కేజ్రీవాల్ కేసుల్లో కొత్త ట్విస్టు.,. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హఠాత్తుగా తెర మీదకు వచ్చాడు… కేజ్రీవాల్ మీద ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాడు… మరింత బిగుసుకుంటోంది కేజ్రీవాల్ మెడ చుట్టూ… ఊపిరాడకుండా…
నిజానికి బీజేపీ ప్రభుత్వం లేట్ చేసింది… ఖలిస్థానీ శక్తులకు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్‌ను ఇన్నాళ్లూ ఉపేక్షించింది… చివరకు ఆప్ ఆ శక్తుల మద్దతుతో పంజాబ్‌లో పాగా వేసేదాకా కళ్లు తెరవలేదు… సాక్షాత్తూ తన కాన్వాయ్‌ను ఓ ఫ్లయి ఓవర్ మీద రెండు మూడు ట్రాక్టర్లతో అత్యంత భద్రతారాహిత్యంలోకి పడేసినా సరే మోడీకి చురుకు పుట్టలేదు… నెలల తరబడీ ఢిల్లీని దిగ్బంధించి, బజార్లలో వీరంగం వేసి, ఎర్రకోటపై జెండా ఎగరేసినా… ఆ వ్యవసాయ చట్టాల్ని తలవంచుకుని విత్ డ్రా చేసుకున్నాడు తప్ప కేజ్రీవాల్, తన మద్దతు శక్తుల మీద ఎదురుదాడి చేతకాలేదు…
ఇప్పుడు ఆయన మెడకు చుడుతున్న మద్యం కేసు కూడా పాతదే… కానీ తీరా ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంతో మోడీ మరింత బదనాం అయ్యాడు… ఆప్ బలానికి భయపడి, తనను ఎన్నికల్లో ప్రచారం చేయనివ్వకుండా అరెస్టు చేశారనే ఆరోపణలకు తనే కారకుడయ్యాడు… (కవిత అరెస్టు విషయంలోనూ మీనమేషాలు లెక్కించాడు…) దేశభద్రతకు, సమగ్రతకు ముప్పుగా వాటిల్లుతున్న ఓ ఉగ్రవాది కెనడాలో ఖతమైపోవడంతోనే ఇక ఢిల్లీ ఈ శక్తులను ఉపేక్షించకుండా ఇన్నాళ్ల శషభిషలకు స్వస్తి చెబుతోందని అర్థమైంది…
Ads
సరే, ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు అంటున్నాడు… (ఆల్రెడీ తనపై ఈడీ, సీబీఐ కేసులున్నాయి…) కానీ ఎన్ఐఏ దర్యాప్తు ఎందుకు.,.?
- దేవంద్ర భుల్లర్ అనే ఖలిస్థానీ నేత విడుదల కోసం ముడుపులు తీసుకున్నాడని ఆరోపణ… (ఈ భుల్లర్ 1993 ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితుడు… 2001లో మరణశిక్ష పడినా తరువాత యావజ్జీవం కిందకు మార్చారు…)
- సిఖ్స్ ఫర్ జస్టిస్, ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి ఆప్‌కు నిధులు అందాయని ఆరోపణ…
మద్యం కేసులో అరెస్టయినా సరే, ఇద్దరు ముగ్గురు మంత్రులు ఆల్రెడీ ఆ తిహాార్ జైలులోనే ఉన్నా సరే, ఎవరికీ కోర్టులు బెయిళ్లు ఇవ్వకపోతున్నా సరే… ఆప్ ఢిల్లీ ప్రభుత్వం అత్యంత అస్థిరంగా కనిపిస్తున్నా సరే… నిజానికి ఢిల్లీ ప్రభుత్వ అధికారాలే పరిమితం అయినా సరే… కేజ్రీవాల్ తను జైలులో నుంచే ప్రభుత్వాన్ని పాలిస్తాను, రాజీనామా చేయను అంటున్నాడు…
నిజానికి జైలు నుంచి పరిపాలన అనేది అసాధ్యమేమీ కాదు, కానీ క్లిష్టమైంది… పైగా ఒకసారి మరకలు పడ్డాక అలాగే కొనసాగడం అనైతికం అవుతుంది… సరే, ప్రజెంట్ పాలిటిక్సులో శుద్ధపూసలు ఎవరున్నారు..? ఎవరి చొక్కాలు తెల్లగా, శుభ్రంగా ఉన్నాయి అంటారా..? అవున్నిజమే… కానీ అందరూ వేరు, తెల్లారి లేస్తే లక్ష నీతులు చెప్పే కేజ్రీవాల్ వేరు… పైగా తన వెనుక దేశవిభజన కాంక్షించే శక్తులున్నాయి…
ఇన్నాళ్లకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అరెరె నాకూ అధికారాలుంటాయి కదా అని హఠాత్తుగా గుర్తొచ్చింది… నిజానికి ఢిల్లీ, పుదుచ్చేరి వంటివి సెమీ స్టేట్‌హుడ్… మరింత కఠినమైన, లోతు దర్యాప్తుకు తను ఆదేశించాడు… ఎప్పుడో తెలుసా..? ప్రచారం చేసుకోనివ్వకుండా ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్టు ఏమిటి..? బెయిల్ ఇచ్చే విషయం ఆలోచిస్తామని కోర్టు చెప్పి, తీర్పు రిజర్వ్ చేసింది కదా… వెంటనే మోడీ ప్రభుత్వం కేజ్రీవాల్ మెడ చుట్టూ పీటముడిని బిగించడానికి ఎన్ఐఏను రంగంలోకి తీసుకొస్తోంది… (కానీ కవిత కూడా తను స్టార్ క్యాంపెయినర్ కాబట్టి, ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలి కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరింది, కానీ కోర్టు రిజెక్ట్ చేసింది…) అవునూ, ఉగ్రవాద కేసుల్లో నిందితుడు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చా..?!
Share this Article