ప్రతి మనిషి జీవితం లో ఏదో ఒకటి తక్కువ లేదా మిస్ అయ్యి ఉంటుంది (మిస్సింగ్ టైల్ సిండ్రోం)
మనం సకల సౌకర్యాలు ఉండి 100 కోట్ల భవనంలో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. కానీ, ఒకాయన 100 కోట్లతో ఒక భవనం కట్టించాడు. అనుకూలవతి అయిన భార్య, చెప్పిన మాట వినే పిల్లలు, మంచి స్నేహితులు ఉన్నారు ఆయనకి.
అయితే భవనానికి సీలింగ్ వేయించేటప్పుడు మాత్రం ఫలానా రకం రాళ్ళు 10 కోట్లతో కొన్నాడు, అవే చివరి పీస్ లు. అలాంటివి ప్రపంచంలో ఇంకా ఒక పీస్ కూడా లేదు. కానీ ఖచ్చితంగా ఒక్క పలక మందం సరిపోలేదు, అక్కడ వేరేది వేశారు.
Ads
ప్రతి రోజూ అది చూసి కుమిలిపోయేవాడు. అరేయ్, ఇంకొక్క పీస్ దొరికి ఉంటే ఎంత బాగుండేది, అక్కడ కూడా అదే వేయించేవాడిని అని తరచూ అదే ఆలోచనతో కొన్ని రోజులకి చనిపోయాడు…
ఎంత పిచ్చి పని అనిపిస్తుంది కదా..! నిజానికి మనం అందరం అదే చేస్తున్నాం. ప్రతి మనిషి జీవితంలో కానీ, చుట్టు పక్కల కానీ ఎప్పుడూ ఏదో ఒకటి మిస్ అయ్యి ఉంటుంది. దాన్నే పట్టుకొని ఆలోచిస్తూ బాధపడే బదులు మనకున్న. మన చుట్టు పక్కలా ఉన్న మంచిని చూడాలి.
మన జీవితంలో తక్కువ లేదా మిస్ అయిన దాని గురించి ఆలోచిస్తూ మనస్సు పాడుచేసుకోటానికి, 100 కోట్ల భవనంలో మిగతావన్నీ ఉన్నా మిస్సింగ్ అయిన టైల్ గురించి ఆలోచిస్తూ జీవితం పాడుచేసుకోటానికీ తేడా యేంటి..?
మనకి లేదా మన జీవితంలో మిస్సింగ్ అయిన వాటి గురించి ఆలోచించే బదులు (వేరే వాళ్లకి ఉన్న వాటితో పోల్చుకునే బదులు) మనకున్న వాటి గురించి కృతజ్ఞతతో ఉండి ఆనందంగా ఉండాలి అంటారు పెద్దలు… (జగన్నాథ్ గౌడ్)
Share this Article