Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కళాసేవ అనేది ఓ ట్రాష్… ఇక్కడేదీ ఉచితం కాదు… నేనూ డబ్బిస్తేనే నటిస్తా…

August 4, 2023 by M S R

Sai Vamshi……….   నేనెందుకు ఉచితంగా నటించాలి? … నేను డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అది చెప్పడానికి నాకేమీ నామోషీ లేదు. ఎవరైనా వచ్చి ‘మా సినిమాలో మీకు అద్భుతమైన పాత్ర ఉంది మేడమ్! చాలా గొప్ప పేరు వస్తుంది. మీరు ఫ్రీగా ఈ సినిమా చేయాలి’ అని అంటే ‘నాకు ఆ క్యారెక్టర్ అక్కర్లేదు’ అని నేరుగా చెప్పేస్తాను‌.

నన్ను తెర మీద చూపించి మీరు డబ్బు వసూలు చేస్తున్నప్పుడు నేనెందుకు ఉచితంగా నటించాలి? ఇదేమైనా దానమా, ధర్మమా? నేను మీ సినిమా కోసం కష్టపడుతున్నాను. నాకు ఇవ్వాల్సిన డబ్బు మీరు ఇవ్వండి. కావాలంటే కాస్త ఎక్కువో, తక్కువో ఇవ్వండి.

‘నేను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు. తృప్తి కోసం చేస్తున్నాం’ అనేది అబద్ధం. ఎవరూ ఎవరికీ ఇక్కడ ఏదీ ఉచితంగా చేయరు. ఏదైనా ఉచితంగా చేసినా, అందులో ఏదో ఒక లాభం ఆశిస్తారు. సినిమా అనేది పక్కా వ్యాపారం. ఎవరూ ఇక్కడ కళాసేవ చేయడానికి రాలేదు‌. డబ్బు అనేది లేకపోతే ఎవరూ ఎవర్నీ సరిగా గుర్తించరు. గౌరవించరు. మీకొక ఉదాహరణ చెప్తాను.

Ads

చాన్నాళ్ల క్రితం నటి గౌతమి, నేను కలిసి ఒక సినిమాలో నటించాం. ఆ సినిమా నిర్మాత గారి భార్య అప్పుడప్పుడూ సెట్‌కి వచ్చేవారు. చాలా సౌమ్యంగా ఉండేవారు. భోజనం చేశారా అని అడిగితే “ఆయన తిన్నాక తింటాను” అనేవారు. ఏది మాట్లాడాలన్నా తన భర్త అనుమతి కోసం చూసేవారు.

కొద్ది రోజులకు ఆ నిర్మాత చనిపోయారు. ఈ విషయం తెలిసి నేనూ, గౌతమి వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లాం. అందరూ ఏడుస్తున్నారు. నిర్మాత గారి భార్య మౌనంగా కూర్చుని ఉంది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఆమె పక్కకి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాలని చూశాను. వెంటనే ఆమె తన భర్తను గట్టిగా ఒక బూతు తిట్టి, “ఈ పాపిష్టోడు డబ్బంతా ఎక్కడ పెట్టాడో చెప్పకుండానే పోయాడే” అని అరిచింది.

ఆమె అన్న మాటలకు నాకు మామూలుగా నవ్వు రాలేదు. పక్కనే శవం ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి గట్టిగా నవ్వాను. ఆమె మాటలకు నా పక్కనే ఉన్న గౌతమి షాకైంది. ఆ తర్వాత నా నవ్వు చూసి ఇంకా షాకైంది. వెంటనే ఇద్దరం కారు దగ్గరికి వచ్చాం. కారు ఎక్కాక కూడా నవ్వుతూనే ఉన్నాను.

ఈ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వు వస్తూనే ఉంటుంది. అంత సౌమ్యమైన మనిషి కూడా తన భర్తపై ఆ స్థాయిలో కోపాన్ని చూపించింది. అప్పుడే నాకు అర్థమైంది. మనం చేయాల్సిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే మనం పోయాక కూడా మనల్ని తిట్టుకుంటూనే ఉంటారు. డబ్బే ఇక్కడ ప్రధానం… (ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో నటి లక్ష్మి చెప్పిన మాటలు..)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • *99 రోజుల ప్రోగ్రాం* వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యాలేంటి- సవాళ్లేంటి…!!
  • ‘‘ఏం..? ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు, తప్పేంటి..?’’
  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions