Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదే డెస్టినీ అంటే..! కేసీయార్ సార్, ఓసారి ఇది తాపీగా చదవగలరు…!!

April 8, 2026 by M S R

.

లక్షో లక్షన్నర పుస్తకాలో చదివినట్టు చెప్పుకునే కేసీయార్‌కు ‘విధి, టైమ్, డెస్టినీ, కాలం, కర్మ’ పదాలకు అర్థాలు తెలియవని కాదు… కానీ ఈ డెస్టినీ కథనం ఓసారి తప్పకుండా చదవాలి… ఎందుకంటే కర్మ ఎలా కాటేస్తుందో తెలుసుకోవడానికి కాదు, ఆ కర్మలో తను భాగస్వామి కాబట్టి… కాదు, కాదు, తనే ప్రధాన పాత్రధారి కాబట్టి…

విషయం ఏమిటంటే… 25 ఏళ్లుగా వీసమెత్తు డెవలప్‌మెంట్ లేదు బాసర గుడిలో… అత్యంత నిరాదరణ… అవకాశమున్న ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించాలని ఆశిస్తారు… కానీ ఆదాయం ఉన్నా సరే, అభివృద్ధి పట్టని దేవాదాయ శాఖ… కనీస సౌకర్యాలకే దిక్కులేని దురవస్థ…

Ads

వివరాల్లోకి వెళ్దాం… ఆయన ఒక ప్రజాప్రతినిధి… పేరు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి… 77 ఏళ్ల వయస్సు… గతంలో బీఆర్ఎస్‌… దాదాపు పదేళ్లపాటు దేవాదాయ శాఖ మంత్రి… కానీ ఏం ఫాయిదా..? తన జిల్లాలోని ప్రధాన ఆలయం… తనే సంబంధిత శాఖ మంత్రి… ఐతేనేం… ఓ యాభైసార్లు వచ్చి ఉంటాడు గుడికి… దర్శనం, ప్రసాద సేవనం తప్ప చేసిందేమీ లేదు… గుడి ఆదాయంతో చేపట్టే పనులను తన అనుచరులకు ఇప్పించడం…

సీన్ కట్ చేస్తే… మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో 300 కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి చేయడానికి సంకల్పించి, తనే స్వయంగా శంకుస్థాపన చేశాడు కదా… (సమ్మక్క జాతర, వేములవాడ, భద్రాచలం, ఇప్పుడు బాసర… దాదాపు 1200 కోట్ల నిధులు… ఒక వైష్ణవ క్షేత్రం, ఒక శైవ క్షేత్రం, ఒక ఆదివాసీ దేవత, ఓ విద్యా దేవత… అదనంగా మూసీ నడుమ భారీ శివ విగ్రహం…) ఈ బాసర అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా అదే ఆ పాత దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా హాజరయ్యాడు…

ఇంద్రకరణ్ రెడ్డి

ఎక్కడో ఓ మూలన కనిపించాడు… నిజానికి కేసీయార్ గనుక కాసిన్ని నిధులు ఇస్తే, ఈ మాజీ మంత్రి తనే బోలెడంత డెవలప్‌మెంట్ పనులకు సారథి అయ్యేవాడు… ఆయనకు పట్టలేదు, ఈయనకు అడిగి నిధులు తెచ్చుకునే సోయి లేదు… (ఐనా కేసీయార్ కేబినెట్‌లో కేటీయార్, హరీష్ తప్ప అందరూ నిమిత్తమాత్రులే కదా…) రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలో ఆయన మరీ ఓ అనామకుడిలా సర్పంచులు, ఎంపీటీసీల మధ్య చివరి వరుసలో నిలబడటం కనిపించింది… సో, ఆ నేతను కాలం సర్పంగా మారి కాటేసింది… అక్కడ హాజరైన జనంలో ఎక్కువగా ఇదే చర్చ…

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి… రేవంత్ రెడ్డి పనిలోపనిగా బాసరలో తన మనుమడికి అక్షరాభ్యాసం చేయించాడు… అదొక సంప్రదాయం, విశ్వాసం… ఆ గుడి ఆచారాల పట్ల తను కనబరిచిన గౌరవం… కానీ బీఆర్ఎస్ క్యాంపు దాన్ని కూడా రకరకాల అబ్సర్డ్ కూతలు, పోస్టులతో వెకిలి చేయడానికి పూనుకుంది… ఓ ఫోటో చూడండి…

హిమాంశు

బాసరలో సీఎం మనమడికి అక్షరాభ్యాసం చేయించి, ఆ సరస్వతిమాత పట్ల గౌరవాన్ని, భక్తిని ప్రదర్శించాడు… ఆమెకు వందల కోట్లతో భవ్యమైన గుడి పునర్నిర్మాణాన్ని సమర్పిస్తున్నాడు… కానీ కేసీయార్ ఏం చేశాడు..? భద్రాచలం రాములోరి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు తను తీసుకుపోకుండా, మనమడితో పంపించాడు… అంతకన్నా పాలక స్థానంలో ఉండి చేసిన ఎక్కువ అపచారం ఏముంటుంది..?

ఇదేనా..? హిందూగాళ్లు బొందుగాళ్లు… యాదగిరిగుట్ట మినహా మిగతా గుళ్లపై నిర్లక్ష్యం… అయోధ్య గుడిపై వెక్కిరింపు… శూర్పణఖ జన్మభూమి, రావణ జన్మభూమి అని వెక్కిరింపులు… అయోధ్య చందాలకు మోకాలడ్డు… పక్కా యాంటీ హిందూ పోకడే కదా… సో, ఇంద్రకరణ్ రెడ్డి అనుభవంకన్నా కేసీయార్ ప్రస్తుత చేదు దురవస్థలో ఏమంత పెద్ద తేడా ఉంది..?! ఇంద్రకరణ్‌రెడ్డి కాస్త నయం, కనీసం జనంలో కనిపిస్తున్నాడు… కేసీయార్ అసలు జనంలోనే లేడు కదా..!!

నిన్న ఓ పత్రిక... అసంతృప్తి, కష్టాలు, తిరుగుబాట్ల నడుమ దిక్కుతోచన సీఎం గుళ్ల బాట పట్టాడని ఏదో విశ్లేషణ... అలా అడ్డదిడ్డంగా రాస్తే అది ఖచ్చితంగా నమస్తే తెలంగాణ అయి ఉండాలి అంటారా..? కాదు, ఫేమస్ జర్నలిస్టులు, యూనియన్ నేతల సొంత వెబ్ పత్రిక మరి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇరాన్ యుద్ధనీతిని అస్సలు అంచనా వేయలేని ట్రంప్ వైఫల్యం…
  • ఇదే డెస్టినీ అంటే..! కేసీయార్ సార్, ఓసారి ఇది తాపీగా చదవగలరు…!!
  • అమెరికా, ఇజ్రాయిల్ తప్పులో కాలేశాయి..? మొస్సాద్‌కు మొదటిసారి షాక్..!!
  • సర్కారు సకాల స్పందన… రిటైర్డ్ ఉద్యోగులందరికీ భారీ ఊరట
  • ఈమె తెగువకు ఓసారి గట్టిగా చప్పట్లు కొడదాం… ఎందుకంటే..?
  • ‘‘నీ పో మోనే విజయ…’’ కేరళలో భలే పేలిన రేవంత్ రెడ్డి క్యాంపెయిన్…
  • మోడీ భాయ్… నీ చమురు జంఝాటం తరువాత… వెంటనే ఇది చూడు ఓసారి…
  • ఆ మోడీ ట్వీట్ 30.9 మిలియన్ రీచ్… అందులో ఓ అద్భుత విజయవార్త…
  • భవనాలతో రాజధాని రాదు… హైదరాబాదుతో అసలు పోలికే లేదు…
  • ఆహా..! ఏం తెలివిరా నాయనా…! అనామకులైతే జేబుకు చిల్లే..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions