.
ఏయ్, నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఈ ఏపీ వణుకుద్ది!…. అని బాలయ్యలాగా హైపిచ్ డైలాగులు వదల్లేదు ఇండియా… అసలే విదేశాంగం చూసేది జైశంకర్ కదా… సైలెంట్ వాతలు పెడతాడు…
అమెరికా ట్రంపుడికి జరిగింది అదే… ఇండియాను రకరకాల టారిఫ్‌ల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి, తనకు అనుకూల ట్రేడ్ డీల్ కోసం ఒత్తిడి చేస్తున్నాడు కదా… మోడీ టీమ్ సైలెంటుగా సమాధానం ఇచ్చింది… ట్రంపరి బిత్తరపోయేలా… వివరాల్లోకి వెళ్తే…
Ads
ప్రపంచ దేశాలన్నింటినీ తన ‘టారిఫ్’ మంత్రంతో వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది… “నువ్వు కొట్టినట్టు చేయి.. నేను ఏడ్చినట్టు చేస్తా” అనే టైపు కాకుండా, “నువ్వు కొడితే సౌండ్ వస్తుంది… నేను కొడితే నొప్పి మాత్రమే తెలుస్తుంది…” అన్నట్టుగా మోడీ సర్కారు సైలెంటుగా పని కానిచ్చేసింది…
సీన్ కట్ చేస్తే.. ఏం జరిగిందంటే?
గతంలో భారత్ పై ట్రంప్ టారిఫ్ ల మోత మోగించిన సంగతి తెలిసిందే… రష్యా నుంచి చమురు కొంటున్నారని ఒకసారి, గ్రీన్ ఎనర్జీ అని మరోసారి… ఇలా రకరకాల వంకలతో భారత ఉత్పత్తులపై టారిఫ్ ను ఏకంగా 50 శాతానికి పెంచేశారు… ట్రంప్ నానా హడావుడి చేస్తూ గీ పెడుతుంటే, ఇండియా మాత్రం చాలా కూల్ గా పావులు కదిపింది…
నిశ్శబ్ద వ్యూహం…: అమెరికా నుంచి వచ్చే తృణధాన్యాలు, ముఖ్యంగా బఠాణీలు, పప్పు దినుసులపై భారత్ 30 శాతం టారిఫ్ విధించింది…
ప్రచారం లేదు.. ఆర్భాటం లేదు…: ఈ నిర్ణయాన్ని అక్టోబర్ లోనే తీసుకున్నా, ఎక్కడా పెద్దగా డప్పు కొట్టుకోలేదు… నవంబర్ నుంచి వసూళ్లు కూడా మొదలైపోయాయి…
దెబ్బ ఎక్కడ తగిలిందంటే…: అమెరికాలోని నార్త్ డకోటా, మొంటానా వంటి రాష్ట్రాల్లో పప్పు దినుసుల సాగు ఎక్కువ… అక్కడి రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు…
సెనేటర్ల లేఖతో గుట్టు రట్టు!
మూడున్నర నెలలుగా ఈ టారిఫ్ వసూళ్లు జరుగుతున్నా ప్రపంచానికి తెలియలేదు… కానీ, అమెరికా సెనేటర్లు కెవిన్ క్రేమర్, స్టీవ్ డెయిన్స్ ట్రంప్ కు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది… “అయ్యా ట్రంప్ గారూ… ప్రపంచంలో పప్పులు ఎక్కువగా తినేది భారతీయులే… వాళ్లే మన పప్పుల మీద సుంకం బాదితే మా రైతులు మునిగిపోతారు… వెంటనే మోదీతో మాట్లాడి దీన్ని తొలగించండి” అంటూ వారు మొరపెట్టుకున్నారు…
ఇది పాత కథే కానీ కొత్త ట్విస్టు!
నిజానికి 2019లో కూడా ట్రంప్ ఇలాగే ప్రవర్తిస్తే, భారత్ అప్పట్లోనూ గట్టిగానే బుద్ధి చెప్పింది… అప్పుడు కూడా ట్రంప్ స్వయంగా మోదీకి లేఖ రాసి బతిమిలాడుకోవాల్సి వచ్చింది… ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతోంది…
ముచ్చటగా మూడు ముక్కలు…
ట్రంప్ ది “అరవడం” అయితే… మోడీది “అమలు చేయడం”…
వాణిజ్య యుద్ధంలో అమెరికా ‘హడావుడి’ చేస్తే, భారత్ ‘వ్యూహత్మక నిశ్శబ్దం’…
అమెరికా మార్కెట్ కోసం ఇండియా పట్టుబడుతుంటే, ఇండియా మార్కెట్ పోతుందని అమెరికా వణికిపోతోంది…
బాటమ్ లైన్: అమెరికా తన వ్యవసాయ, పాడి ఉత్పత్తులను భారత మార్కెట్లోకి జొప్పించాలని ఎప్పటి నుంచో చూస్తోంది… కానీ, మన దేశీయ రైతుల ప్రయోజనాల విషయంలో మోడీ సర్కారు “నో కాంప్రమైజ్” అంటోంది… “నువ్వు టారిఫ్ వేస్తే.. మేమూ వేస్తాం” అంటూ అమెరికా భాషలోనే సమాధానం చెప్పడం ఇప్పుడు నెటిజన్లకూ భలే కిక్కు ఇస్తోంది…
మోడీ, జైశంకర్, పీయూష్ గోయల్, దోవల్... ఇది డెడ్లీ ట్రయాంగిల్... ఒకరు స్వేచ్ఛనిస్తారు, మరొకరు కౌంటర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు, ఇంకొకరు పరిణామాల్ని అంచనా వేసి రెడీగా ఉంటారు, వేరొకరు అమలు చేస్తారు...
Share this Article