ఒక పాట గురించి చెప్పాలి… చెప్పుకోవాలి… కానీ నేపథ్యం కాస్త సుదీర్ఘం… అవసరమే… రాబోయే ఆ సినిమా పేరు 18 పేజెస్… నిఖిల్ హీరో, అనుపమ హీరోయిన్… దిల్ రాజు, సుకుమార్ కాంబినేషన్… ఓ పాట రిలీజ్ చేశారు… పాడింది పృథ్విచంద్ర, సితార కృష్ణకుమార్, సంగీత దర్శకత్వం గోపీసుందర్… నన్నయ రాసిన అనే పాట… బాగుంది… అఫ్‌కోర్స్, అద్భుతం కాదు… ఆముదం చెట్టు… ఐనా స్పష్టంగా, పెద్దగా, పచ్చగా కనిపిస్తోంది… కారణం…
ఆ తెలుగు రాని, పాడలేని, తెలుగంటే గౌరవం లేని సిధ్ శ్రీరాం బదులు ఒక పృథ్వీచంద్రకు చాన్స్ ఇవ్వొచ్చు కదా… పోనీ, కారుణ్య, హేమచంద్ర, శ్రీరామచంద్ర … ఎందరు లేరు..? పాటను, భాషను ప్రేమించేవాళ్లు… కానీ థమన్లు, డీఎస్పీలు, మణిశర్మలు ఇవ్వరు కదా… తెలుగు పలకలేని గొంతులే కావాలి… పోనీ, మాధుర్యం ఏమైనా ఏడ్చిందా..? అదీ లేదు… నన్నయ రాసిన అనే పాటలో పృథ్విచంద్ర గొంతు మంద్రంగా, హృద్యంగా, లలితంగా, స్పష్టమైన ఉచ్ఛరణతో ప్లజెంటుగా సాగింది…
విశేషంగా చెప్పుకోవాల్సింది ఫిమేల్ సింగర్ సితార గురించి… ప్రస్తుతం మలయాళంలో టాప్ సింగర్… ఆహా… ఆ గొంతులో శ్రావ్యత వినాలంటే ఈ నన్నయ రాసిన పాట వినాలి… ఏదో గమ్మత్తు, మహత్తు ఉంది ఆమె గొంతులో… నిజానికి ఆ పాటకు పృథ్విచంద్రను, సితారను ఎంపిక చేసుకోవడంలో అభిరుచి ఉంది ఆ సంగీత దర్శకుడికి… ఆమె తెలుగులోనూ రెండుమూడు పాటలు పాడినట్టుంది…
Ads
పుష్ప మలయాళ వెర్షన్‌లో సామీ సామీ పాట పాడింది ఆమే… (తెలుగులో ఇంద్రావతి పాడిన ఊ అంటావా పాటను మాత్రం రమ్య నంబీశన్ పాడింది… ఇద్దరూ ఎక్కడికో వెళ్లిపోయారు…) అన్నట్టు సితార పాటగత్తె మాత్రమే కాదు… కంపోజర్, లిరిసిస్ట్, క్లాసికల్ డాన్సర్, అప్పుడప్పుడూ నటి… అనేక దేశాలు తిరిగి ఫోక్, క్లాసిక్ ఫ్యూజన్ కచేరీలు చేసింది…
ఇవి కాదు… లిరిసిస్ట్ శ్రీమణి గురించి చెప్పాలి… తను కొత్తేమీ కాదు.,. ఆరడుగుల బుల్లెట్టు పాట రాసింది తనే… లలిత పదాలతో ఓ పాట అల్లాడు… ఏ కన్ను ఏ కలను కంటున్నదో ఏ రెప్పయినా తెలిపేనా… ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైనా చూపేనా అంటూ ఓ లలితగీతంలా మెలోడియస్‌గా సాగింది… దరిద్ర పదాల్ని ఇరికించలేదు…
రాధేశ్యామ్ పాటలు చూశాక కలిగిన వైరాగ్యాన్ని, మణిరత్నం చెత్త ఎంపిక అనంతశ్రీరాం రాసిన పదాలు మరింత పెంచేశాయి… రాక్షస మావయ్య, రాత్రికే సూర్యుడట… వోకే… కానీ కత్తుల్ని కక్కడం ఏమిటో… గోవై ఉండటం ఏమిటో… ఆ మావయ్య తనకుతాను కంసుడిని అని చెప్పుకోవడం ఏమిటో… అండాండం, పిండాండం పదాలెక్కడి నుంచి వచ్చాయో… అసలు ఈ అనంత శ్రీరాముడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఖర్మ…
చంద్రబోస్ కూడా అంతే కదా… ప్యూర్ తెలంగాణ పాట అంటూ ఆర్ఆర్ఆర్ పాటకు సపోర్ట్ చేశాడు… చెడ్డ నాటు అనేది ఓ వికృత, కల్పిత పదం కాదా..? పైగా ఇవన్నీ కుమ్రం భీం కాలం నాటి పరిభాషట (పరిభాష అంటే ఓసారి డిక్షనరీ చూడు బోస్)… పిచ్చ నాటు అనే పదంలో పిచ్చ అనే పదానికి తెలంగాణలో అర్థం తెలియదా బోస్..? కీసుపిట్ట కూసింది సరే, పొలంగట్టు మీద పోట్లగిత్త రంకెలేస్తూ పరుగులు తీసిందా..? గిత్త అనేది కూడా తెలంగాణ పదమేనా..? రాజమౌళికి, కీరవాణికి తెలంగాణ పదాలు తెలియవు, వాళ్లకు అక్కరలేదు, కానీ ఏవేవో పిచ్చి పదాలను సృష్టించి, వాళ్ల కళ్లకు గంతలు కట్టినట్టే తెలంగాణ సమాజానికి కూడా కట్టేయగలవా..? చివరకు పోలేరమ్మ జాతరను కూడా తెలంగాణలోకి పట్టుకొచ్చినవ్… వారెవ్వా, బోస్…
నిజానికి చంద్రబోస్ అనంత శ్రీరాం సుద్దాల తదితరుల పనైపోయింది… సరిగ్గా ఎంకరేజ్ చేయాలే గానీ బోలెడు మంది కొత్త రచయితలు కొంగొత్త కంటెంటుతో అలరించడానికి రెడీగా ఉన్నారు… సినిమాలో నటుల గురించి అడుగుతున్నారా..? నిఖిల్ వోకే… కానీ అనుపమ మాత్రం చూస్తున్నంతసేపు ప్లజెంటుగా ఉంది… ఈ పాట స్పిరిట్ సినిమా మొత్తం కనిపిస్తే, మంచి ప్రయత్నమే అవుతుంది…
Share this Article