Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీదేవిపై లైంగికదాడి… ఆత్మహత్య… ‘మోసగాడు’ చిరంజీవి హత్య…

January 10, 2025 by M S R

.

.   (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..        ….. పాపం శ్రీదేవి ! రాఘవేంద్రరావు ఈ సినిమాలో శ్రీదేవి చేత సిగరెట్ కూడా తాగించాడు . 1980 లో వచ్చిన ఈ మోసగాడు సినిమాలో శ్రీదేవి డబుల్ ఫోజు కూడా . ఒక శ్రీదేవి శోభన్ బాబుకి జోడీ , ఇంకో శ్రీదేవి చిరంజీవికి జోడీ .

కవలపిల్లలు . ఒక శ్రీదేవి అల్లరిచిల్లరిగా తిరిగే యువతి , మరో శ్రీదేవి మట్టసంగా ఉండే యువతి . చిరంజీవి ఫుల్ విలన్ పాత్రలో నటించాడు . క్రాంతికుమార్ నిర్మాత . 1976 లో హిందీలో హిట్టయిన ఖాన్ దోస్త్ సినిమాకు రీమేక్ .

Ads

చిరంజీవి ఊళ్ళో బేవార్సుగా తిరిగే రౌడీషీటర్ . అల్లరిచిల్లరగా తిరిగే అక్క శ్రీదేవికి ప్రియుడు . సహజీవనం చేస్తుంటారు . శోభన్ బాబు , చెల్లెలు శ్రీదేవి ప్రేమించుకుంటారు . చిరంజీవికి చెల్లెలు శ్రీదేవి మీద కన్ను ఉంటుంది .

పెళ్ళిచేసుకోవటానికి గుడికి చేరిన చెల్లెలు శ్రీదేవిని చిరంజీవి మానభంగం చేస్తాడు . చెల్లెలు శ్రీదేవి ఆత్మహత్య చేసుకుంటుంది . చిరంజీవిని శోభన్ బాబు చంపేసి ఉరి తీయబడతాడు . టూకీగా ఇదీ కధ .

ఈ సినిమాలో హృద్యమైన పాత్ర సత్యనారాయణది . రామ భక్తుడు . జైల్లో హెడ్ కానిస్టేబుల్ . జైలుకొచ్చిన శోభన్ బాబుకు దేవుడిచ్చిన అన్న అవుతాడు . కళ్ళు పోగొట్టుకుంటాడు . శోభన్ బాబు తన కళ్ళను దానం చేస్తాడు . తర్వాత ఉరి తీయబడతాడు .

అక్క శ్రీదేవి పాత్ర బాగుంటుంది . శ్రీదేవి చక్కగా నటించింది . శోభన్ బాబుకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . చిరంజీవికి కూడా ఇలాంటి నెగటివ్ పాత్రలు అలవాటే . ఈ సినిమాలో కూడా గుబురు మీసాలే ఉంటాయి .

1980 లో విడుదలయిన ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభించారో ! ఇతర పాత్రల్లో నిర్మలమ్మ , గుమ్మడి , సారధి , అనిత , కె వి చలం ప్రభృతులు నటించారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . ఓ కురిసే నవ్వుల కుంకుమ పువ్వుల పాటలో అతిలోకసుందరి నృత్యం బాగుంటుంది . రాఘవేంద్రరావు మార్క్ డాన్స్ పాట . ఏ వసంతమిది ఎవరి సొంతమిది , ఆ చూపుకు అర్థమేంది పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి .

జైల్లో ఖైదీలు స్వాతంత్ర్య దినోత్సవం నాడు పాడే ఎగరాలి జాతీయపతాకం చాలా బాగుంటుంది . సత్యనారాయణ , శోభన్ బాబుల నటన బాగుంటుంది . ఎర్ర నారాయణమూర్తి ఈ పాటలో ఒక ఖైదీగా కనిపిస్తాడు .

చిరంజీవి , జయమాలినిల మీద ఆకుంది ఒక చోట పోకుంది ఒక చోట హుషారుగా ఉంటుంది . హిందీలో సినిమాలో సత్యనారాయణ పాత్రను రాజ్ కపూర్ నటించారు . శతృఘ్న సిన్హా , యోగితా బాలి , మితు ముఖర్జీ తదితరులు నటించారు .

మన తెలుగు సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . శ్రీదేవి , చిరంజీవి , శోభన్ బాబు , సత్యనారాయణ అభిమానులు చూడవచ్చు . చూడబులే .

నలుగురిలో ముగ్గురు చనిపోతారు . గుండె దిటవు చేసుకొని చూడటం మొదలుపెట్టండి . ముఖ్యంగా చిరంజీవి చంపబడటం , శ్రీదేవి మానభంగం చేయబడటం , సిగరెట్ ముట్టించటం !! #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions