Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిన్నా ఈరోజు వాట్సప్ గ్రూపుల్లో బాగా వైరల్ అవుతున్న ఓ వీడియో…

November 19, 2024 by M S R

.

నిన్నా ఈరోజు వాట్సప్ గ్రూపుల్లో బాగా వైరల్ అవుతున్న ఓ వీడియో…

బాగుంది… హ్యూమన్ ఇంటరెస్టింగ్ స్టోరీలే కానరాని నేటి మీడియా ప్రాధాన్యాల్లో ఈ పోస్టు కనెక్టయ్యేలా ఉంది… సున్నిత మనస్కులైైతే అనివార్యంగా కళ్లల్లో నీళ్లు వస్తాయి…

Ads

మనం మళ్లీ మళ్లీ చెప్పుకునే డెస్టినీ అంటే ఇదేనేమో… (ఇది సోషల్ మీడియా పోస్టు… చివరలో వీడియో లింక్ కూడా ఉంది…)

ఆరు సంవత్సరాల క్రితం ఒకాయనకు మతిస్థిమితం తప్పింది… ఎక్కడో తప్పిపోయాడు…ఇద్దరు బిడ్డలు తన కోసం వెతుకుతూనే ఉన్నారు… కనిపించడం లేదు… రోడ్ల వెంబడి, తమకు తెలిసిన ప్రాంతాల్లో వెతుకుతున్నారు… కనిపించిన వాళ్లకల్లా చెబుతూనే ఉన్నారు…

ఆయన పేరు బాలయ్య… జుబిలీ హిల్స్ పెద్దమ్మగుడి పరిసర ప్రాంతాల్లో అటూ ఇటూ తిరుగుతుంటే తనను మాతృదేవోభవ అనాథాశ్రమంలో చేర్చుకున్నారు… అక్కడే ఉంటున్నాడు…

అక్కడికి అదే బాలయ్య బిడ్డలు తరచూ అన్నదానం చేయడానికి వస్తుంటారు… నెల రోజుల క్రితం కూడా అదే అనాథాశ్రమానికి వచ్చిన బాలయ్య కూతుళ్లు దివ్య, లావణ్య తమ నాన్న తప్పిపోయాడనీ, మతిస్థిమితం సరిగ్గా లేదని, వెతుకుతున్నామని అనాథాశ్రమం నిర్వాహకులకు కూడా చెప్పుకుంది… ఎక్కడైనా కనిపిస్తే చెప్పండని వేడుకున్నారు…

మళ్లీ నిన్న కూడా బాలయ్య కూతుళ్లు ఇద్దరూ అన్నదానం జరిపించడానికి వచ్చారు ఆ ఆశ్రమానికి… అక్కడ 130 మంది వరకూ ఉన్నారు… అక్కడ అనుకోకుండా ఆ ఆశ్రమవాసుల్లో తండ్రి కనిపించగానే గుర్తుపట్టారు… కన్నీళ్లు తన్నుకొచ్చాయి… వెళ్లి హత్తుకున్నారు ప్రేమగా… ఆర్తిగా…

మొదట వారిని చూసి కంగారుపడినా తరువాత స్థిమితంగా చూసి… బిడ్డల్ని గుర్తుపట్టాడు… పేర్లు చెప్పాడు… నాన్నను మేం తీసుకుపోతామని, జాగ్రత్తగా చూసుకుంటామని నిర్వాహకులకు హామీ ఇచ్చారు… కూతుళ్లు, వాళ్ల పిల్లలతో ఆ తండ్రి ఆశ్రమం విడిచి మళ్లీ ఇల్లు చేరాడు…

చిన్న కథే… కానీ ఆ సీన్ చూస్తే కనెక్టవుతుంది… ఇదీ ఆ సీన్… https://www.facebook.com/telugumuchata/videos/927602219292799

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions