Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వివాదాల నుంచి అవిముక్తం… ఈ శంకరాచార్యుడి పేరూ తీరూ అవిముక్తం…

October 22, 2024 by M S R

సనాతన ధార్మిక నేతృత్వం… విచిత్రంగా ద్వనించి, నిర్వచనం కష్టమైన పదం… సనాతన దర్మానికి ఒకరు నేతృత్వం వహించేది ఏమిటి..? అసలు హిందూ ధర్మానికి ఈ పీఠాలు ప్రాతినిధ్యం వహిస్తాయా..? నిజంగా హిందూ మతవ్యాప్తికి ఈ పీఠాధిపతులు చేస్తున్న కృషి ఏమిటి..? పాదపూజలు, సంభావనలు తప్ప ఇంకేం పట్టింది..?

చేస్తున్నారనే అనుకుందాం సరే… బీజేపీ మాత్రమే ఎందుకు పట్టించుకోవాలి..? ఇదే ప్రశ్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీలకు ఎందుకు వేయవద్దు..? ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయంటే… అత్యంత వివాదాస్పద స్వామి ఒకాయన జమ్ములో మాట్లాడుతూ ‘ధర్మాచార్యులను బీజేపీ పట్టించుకోవట్లేదు’ అని విమర్శించాడు…

గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, 36 రాజధాని కేంద్రాల్లో గోధ్వజ్ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశమంతా తిరుగుతున్నాడు ఆయన… (హిందూ ధర్మవ్యాప్తికి ఇదే మార్గం అంటాడేమో బహుశా…) సరే, ఆయన డిమాండ్ల గురించి, ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టాడో ఇక్కడ ప్రస్తావించడం లేదు, సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషించడం లేదు గానీ… సనాతన ధర్మ నేతృత్వం అనగా ఏమిటో ముందుగా ఆయన నిర్వచించాలి…

Ads

అది బీజేపీ బాధ్యతే ఎందుకు అవుతుందో కూడా చెప్పాలి… కానీ చెప్పడు… వివాదాలు, శుష్క ఆరోపణలతో ఆయన హిందూ మతానికి నష్టం చేకూర్చడమే తప్ప తనతో వీసమెత్తు ఫాయిదా లేదు… ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్ శంకరాచార్యుడు ఆయన… చాలామంది శంకరాచార్యులు ఉన్నారు మనకు… అందులో ఈయన కూడా ఒకరు… అసలు ఆ మఠాధిపతి స్వరూపానంద అస్తమయం తరువాత ఈయన పగ్గాలు చేపట్టడమే ఓ వివాదం… సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది…

avimutka

ఓ స్వామి మాట్లాడితే ఒక్క పొల్లు మాట రాకూడదు… ప్రతి పదానికి విలువ ఉండాలి… ఈయన దానికి పూర్తిగా భిన్నం… అయోధ్యకు పిలవలేదు అంటాడు తను… కానీ అయోధ్య నిర్మాణం పూర్తి గాకముందే ప్రాణప్రతిష్ఠ కూడదు అంటాడు… మళ్లీ తనే అది పూర్తిగా బీజేపీ కార్యక్రమంలా సాగింది అంటాడు… ధర్మాచార్యులను బీజేపీ పట్టించుకోవడం లేదంటాడు… అందుకే అయోధ్యకు వెళ్లలేదు అంటాడు…

అప్పుడే ఉద్దవ్ ఠాక్రేను మోసగించారు అంటాడు… (పరోక్షంగా బీజేపీ మీద విమర్శ)… రాహుల్ గాంధీ భేష్ అంటాడు ఓసారి… మళ్లీ తనే హిందువులను మేల్కొల్పడంలో మోడీ మంచి కృష్టి చేస్తున్నాడంటాడు… ఆర్టికల్ 370 ఎత్తివేత, పౌరసత్వ సవరణ చట్టాల్ని స్వాగతించామనీ అంటాడు…

మొన్నామధ్య కేదారనాథ్ ఆలయానికి చెందిన 228 కిలోల బంగారం మాయమైందనీ, ఢిల్లీలో ఆ సొమ్ముతోనే కేదారనాథ్ నమూనా గుడిని కడుతున్నారనీ ఆరోపించాడు… ఆలయబాధ్యులు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వడంతో నోరుమూసుకున్నాడు… గొడ్డుమాంస భక్షణను వ్యతిరేకిస్తాడు… అందుకే గోధ్వజ్ ప్రతిష్ఠకు వెళ్తే రెండుమూడు ఈశాన్య రాష్ట్రాలు ఆయన ప్రవేశాన్ని అడ్డుకున్నాయి… అనవసర వివాదాలకు, తగాదాలకు అవకాశం ఇవ్వకూడదని..!

మొదటి నుంచీ ఇంతే… నోరిప్పితే చాలు, ఏదో పంచాయితీ… మాట మీద నిలకడ ఉండదు… ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు పలుసార్లు… ఈయన సనాతన ధార్మిక నేత అట… ధర్మాచార్యుడట… బీజేపీ పట్టించుకోవాలట… అంటే ఏం చేయాలి..? అసలు ఈయన పీఠాధిపత్యమే సరికాదని సుప్రీంలోనే విచారణ సాగింది కొన్నాళ్లు… శివానంద యోగవిద్యాపీఠం స్వామి గోవిందానంద సరస్వతి ఈయన్ని ఉద్దేశించి ‘దొంగబాబా’ అని తేల్చిపడేశాడు… దీనిపై అవిముక్తేశ్వరానంద ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తే… సాధువులు ఇలాంటివి పట్టించుకోవడం ఏమిటి, స్వాములు తమ పనులతోనే గౌరవం పొందుతారు తెలుసా అని హైకోర్టు హితవచనాలు పలికింది… అదీ ఈ అవిముక్త శంకరాచార్యుడి కథ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions