ఓ చిన్న ప్రాంతంలో కనిపించే కల్చర్‌ను ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తున్నారనే ఓ అభిప్రాయానికి కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి ఏమని బదులిస్తాడంటే… The more regional the story, the more universal it is… కథ ఎంత ప్రాంతీయం అయితే అది నిజానికి అంత విశ్వజనీనం అని… వివరణ బాగుంది… చాలామందికి ఓ పాఠం అది…
ఎంతసేపూ నగరాల్లోని పిచ్చి కల్చర్, అదీ సినిమా ఇండస్ట్రీలో కనిపించే సంస్కృతినే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెద్ద దర్శకులు ఎవరూ మన మూలాల్లోకి వెళ్లడం లేదు… మానవబంధాలను టచ్ చేయడం లేదు… ఈమధ్య కాలంలో బలగం సినిమా ఆవిషయంలో సక్సెస్… అదే విషయంలో రంగమార్తాండ ఫెయిల్యూర్… ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…
మన సినిమా హీరో అంటే… సూపర్ హీరో… బుల్లెట్ల వర్షంలోనూ క్రాఫ్ కదలకుండా పరుగెత్తే నాయకుడు… ఒక్క గుద్దుకు వంద మంది రౌడీలను బంగాళాఖాతంలోకి, ఖగోళంలోకి పంపించగల సూపర్ మ్యాన్… రొమాన్స్‌లో మన్మథుడు… రొటీన్ కథలు, ఇమేజీ బిల్డప్పులు… పరమ చెత్తా క్రియేషన్ మన కథలు… ఐనాసరే వందలు, వేల కోట్లను జనం ధారబోస్తుంటారు… ఈ చీకటిలో అప్పుడప్పుడూ కొన్ని మెరుపులు…
Ads
రంగస్థలంలో రాంచరణ్… సౌండ్ ఇంజనీర్, సాదాసీదా ఓ పల్లెవాసి వేషం… రాంచరణ్ సాహసి… అదే క్యాంపుకు చెందిన బన్నీ మరో సాహసి… పుష్పలో తన వేషం, నడక, రగ్గడ్‌నెస్ వేరే హీరోలకు కూడా అలాంటి పాత్రలు వేయడానికి ఇన్‌స్పిరేషన్… దసరాలో నాని వేషం అలాంటిదే… ఐనా మారని పిచ్చి రొటీన్ హీరోలను కాసేపు వదిలేద్దాం… అదే బన్నీ పుష్ప-2 వేషం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశం…
ఓ లేడీ గెటప్‌లో బన్నీ దర్శనమిచ్చాడు… అది కొజ్జా పాత్ర కాదు, లేడీ పాత్ర కాదు… లేడీగా కనిపించే జెంట్… ఎందుకలా..? అదీ కాంతార టైపులో ఓ సంప్రదాయానికి సంబంధించిన వేషం… నిజానికి పుష్పలో ఐటమ్ సాంగ్, ఫైట్స్ ఎట్సెట్రా కమర్షియల్ వాసనలున్నాయి… పుష్ప-2లో వాటి మోతాదు ఇంకా పెరుగుతుంది… కానీ అదే సమయంలో ఓ భిన్నమైన వేషానికి బన్నీ అంగీకరించడం, కొత్త తరహా ప్రజెంటేషన్‌కు సహకరించడం అభినందనీయం…
రిషబ్ శెట్టి చెప్పినట్టుగా…. మోర్ రీజనల్, మోర్ యూనివర్సల్ అనే కోణంలో పరిశీలిస్తే… ఈ వేషం ఏమిటి..? ఒక్కసారి ChandraSekhar Reddy Thimmapuram ఫేస్‌బుక్ పోస్టులో వివరాలు పరిశీలించాలి… ‘‘బయటి జనాలంతా ఈ లుక్ చూసి షాక్ అయి ఉంటే.. మా చిత్తూరోళ్లందరూ భలే మురిసిపోయి ఉంటారు. ఎందుకంటే బన్నీ లుక్ మా చిత్తూరు కల్చర్‌తో ముడిపడ్డది కాబట్టి. బన్నీ ఏదో హిజ్రా వేషం వేశాడని వేరే వాళ్లు అనుకుని ఉంటారు కానీ.. వాస్తవానికి ఇది చిత్తూరు జిల్లాలో జరిగే ప్రధాన పండుగల్లో ఒకటైన గంగ జాతరతో ముడిపడ్డ వేషం.
గంగ జాతరపుడు మగాళ్లు ఇలా ఆడవాళ్లలా చీరలు కట్టుకుని.. లిప్ స్టిక్, నెయిల్ పాలిష్ లాంటివి వేసుకుని సింగారించుకోవడం ఇక్కడి సంప్రదాయం. ఇలా అలంకరించుకుని గంగమ్మ గుడి చుట్టూ ఉట్టి మోసి, చివర్లో దిష్టి తీసి పగలగొడతారు. పిల్లలు ఇంకా రకరకాల వేషాలు కూడా వేస్తారు. ఈ సంప్రదాయం వెనుక పెద్ద కథ ఉంది.
వందల ఏళ్ల కిందట తిరుపతి, చుట్టు పక్కల పల్లెటూళ్లను పాలెగాళ్లు పరిపాలించే వాళ్లు. ఆడపిల్లల్ని వేధిస్తూ.. వాళ్ల మాన ప్రాణాలను దోచుకునే ఈ పాలెగాళ్ల నుంచి కాపాడ్డానికి గ్రామ దేవత అయిన గంగమ్మ పుడితే.. ఒక వయసు వచ్చాక ఆమె మీద కూడా కూడా వాళ్లు కన్నేస్తారు. గంగమ్మ వాళ్లను సంహరించడం మొదలుపెట్టే సమయానికి అందరూ అడవుల్లోకి పారిపోతారు. వాళ్లను బయటికి రప్పించడం కోసం మగాళ్లు గంగమ్మలాగా వేషం వేసి ఏడు రోజుల పాటు జాతర చేస్తారు.
వాళ్లను చూసి గంగమ్మే అనుకుని పాలెగాళ్ల గుంపంతా బయటికి వచ్చాక గంగమ్మ ఉగ్రరూపం దాల్చి వాళ్లను సంహరిస్తుంది. ఇదీ ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న కథ. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ గంగమ్మ వేషం వేస్తామని మగాళ్లు మొక్కుకోవడం.. ఏప్రిల్, మే నెలల్లో జరిగే జాతరలో మొక్కులు తీర్చుకోవడం ఈ ప్రాంతంలో ఆనవాయితీ. తిరుపతి మాత్రమే కాదు మా జిల్లాలో మరి కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సంప్రదాయం ఉంది. (చిత్తూరులో అయితే దవడల్లో, ఒంటి మీద శూలాలు పొడుచుకుని ఊరేగింపుగా వెళ్ళే సంప్రదాయం కూడా ఉంది. ఇది తమిళనాడు నుంచి వచ్చిన కల్చర్)
ఈ సంప్రదాయాన్ని కథలో ఎలా వాడుకుంటారనే చర్చ జోలికి అక్కర్లేదు… పాన్ ఇండియా కథ కోసం ఈ సినిమా టీం నానా కథలూ పడాల్సిందే… కాంతార తరహాలో స్ట్రెయిట్, ప్లెయిన్ కథ కాదు ఇది… రాబిన్ హుడ్‌లా మారిన ఓ కలప స్మగ్లర్ కోసం వేట, కాల్పులకు గురైన పుష్ప ఎలా బతికాడు..? తన హీరోయిజాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు..? ఎట్సెట్రా అంశాల చుట్టూ కథను తిప్పుతారు, సరే, ఆ చర్చ వేరు… కానీ ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే… బన్నీ వంటి అగ్రహీరో కథ కోసమే అయినా సరే ఇలాంటి వేషాలు వేయడం బాగుంది… ఆ క్యాంపు పెద్దతలకాయకే ఈ చిన్న సాహసం, ఇలాంటి చిన్న ప్రయోగం చేతకావడం లేదు ఇప్పటికీ…!!
Share this Article