Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో చిరంజీవి పక్కన ఓ జీరోయిన్..! హీరో అనంతనాగ్ భార్య..!!

January 3, 2025 by M S R

.

చిరంజీవి మాంచి ఫాం లోకి వచ్చేసాడు ఈ సినిమాలో . నటన పక్వ దశకు చేరింది . గుబురు మీసాలలో నుంచి చిన్న మీసాలలోకి వచ్చేసాడు . ఆ తర్వాత సన్న మీసాలలోకి కూడా వచ్చాడనుకోండి .

హుషారుగా , చలాకీగా , హుందాగా , బేలన్సుడుగా నటించిన ఈ సినిమా 1980 లో వచ్చింది . పేరు మొగుడు కావాలి . ఆరు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . గుంటూరులో నాజ్ అప్సర . మిగిలిన అయిదు విజయవాడ , విశాఖపట్నం , కాకినాడ , రాజమండ్రి , హైదరాబాదు.

Ads

చిరంజీవికి తోడు నూతన్ ప్రసాద్ . బాగా నటించాడు . Too bad too worst అంటూ ప్రత్యేకమైన డైలాగుల్ని పెట్టారు . ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ పేరు గాయత్రి . కన్నడ హీరో అనంత నాగ్ భార్య . తెలుగులో ఈ సినిమా కాకుండా పెళ్ళి గోల అనే సినిమాలో మాత్రమే నటించింది .

ఎటువైపు నుంచి చూస్తే అందంగా కనిపిస్తుంది అని తారట్లాడాలి . నిర్మాత , దర్శకుడు ఎలా ఎంపిక చేసుకున్నారో అర్థం కాదు . చిరంజీవి దెబ్బకు ఇవన్నీ ప్రేక్షకులకు కనిపించలేదు . సినిమా సక్సెస్ అయింది .

ఈ గాయత్రి పంజాబీ… కన్నడ సినిమాలు చేసేది… పాపులర్ అప్పట్లో… తరువాత హీరో అనంతనాగ్‌ను పెళ్లిచేసుకున్నాక సినిమాలు మానేసింది… 

వీరిద్దరితో పాటు సువర్ణ , రమణమూర్తి , యస్ వరలక్ష్మి , తదితరులు నటించారు . సువర్ణ కూడా బాగా నటించింది . మంచి నటే , అందంగా కూడా ఉంటుంది . ఇండస్ట్రీలో నిలబడలేదు ఎందుకనో . తక్కువ పాత్రలతో ఉంటుంది సినిమా .

అద్దె మొగుడు / కాంట్రాక్టు మొగుడు సినిమా … బాబాయి , చిన్నమ్మలను మభ్యపరిచేందుకు మొగుడు కావాలి అని పేపర్లో వేయిస్తుంది హీరోయిన్ . చిరంజీవిని పట్టుకొని కాంట్రాక్టు ఎంటర్ అవుతుంది . బై ది వే , ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు కూడా చిరంజీవే .

సమాంతరంగా మరో జంట నూతన్ ప్రసాద్ , సువర్ణలు . నూతన్ ప్రసాద్ జులాయి . భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి , రోడ్ల మీద తిరిగే మగాధిక్యత పాత్ర . నూతన్ ప్రసాద్ తమ్ముడు చిరంజీవి . వదినా మరిది కలిసి నూతన్ ప్రసాదుకు , ఫస్ట్ హీరోయిన్ గాయత్రిలకు బుధ్ధి చెప్పటంతో సినిమా సుఖాంతం అవుతుంది .

హిందీలో బాగా ఆడిన మన్ చలీ అనే సినిమాకు రీమేక్ ఈ మొగుడు కావాలి . సంజీవ్ కుమార్ , లీనా చందవర్కర్ , మన్మోహన్ , నజీమా నటించారు . ఫేమిలీ సినిమాల దర్శకుడు కట్టా సుబ్బారావు దర్శకత్వంలో సినిమా బిర్రుగా నడుస్తుంది . సత్యానంద్ డైలాగులను బాగా వ్రాసారు .

జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . మొగుడు కావాలి అనే టీజింగ్ పాట , సన్నజాజి పందిట్లో సందెకాడా అనే పాటా బాగా హిట్టయ్యాయి కూడా . పాటలన్నీ చిరంజీవితోనే ఉంటాయి . అన్నీ వేటూరే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజలు పాడారు .

అన్ని పాటల్లో చిరంజీవి మార్క్ ఉంటుంది . అన్ని పాటలూ శ్రావ్యంగా ఉంటాయి . చక్కగా చిత్రీకరించబడ్డాయి . An 100% entertaining , family oriented , feel good movie . చూడబుల్ సినిమాయే . వాచ్ లిస్టులో పెట్టేసుకోవచ్చు . చిరంజీవి అభిమానులు అయితే తప్పక చూడాల్సిన సినిమా .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త ఉప రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్ మార్క్ శేషాద్రి రామానుజా చారి..?
  • ఈ గుడికి వెళ్లొచ్చిన కొన్నాళ్లకే ఇందిర హత్య… మరి మోడీ సందర్శన…?!
  • Run Away… విమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి..?
  • మైక్రోబరస్ట్..! కుండపోత కాదు, ఇది పైనుంచి కమ్మేసే ఓ సునామీ..!!
  • జీతెలుగు టీవీ సీరియల్ తీసేవాడికి చూసేవాడు పరమ లోకువ..!!
  • సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
  • 70 ఏళ్ల వయస్సులోనూ యంగ్‌గా, ఆరోగ్యంగా… భలే తల్లి..!!
  • ట్రంపు… డబ్బు కక్కుర్తి మాత్రమే… నో ఎమోషన్స్, నో మోరాలిటీ…!!
  • రీఎంట్రీ సరే గానీ… కుర్ర వేషాలకు సూటయ్యే సీన్ లేదయ్యా నవీనూ..!
  • ఈ తలనొప్పిని మీకు సమర్పించువారు…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions