాటికీ ప్రమాణాల ఖుర్బానీ… ఇదీ ఓ ఉదాహరణ…
  • హమ్మో… ఆ పాత నాగదుర్గ కాదు… ‘దారిపొంటచ్చి’ దడపుట్టించింది…
  • తేడా లేని పాటలు… నటిగా అదే జయప్రద… బాపు ఫెయిల్… దాసరి హిట్…
  • ఆ పదం వినగానే యూనిట్ మొత్తం కకావికలై పరుగులు తీసింది…
  • ఆయన ఆ జడ్జిని చూపిస్తే… ఈయన పోటీగా మరో జడ్జిని ప్రవేశపెట్టాడు…
  • మరో జలియన్‌ వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions