.
ఆమధ్య ఎవరో హీరోను పట్టుకుని ఎవరో ఓ లేడీ జర్నలిస్టు… మీరు మీరో మెటీరియలేనా అనే ఓ తిక్క ప్రశ్న వస్తే కొన్నాళ్లు వాదోపవాదాలు నడిచాయి సోషల్ మీడియా… హవ్వ, అదేం ప్రశ్న..? ఇదేం జర్నలిజం..? ఇంకేం విలువలు అని లబలబలాడాం…
ప్చ్, మొగ్లీ సినిమాలోని కర్మసిద్ధాంతం లాంటిదే కావచ్చు ఇది… సినిమాలో సుమ కొడుకు రోషన్‌ను చూస్తే మనకూ అలా అనిపించి కలుక్కుమంటుంది… పాపం సుమ..! ఆమెకు సినిమా ఫంక్షన్లు తప్ప ఆమె నటించే సినిమాలు అచ్చిరావు… కెరీర్ బిగినింగు నుంచీ అంతే… పాపం, కొడుకైనా వెలుగుతాడు అనుకుంటే…….
Ads
కొడుకు ఆమధ్య బబుల్ గమ్ అన్నాడు… బబుల్ పేలిపోయింది… ఇప్పుడు మోగ్లీ అన్నాడు… (టైటిల్ అర్థమేమిటో, ఈ సినిమాకు ఎలా ఆప్టో అర్థం కాలేదు… కాదు కూడా… ది జంగిల్ బుక్ అనే పాపులర్ ఇంగ్లిష్ సాహిత్యపు పాత్ర మైగ్లీ లేదా మోగ్లీ… తోడేళ్లు పెంచిన ఓ అనాథ బాలుడు… )
ఈ సినిమా మటాష్… పేలిపోయిన మరో రోషన్ ’బబుల్‌గమ్’… ఈ మాట అనడానికి పెద్ద సంకోచం, సందేహం కూడా అక్కర్లేదు… నిజానికి రోషన్ తన లుక్కులో ఛేంజెస్ చేసుకోవడం అవసరం… పైగా నటనలో బేసిక్స్ మీద కూడా ఓ పట్టుపట్టాలి…
డఫ్ అండ్ డమ్ హీరోయిన్‌గా చేసిన సాక్షి మడోల్కర్ అందంగానే ఉంది… కానీ ఆమె పక్కన చేసిన మౌనిక ఇంకా బాగుంది, భవిష్యత్తూ బాగుండొచ్చు బహుశా… హీరోకన్నా విలనుడు బండి సరోజ్ బాగున్నాడు, బాగా చేశాడు… రోషన్‌కు ఓ ఉచిత సలహా… నువ్వు మరో సినిమా చేసే పక్షంలో ఇలాంటి విలనుడు పెట్టుకోకు, సినిమాను హైజాక్ చేస్తాడు మోగ్లీలాగే…
దీనికితోడు చెముడు హర్షకు పెద్ద రోల్ ఇచ్చారు, తనూ వాడేసుకున్నాడు… వెరసి ఈ ఇద్దరి నడుమ రోషన్ బకరా అయిపోయాడు… కీరవాణి పెద్ద కంపోజర్ కావచ్చుగాక… కానీ కొడుకు కాలభైరవ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది… పాటలు, ట్యూన్స్, బీజీఎం అన్నింట్లోనూ తప్పటడుగులే ఇంకా… ఇక ఎడిటర్ అయితే బేసిక్ ఎడిటింగ్ లెసన్స్ నేర్చుకోవాలి…
ఇక కథ దగ్గరకొద్దాం… కలర్ ఫోటో అని తీశాడట కదా ఈ దర్శకుడు, కాస్త మంచి పేరే వచ్చినట్టుంది… కానీ దీంతో చెడగొట్టుకున్నాడు… గతంలో జయం అనే సినిమా వచ్చింది కదా… దాదాపు అదే లైన్… అప్పట్లో ఆ సినిమా హీరోకన్నా విలన్‌గా చేసిన గోపీచంద్ హైలైట్ అయ్యాడు… అచ్చం మొగ్లీలోలాగే… ఎలివేషన్లు, బిల్డప్పులు, క్లోజులు, స్క్రీన్ టైమ్, డామినేషన్ అన్నీ తనవే…

ఓ అనాథ… పోలీస్ కావాలని లక్ష్యం… ఊరి పక్క అడవికి షూటింగుకొచ్చేవాళ్లకు సాయం చేస్తుంటాడు… హీరోయిన్‌ను చూసి మనసు పారేసుకుంటాడు, కానీ మధ్యలో ఓ రావణుడు తగులుతాడు… అరణ్యంలోకి అజ్ఙాతంలోకి ప్రేమికులు… ప్రజెంట్ ట్రెండ్ దైవిక శక్తులు, దేవుడు, ధార్మిక ఎజెండా కదా… సేమ్, హనుమంతుడి జెండా పట్టేసుకుని, పర్ణశాల సహా రామాయణాన్ని అనుకరిస్తాడు దర్శకుడు, హీరో, నిర్మాత…
ఒక్కటంటే ఒక్క సీనూ రక్తికట్టనంత జాగ్రత్తగా సినిమాను డైరెక్ట్ చేశాడు పాపం దర్శకుడు సందీప్ రాజ్… సినిమాలో కర్మసిద్ధాంతం ప్రస్తావన, ప్రభావం ఉంటుంది కాస్త… థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకుడూ నా ‘ఖర్మ’సిద్ధాంతం అనుకుంటాడు… ఇది గ్యారంటీ..!! ప్చ్, ఇంకా చెప్పటానికి ఏమీ లేదు… స్వస్తి..!!
Share this Article