ఆస్తులు లాక్కుంటుంది, పుస్తెలు సహా మైనారిటీలకు పంచుతుంది కాంగ్రెస్… ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కూడా మైనారిటీలకు మళ్లిస్తుంది… హనుమాన్ చాలీసా కూడా చదవనివ్వడం లేదు….. పదేళ్లు ఈ దేశాన్ని పాలించిన ప్రధాని, మళ్లీ గద్దెనెక్కుతాడని సర్వేలు ఘోషిస్తున్న ప్రధాని మోడీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు…
ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ అభ్యర్తి, ఇంకెవరో చోటా నాయకుడి నోటి నుంచి వస్తే… ఎన్నికల కదా అదుపు తప్పి మాట్లాడుతున్నారు, వాళ్ల రేంజ్, పరిపక్వత అంతేలే అనుకోవచ్చు… కానీ ఇంత సుదీర్ఘమైన కెరీర్ ఉన్నవాడు, ఇంకా ఆశిస్తున్న తన నుంచి ఈ భాష అంచనా వేయలేదు… తొలి దశ పోలింగ్ ముగిసీ ముగియగానే మోడీ భాష మారిపోయిందేం..? 370, 400 సీట్ల భరోసాలు చెదిరిపోతున్నట్టుగా ఉందా..? తేడా కొడుతోందా..?
పోనీ, మైనారిటీల కోసం కాంగ్రెస్ ఏదైనా చేయగలదు అని హిందువులను రెచ్చగొట్టడమే ఎన్నికల ప్రచారవ్యూహం అయ్యే పక్షంలో అది నీచస్థాయి ఎత్తుగడగా చెప్పుకోవచ్చు… ఎస్, బీజేపీ ఆశ మొత్తం హిందూ వోట్ల సంఘటన మీదే… కానీ ఇలాంటి వ్యాఖ్యలతో ఆర్టికల్ 370 రద్దు, ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య నిర్మాణం వంటి హిందూ పాజిటివ్ వోటును చేజేతులా చెడగొట్టుకుంటున్నట్టే… మోడీ తనను తాను డిగ్రేడ్ చేసుకుంటున్నట్టే… సీపీఎం ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్లింది…
Ads
ఎస్, ప్రతిపక్షం కూడా ఏమీ సక్కగా లేదు, కానీ దానికి మోడీ నుంచి ఈ కౌంటర్ స్ట్రాటజీ సరికాదు… మోడీ గెలిస్తే రాజ్యాంగం ఉండదు, మళ్లీ ఎన్నికలు ఉండవు అని కాంగ్రెస్ ఆరోపించింది… రాజ్యాంగం రద్దు ఎవరి వల్లా కాదు అని ఇదే మోడీ ఎక్కడో జవాబు ఇచ్చాడు, చాలు… తను ఏదైనా అంటే, దాన్ని పట్టుకుని తమ ఫాయిదా కోసం దాడి చేయడానికి కాంగ్రెస్ రెడీగా ఉంటుందని మోడీ మరిచిపోయినట్టున్నాడు… యోగీ కూడా మోడీ భాషనే పట్టుకున్నాడు… కాంగ్రెస్ వస్తే షరియా పాలనే అన్నాడు ఎక్కడో…
మోడీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, కాంగ్రెస్ వస్తే వెల్త్ సర్వే చేసి తక్కువ లబ్ధి పొందిన వాళ్లకు సంపద అందేలా చేస్తాం అనే కాంగ్రెస్ మాటలూ మోడీని కౌంటర్ వ్యాఖ్యలు చేసేలా ప్రేరేపించాయేమో… కానీ కౌంటర్లు పరుషంగా, కటువుగా ఉన్నాయి… తాళిబొట్లు కూడా వదలరు అనే కామెంట్ మోడీ వెంట రాగానే… నా తల్లి ఈ దేశం కోసం తన తాళిబొట్టు అర్పించింది అని ప్రియాంక అందుకుంది వెంటనే… (ఆమె క్రిస్టియన్ కదా, తాళి బొట్టు ఉంటుందా అనేది ఓ పిచ్చి సోషల్ మీడియా సందేహం, తన భర్తను ఈ దేశం కోసం అర్పించింది అనేదే అసలు అర్థం…)
ఎవరో గోవా లీడర్ ‘గోవా విముక్తం కాగానే రాజ్యాంగాన్ని రుద్దారు’ అని ఎక్కడో కూశాడు… మళ్లీ ద్వంద్వ పౌరసత్వం కావాలట… తెల్లారిలేస్తే లక్ష నీతులు చెప్పే సీపీఎం ఎమ్మెల్యే ఒకాయన ‘రాహుల్ గాంధీ అసలు గాంధీ కుటుంబంలో పుట్టినవాడేనా..? డీఎన్ఏ టెస్టు చేయించాలి’ అని మరీ నీచమైన, దిగజారుడు విమర్శకు దిగాడు… మళ్లీ ఇదే సీపీఎం, ఇదే కాంగ్రెస్ ‘యాంటీ-బీజేపీ’ ఇండి కూటమి పొత్తుదారులు… ఇది మరో ట్రాజెడీ…
కోరల్లేని కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయగలదు అనేది మరో ప్రశ్న… కేసీయార్ భాషను ఆక్షేపించింది సంఘం, నోటీసు ఇచ్చింది, ఏమైంది..? ఏమీ లేదు..! చంద్రబాబు భాష మీదా అంతే… ఇంకా పత్రికలకు ఎక్కని ఇలాంటి ‘ఉల్లంఘనలు’ బోలెడు ఉండవచ్చు… గతంలో ఎన్నడూ లేనంత ద్వేషం, విషం, సంస్కారరాహిత్యం ఈసారి ఎన్నికల్లో కనిపిస్తోంది… ఇక మీడియాలో పెయిడ్ ఆర్టికల్స్ సరేసరి…
Share this Article