వ్యక్తి నియంతృత్వమా..? పార్టీ నియంతృత్వమా..? అధ్యక్ష ప్రజాస్వామ్యమా..? పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా..? రాజరికమా..? అర్ధ ప్రజాస్వామ్యమా..? ఏ దేశం ఏ తరహా పాలనలో ఉందనేది వదిలేయండి… రాజ్యం… స్టేట్… అంటే ప్రభుత్వం (వ్యక్తులు, పార్టీలు అప్రస్తుతం… కుర్చీ అంటే కుర్చీ… అంతే…) ఎప్పుడూ ప్రశ్నను కోరుకోదు… ప్రజలు స్వేచ్ఛగా ప్రశ్నించడాన్ని ఇష్టపడదు… బయటికి ఏం చెప్పినా సరే, ఎప్పటికప్పుడు ఏదో ఓ రీతిలో భావప్రకటన స్వేచ్ఛను అణిచేయాలనే చూస్తుంది… ఆ స్వేచ్ఛలో ఓ చిన్న భాగమైన మీడియా స్వేచ్ఛను కూడా కంట్రోల్ చేయడానికే ప్రయత్నిస్తుంది… మనం ఇండియాలో పాత్రికేయ స్వేచ్ఛ గురించి గగ్గోలు పెడుతుంటాం… కమ్యూనిస్టులయితే మరీ… కానీ వాళ్లు స్వర్గంగా భావించే చైనా భావస్వేచ్ఛను తొక్కేసే విషయంలో ఏ రేంజ్కైనా వెళ్తుంది… అంతెందుకు..? బయట రాష్ట్రాల్లో గాయిగత్తర రేపే సీపీఎం తను అధికారంలో ఉన్న కేరళలోనే ఆమధ్య ఓ ప్రెస్ బిల్లు తీసుకొచ్చింది తెలుసు కదా… చైనా విషయానికొస్తే… ఆమధ్య కొన్ని వారాలపాటు కనిపించకుండా పోయాడు తెలుసు కదా… అలీబాబా గ్రూపు ఓనర్… జాక్ మా… తనను డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, బ్రాడ్ కాస్ట్ సహా అన్నిరకాల మీడియా సంస్థల్లోని వేల కోట్ల విలువైన తన వాటాల్ని క్లోజ్ చేసుకోవాలని చైనా ప్రభుత్వం మెడ మీద కత్తులు పెట్టేసింది…
ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఏం రిపోర్ట్ చేస్తున్న ప్రకారం… ఆలీబాబా గ్రూపు చైనాలో బలమైన కార్పొరేట్ గ్రూపు… దాని ఓనర్ జాక్ మాకూ చైనా కమ్యూనిస్టు పార్టీకి, నియంత జిన్పింగ్కూ నడుమ ఎందుకో టరమ్స్ దెబ్బతిన్నాయి… కొన్ని వారాలపాటు ఏకంగా ఆయనే మాయం అయిపోయాడు… తన గ్రూపు మీద వరుసగా దెబ్బలు కొడుతోంది ప్రభుత్వం… అన్నిరోజులు ఆయన ఏమైపోయాడో ప్రభుత్వమూ చెప్పదు, జాక్ చెప్పడు… ఇప్పుడు తన మీడియా సంస్థల్ని టార్గెట్ చేసింది… ట్విట్టర్ తరహాలో చైనాలో వీబో ఉంటుంది… అందులో 350 కోట్ల డాలర్లు జాక్ వాటా… అలాగే యూట్యూబులాగే చైనాలో బిలిబిలి ఉంటుంది… అందులో 260 కోట్ల డాలర్లు జాక్ షేర్… హాంగ్‌కాంగ్ బేస్డ్ సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కూడా ఆలీబాబా గ్రూపుదే… టెక్నికల్, బిజినెస్ న్యూస్ అందించే 36Kr.com, Huxiu.com సైట్లలో ప్రధాన వాటా కూడా తనదే…
Ads
టరమ్స్ బాగున్నప్పుడు చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ జిన్హువాతో ఈ గ్రూపు సంస్థలకు ఒప్పందాలు కూడా కుదిరాయి… కానీ ఇప్పుడు సంబంధాలు చెడిపోయాయి… అందుకని ఓ బలమైన మీడియా గ్రూపు, అందులోనూ పవర్ ఫుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు ఒకరి చేతుల్లో ఉంటే ఎలా..? అందుకని పెద్ద పెద్ద కటార్లు, కత్తెర్లు పట్టుకుని ప్రభుత్వం రంగంలోకి దిగింది… నిజానికి తన మీడియా సంస్థల్లో రోజువారీ కార్యక్రమాల్లో, ఎడిలోరియల్ పాలసీల్లో తను ఇన్వాల్వ్ కాననీ.., టెక్నికల్, ఫైనాన్షియల్ వ్యవహారాల్లోనే తమ గ్రూపు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనీ గతంలో జాక్ మా చెప్పేవాడు… ఐనాసరే, ఒక్కసారి జిన్‌పింగ్‌కు జాక్ మా మీద వైరాగ్యం వచ్చేసింది… దాంతో తొక్కేయడం మొదలుపెట్టారు… ఆలీబాబా గ్రూపే కాదు, టెన్సెంట్ హోల్డింగ్స్, బైట్ డాన్స్ వంటి పెద్ద కంపెనీలకు కూడా మీడియాలో పెద్ద ఎత్తున వాటాలున్నయ్… ఇప్పుడు అవీ అస్థిర, అభద్రతల్లో కొట్టుమిట్టాడుతున్నయ్… ఒక్కసారి ఇండియాలోని అరాచక మీడియా పోకడలకూ, చైనాలో మీడియా స్థితిగతులకూ నడుమ తేడా బేరీజు వేయండి… ఇండియాలో అంతా బాగుందని కాదు… బలమైన రాజ్యాధికారం ముందు మీడియా అనేది ఉత్త జుజుబీ… అది చెప్పుకోవడం కోసం…!!
Share this Article