తెలుగునాట, మీడియా-రాజకీయం కలగలిసిపోయిన వాతావరణంలో… మీడియా వ్యవహారాలే మీడియా వార్తాంశాలు అవుతున్నాయి ఈమధ్య…! మీడియా విధేయతలు, పొలిటికల్ లైన్స్ మాత్రమే కాదు… పొలిటికల్ పార్టీల మౌత్ పీసులుగా మారినందువల్ల, తద్వారా స్వార్థ ప్రయోజనాలు సాధించుకునే ప్రయత్నాలే పాత్రికేయంగా మారుతున్నందున..!
రాజకీయేతరంగానూ మీడియా ప్రముఖులు, మీడియా సంస్థలు వార్తాంశాలు అవుతున్నాయ… సాక్షిపై ఆంధ్రజ్యోతి కేసు, కేంద్రానికి ఫిర్యాదు, వాలంటీర్లకు ఇచ్చే పత్రిక చందా డబ్బుల జీవో రద్దు, కేబుల్ ఆపరేటర్లను బెదిరించి కొన్ని చానెళ్ల ప్రసారాలపై అంకుశం, సాక్షి యాడ్స్ మీద విచారణ… ఇవన్నీ ఒకెత్తు… చివరకు టీవీల్లో డిబేట్లు రన్ చేసే సోకాల్డ్ ప్రజెంటర్ల మీద కూడా ఆరోపణలు… ఇలా ఎన్నో…
గతంలో టీవీ9 అమ్మకపు వ్యవహారాలు, రవిప్రకాష్ మీద కేసులు కూడా చూసినవే… మీడియా సంస్థల ఆర్థిక మూలాల్ని పెకిలించే ప్రయత్నాలు, అక్రమార్జన మళ్లింపునకు మీడియా సంస్థల ఏర్పాటు… టీవీల టీఆర్పీల ట్యాంపరింగ్ కుట్రలు, ప్రముఖుల మార్పులు చేర్పులు… టీఆర్పీలలో ఉత్థానపతనాలు, అనుమతులు… ఇవి మరోరకం.. ఇలా ఎన్నెన్నో…
Ads
తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త… ఓ ప్రముఖ మీడియా సంస్థ అధినేత వృద్దాప్యంలో ఓ డాక్టర్‌తో ప్రణయంలో పడ్డాడనీ, పెళ్లికి సిద్ధమవుతున్నాడనీ, కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారనీ ఆ వార్త సారాంశం… ప్రముఖుడు కాబట్టి తనకు సంబంధించి ఏ వార్తయినా రీడర్స్‌లో ఆసక్తి ఉంటుంది, చదువుతారనేది నిజమే అయినా… ఒకవేళ నిజంగానే ఆయన పెళ్లి చేసుకుంటే దాన్ని వ్యతిరేకించాల్సిన పనే లేదు… తన ఇష్టం… ఆమె ఇష్టం…
మనమే రాస్తుంటాం కదా… ఓ వయస్సు దాటాకే ఓ తోడు అవసరం తెలిసొస్తుందని, ఓ ఆత్మీయ బాసట అవసరమనీ… అలా లేటు వయస్సులో పెళ్లిళ్లను కూడా అభినందిస్తూ రాసిన వార్తలు బోలెడు… అఫ్‌కోర్స్, ఆస్తులు, వారసత్వాల పంచాయితీలు, తలనొప్పులతో కుటుంబసభ్యులు వ్యతిరేకించడమూ సహజమే… సో, సదరు మీడియా సంస్థ లేటు ప్రేమాయణాన్ని, పెళ్లి ప్రయత్నాన్ని నెగెటివ్ ధోరణిలో చూడాల్సిన పనిలేదు… (ఈ సోషల్ మీడియా వార్తను పట్టుకుని సాక్షి ఏదేదో రాయకుండా పూర్తి సంయమనం పాటించడం కూడా బాగుంది…)
అదే సాక్షిలో మరో ఫస్ట్ పేజీ వార్త కనిపించింది… ఓ ప్రముఖ మీడియా సంస్థ అధినేత కొడుకు డ్రగ్స్ వినియోగదారులతో నిత్యం టచ్‌లో ఉంటున్నాడనీ, నార్కొటిక్ అధికారులు సస్పెక్ట్ కేసుగా రాసుకుని నిఘా వేశారనీ వార్త సారాంశం… వందల ఫోన్ కాల్స్ అట… వారసత్వంగా చానెల్ నిర్వహణ పగ్గాలు పొందిన ప్రముఖుడు అంటే… సదరు మీడియా అధినేత కొడుకు కావచ్చు… మీడియా బదనాం కాని రంగం ఏమైనా ఉందా…? వేళ్లు కాళ్లు పెట్టి గెలకని అక్రమాలు ఏమైనా ఉన్నాయా..?
Share this Article