.
ప్రాంతీయ పార్టీలకు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వంటి వ్యక్తి కేంద్రిత పార్టీలకు ఇలాంటి చిక్కులు ఏవీ ఉండవు… బీఆర్ఎస్‌కు హైకమాండ్ అంటే జస్ట్, ఓన్లీ పర్సన్, కేసీయార్…
ముందస్తుకు వెళ్దామా, ఛల్, వోకే… నరేంద్రనో, విజయశాంతినో తరిమేద్దామా, డబుల్ వోకే… ఎవడెవడు తలెగరేస్తున్నాడో చూసి తందామా, ట్రిపుల్ వోకే… మంచో చెడో ఎవడూ మాట్లాడడు, శుక్రమహర్దశ నడిచినన్ని రోజులూ నడుస్తుంది…
Ads
3, 4 నెలలు ఫామ్ హౌజులో పడుకుని గాయబ్ అయిపోయినా నడుస్తుంది… కాంగ్రెసో, బీజేపీయో, లెఫ్టో అలా కాదు.., వాటికి ఢిల్లీలో హైకమాండ్ అనే మీటలుంటాయి… రాగద్వేషాలుంటయ్… ఢిల్లీ కరుణిస్తే ఈ గల్లీలో పదవులు ఎట్సెట్రా…
ఇదంతా ఎందుకు చెప్పడం అంటే… మీనాక్షి నటరాజన్ అనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఓవరాక్షన్ గురించి..! తనే రాహుల్ అనుకుంటోంది, అనే సోనియా అనుకుంటోంది… ఈ పరుష వ్యాఖ్యకు సందేహించడం లేదు… అసలు ఎవరామె..?
అసలు తెలంగాణతో ఏం సంబంధం ఆమెకు..? Who Is She..? తెలంగాణ పౌరురాలు కాదు, పదేళ్లుగా కేసీయార్ విషపు చూపులకు బాధితురాలు కాదు… ఒక్కొక్కరూ ఎన్నో తట్టుకుని నిలబడ్డారు, తట్టుకున్నారు… ఇప్పుడు హఠాత్తుగా ఈమె వచ్చి తనే పార్టీ హైకమాండ్ అన్నట్గుగా, పార్టీ మీద సర్వహక్కులూ దఖలు పడ్డట్టుగా ఎందుకు వ్యవహరిస్తోంది…
అధికారిక మీటింగులకు వెళ్తుంది… రిపోర్టులు తీసుకుంటుంది, ఇప్పుడిక మరీ శృతి మించి జిల్లాలు, నియోజకవర్గాలవారీ మీటింగులు పెడుతోంది… నిలదీస్తుంది… తనకేం నష్టం..? రేప్పొద్దున ఎన్నికల్లో నిలబడేది ఏమైనా ఉందా..? కేసులు, ఖర్చులు, నష్టాలు, బాధలు భరించినవాళ్లకు తెలుసు అసలు సిట్యుయేషన్ ఏమిటో…
నీకు చెప్పినా సరే, మొత్తుకున్నా సరే, ఇది కాంగ్రెస్ పార్టీ… ఒరిగేది ఏమీ ఉండదు… పార్టీ పదవులు, అధికారిక పదవులకూ కొన్ని లెక్కలుంటాయి… మరి ఈ పెత్తనాల కొత్త ఒత్తిడి దేనికి పార్టీ మీద.,. ఇదెవ్వడూ ఆలోచించడు…
జనంలో ఉండేవాడికి తెలుసు, ఆ ఖర్చు ఏమిటో, ఆ ప్రయాస ఏమిటో… కానీ ఈమె అకస్మాత్తుగా వచ్చి అందరిపై స్వారీ చేయడం ఏమిటో…! అందరిలోనూ ఈ అసంతృప్తి ఉంది, మేమేమైనా ఈమెకు దాసులమా అనే ఫీలింగ్ ఉంది… కానీ బయటికొచ్చి చెప్పేవాళ్లు ఎవరు..? వినేవాళ్లు ఎవరు..?
నిరాడంబరాలు, గాంధేయవాది ఎట్సెట్రా భుజకీర్తులు వోకే, అది వ్యక్తిగతం, దాంతో పార్టీకి ఏం ప్రయోజనం..,? పార్ఠీ వ్యవహారాలు చూడటానికి ఒక ఖర్గే, ఒక కేసీ వేణుగోపాల్, ఒక రాహుల్, ఒక సోనియా, ఒక అహ్మద్ పటేల్ వంటి శివకుమార్ ఉన్నారు…
పైగా స్థానిక కుల, ప్రాంత, మత, వర్గ సమీకరణాలు ఆలోచించి వ్యవహరించే పీసీసీ అధ్యక్షుడున్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులున్నారు… వాళ్లను కాదని సొంతంగా ఓ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించడం ఏమిటి అసలు..? ఆమె ఏమైనా ఈ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీయా..?
వైఎస్ఆర్ పీరియడ్‌లో కూడా ఇన్‌చార్జులు ఉండేవాళ్లు, వచ్చేవాళ్లు, కేవీపీని కలిసేవాళ్లు… ఏవేవో బరువైన సూట్‌కేసులు మోసుకుంటూ వెళ్లిపోయేవాళ్లు… అంతేగానీ లేని పెత్తనాన్ని రుద్దే ప్రయత్నం చేయలేదు ఫాఫం…
పోనీ, ఇంత ఓవరాక్షన్ చేసినా సరే, తను చేయగలిగేది ఏమిటి..? ఏదో తోచిన రిపోర్టు ఎఐసీసీకి ఇవ్వడమే కదా… వాళ్లకు అవసరమైతే వాడుకుంటారు, లేకపోతే చెత్తబుట్టలో పడేస్తారు… అదే జరిగేది… ఇప్పుడున్న స్థితిలో కర్నాటక వట్టిపోయింది, హర్యానా మొత్తానికే జీరో… కాస్తో కూస్తో పార్టీ, డబ్బులు, యవ్వారాలు చూసేది జస్ట్, తెలంగాణ మాత్రమే…
అలాంటప్పుడు లోకల్ పార్టీకో, ప్రభుత్వానికో కాళ్లల్లో కట్టెపుల్లలు పెట్టకూడదు… ఈ తెలంగాణ జనం మనోభావాలు ఏమిటో, ఉద్వేగాలు ఏమిటో, అవసరాలు ఏమిటో, ఖజానా దుస్థితి ఏమిటో ఇక్కడి నేతలకు, ఇక్కడి ప్రభుత్వానికి తెలుసు… ఏవో తిప్పలు పడతారు… నడుమ నీకెందుకమ్మా ఈ పెత్తనాల నృత్యాలు..?! ఫాఫం తెలంగాణ కాంగ్రెస్..!!
Share this Article