.
ఈ స్టోరీ తెలంగాణ సీఎం శ్రీమాన్ రేవంత్ రెడ్డి కోసం… ఎక్కడో మాట్లాడుతూ మోడీ బీసీ కాదు, అగ్రవర్ణం, తను సీఎం కాగానే తన కులాన్ని బీసీల్లో కలుపుకున్నాడు… తను బీసీ అంటాడు, పక్కా అగ్రవర్ణం పోకడలు అని ఏవేవో రాజకీయ అపరిపక్వ వ్యాఖ్యలకు దిగాడు…
ఇలాంటి మాటలు తనకు అలవాటే… మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అట… అన్నీ తెలుసుకునే చెబుతున్నాను అంటున్నాడు… సరే, మనకు తెలిసింది మనం చెప్పాలి కదా… అప్పట్లో చంద్రబాబు మోడీ భార్య విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ… పెళ్లాన్ని ఏలలేనోడు దేశాన్ని ఏం ఏలుతాడు అనే చిల్లర వ్యాఖ్యలు చేసినట్టు గుర్తు… ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి తనను మించినోడు కదా…
సరే, ఏడాది క్రితం రాహుల్ గాంధీ కూడా మోడీ కులంపై పిచ్చి విమర్శలు చేశాడు… ఆ సందర్భంగా ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన కథనం ఇదుగో…. మరోసారి…
Ads
ఫిబ్రవరి 9, 2024…. రాహుల్ అనేకసార్లు తెలిసి మాట్లాడతాడో, తెలియక తప్పులో కాలేస్తాడో అర్థం కాదు… కానీ అభాసుపాలు అవుతుంటాడు… అప్పట్లో మోడీ పేరున్నవాళ్లంతా దొంగలే అని వ్యాఖ్యానించి లీగల్ చిక్కుల్లో పడ్డాడు, కొంతకాలం పార్లమెంటు సభ్యుడిగా అనర్హతకు కూడా గురయ్యాడు తెలుసు కదా… ఇప్పుడేమంటున్నాడూ అంటే… మోడీ అసలు ఓబీసీ కాదు, బీజేపీ ప్రభుత్వం ఆ కులాన్ని ఓబీసీల్లో కలిపింది గానీ ఒరిజినల్‌గా ఓసీలే అంటున్నాడు…
ఒడిశాలోని బెల్‌పహార్‌లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ తను ఈ వ్యాఖ్యలు చేశాడు… మోడీని బీసీలు ఓన్ చేసుకోవద్దు, తను బీసీ కాదు అని చెప్పడం పొలిటికల్ వ్యూహం అని ఎవరో చెప్పినట్టున్నారు ఫాఫం… కానీ మోడీ కులానికి సంబంధించిన చరిత్ర తనకేమీ తెలియదని బయట పెట్టుకున్నాడు… తనకు తెలియనిది ఏమిటంటే..? మోడీ కులం తేలి… చత్తీస్‌గఢ్‌లో ఇది ఎస్టీ జాబితాలో ఉంది… అంతేకాదు, బీజేపీ ప్రభుత్వం జార్ఖండ్‌లో కూడా ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నించింది…
గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని తేలి కులంలో కొందరు ముస్లింలు కూడా ఉన్నారు.,. అది బేసిక్‌గా నూనె గానుగను ఆడించి, నూనె అమ్ముకునే వ్యాపారుల కులం… పలుచోట్ల వైశ్యుల ఉపకులంలో ఉంటుంది ఈ కులం… కొందరు ఈరోజుకూ గుప్త అని సర్‌నేమ్ పెట్టుకుంటారు…
మోడీ తేలి ఉపకులాల్లోని మోధ్ ఘాంచీ కులానికి చెందినవాడు… ఇదేకాదు… ఘాంచి (ముస్లిం), తేలి సాహు, తేలి రాథోడ్, తేలి రాథోర్ ఇవన్నీ సదరు తేలి ఉపకులాలే… అన్నీ బీసీ జాబితాలో ఉన్నవే… ఇది మోడీ కోసం బీసీల్లో చేర్చడం కాదు… 2000లో ఇలా బీసీల్లో చేర్చారు… కానీ మోడీ గుజరాత్ సీఎం అయ్యింది 2001లో…
ఈ తేలి కులం ఉత్తరప్రదేశ్‌లో కూడా ఉంటుంది… బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఓబీసీయే… మరొకటి… మోడీ అనేది కులం కాదు… అది జస్ట్, ఇంటి పేరు మాత్రమే… తేలి కులస్థుల్లో ఈ ఇంటి పేరు ఎక్కువ… కానీ ఈ మోడీ ఇంటిపేరు ముస్లింలు, హిందూలు, పార్శీల్లో చాలా కుటుంబాలు పెట్టుకుంటాయి… వైశ్యులు, పోర్‌బందర్ ఏరియాలోని మత్స్యకారులు, వ్యాపార కులానికి చెందిన లోహనాలకు కూడా మోడీ ఇంటి పేరుంటుంది…
నీరవ్ మోడీ వంటి వ్యాపారులు ఎక్కువగా వజ్రాల వ్యాపారంలో ఉన్నారు… టాటా స్టీల్ మాజీ చైర్మన్ రూసీ మోడీ, ఫిలిమ్ పర్సనాలిటీ సోహ్‌రబ్ మోడీ పార్శీలు… మోడీ అనే ఇంటిపేరులో దాదాపు 13 కోట్ల మంది ఉన్నారని రాహుల్ మీద కేసు వేసిన పూర్ణేష్ మోడీ చెబుతున్నాడు…
సో, మోడీ కులాన్ని, ఇంటి పేరును పదే పదే గెలకడం రాహుల్‌కు పొలిటికల్‌గా యూజ్ ఫుల్ కాదు, పైగా తనకే కొంత నష్టం కూడా…! మోడీ మతం సెంట్రిక్ రాజకీయాలు చేస్తుంటే, అది చేతగాక, చేయలేక ఇలా కులాల మీద రచ్చ చేస్తున్నాడనే చెడ్డ పేరు వస్తుంది…!! సరే, మోడీ కులం ఏదైతేనేం… తను రైలు స్టేషన్‌లో చాయ్ అమ్ముకుని బతికే ఓ పూర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవాడే… అది మాత్రం నిజం…!!
.
రేవంత్ వ్యాఖ్యలతో వెంటనే స్పందించిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఏలేటి, బండి సంజయ్, రఘునందన్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ తదితరులు మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీది ఏ మతం..? ఏ కులం..? ఇది ముందు క్లారిటీ ఇవ్వు అని తిప్పికొట్టారు… అవునూ, నిజంగానే రాహుల్ గాంధీది ఏ మతం..? ఏ కులం..?
Share this Article