Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహారాష్ట్ర ఎన్నికలు… బాగా పేలిన బీజేపీ పొలిటికల్ స్లోగన్స్…

November 24, 2024 by M S R

.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అలయన్స్ మహాయతి విజయం సాధించింది!
మహారాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య – 288
మెజారిటీకి కావాల్సిన సీట్లు 145

మహాయతి : 234 సీట్లు గెలుచుకుంది.
మహా వికాస్ అఘాఢి : 48 సీట్లు గెలుచుకుంది!

Ads

బీజేపీ గెలిచిన సీట్లు : 132       2019 లో 105 —-+27

శివసేన – షిండే : 57                 2019 లో 40 —- +17

NCP – అజిత్ పవార్ : 42

******
మహావికాస్ అఘాడి

శివసేన – ఉద్ధవ్ థాకరే : 20         2019- 16 —– +4

NCP శరద్ పవార్ : 10                   2019 – 14 —– -4

INC : 16                                           2019 – 44 —– -28

********
ఎన్నికలకి ముందు రాజకీయ పండితుల విశ్లేషణ ఏమిటంటే మహారాష్ట్ర లో హంగ్ ఏర్పడుతుంది అని.

అఫ్కోర్స్! ఓటర్ మనోగతం కూడా ఏమిటో బయటికి వ్యక్తం కాలేదు! అందుకే హంగ్ అన్నారు. ఒంటరిగా పోటీ చేసే ఒక్క రాజకీయ పార్టీ లేదు మహారాష్ట్ర లో. చిన్నా చితక పార్టీ లు ఒంటరిగానే పోటీ చేసినా అవి లెక్కలోకి రావు!

మలుపు తిప్పిన నినాదాలు!

బాతెంగేతో కాటెంగే! batenge tho katenge

కొంచెం కాదు చాలా తికమకగా ఉంది కదా?

నిజానికి భాష యొక్క యాసతో వచ్చిన ఇబ్బంది ఇది!

ఈ బాతెగేతో కాటెంగే అంటే ఏందిరా బాబు అని నాకు కూడా అనిపించి తికమక పడ్డ సంగతి వాస్తవం!

बांटोगे तो काटेंगे ఇదీ హిందీలో వాడింది. బాంట్నా అంటే పంచడం కాంటేన్గే అంటే కోస్తారు, కోసివేయబడతావు అని.
కులాల వారీగా, మతాల వారీగా ఓట్లు పంచితే నష్టపోతావు అనే అర్థంలో వాడారు! ఇది బేరం తెగిందా అని అంటాము కదా? అదేమన్నా దారమా? తాడా? తెగడానికి? కానీ అర్ధం మాత్రం బేరం కుదిరిందా అనే కదా!

बांटेंगे तो काटेंगे అనేదాన్ని మొదట యోగీ హర్యానా ఎన్నికల ప్రచారంలో మొదటి సారిగా వాడగా, దీనిని మోడీ సమర్ధిస్తూ एक रहेंगे तो नेक रहेंगे గా మార్చి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు! ఒక్కటిగా ఉంటే సురక్షితముగా ఉంటారు అని అర్థం!

RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా సమర్థించారు ఈ నినాదాన్ని!

కాంగ్రెస్ చేసిన తప్పు!

రాహుల్ మాటల్లో….. ప్రజలని కులాల వారీగా బీజేపీ విభజిస్తున్నది అని విమర్శించాడు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే దాన్ని సమర్థించారు.

మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణలలో కులగణన ఎందుకు చేస్తున్నట్లు? అంత అవసరం ఏమొచ్చింది? అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ఒక రాజకీయం, లేని చోట ఇంకో రాజకీయమా?

ప్రజలకి తమ పక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో తెలియదా?

మహారాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు! ముస్లిం ఓట్లు ఐకమత్యంగా ఒకరికే పడతాయి హిందువుల ఓట్లు కులాల వారీగా చీలిపోతున్నాయి అని గ్రహించారు!

బీజేపీలో కూడా ఈ నినాదాన్ని వ్యతిరేకించినవారు ఉన్నారు.

ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ నినాదాన్ని వ్యతిరేకించి దూరంగా ఉన్నాడు. కొంచెం అసహనం వ్యక్తం చేశాడు!

ఇక మహారాష్ట్ర బీజేపీ ప్రముఖుడు అయిన గోపీనాథ్ ముండే కుమార్తె అయిన పంకజ ముండే కూడా ఈ నినాదం వలన బీజేపీ గెలవదు అని దూరంగా ఉన్నారు…

ఇక అజిత్ పవార్ పాత వాసనలు తనలో అలానే ఉన్నాయని నిరూపిస్తూ అసహనంతో పాటు వ్యతిరేకంగా వ్యవహరించాడు!

మహావికాస్ అఘాడి నాయకులు ప్రతీ నియోజకవర్గంలో ఈ నినాదాన్ని ఉటంకిస్తూ వ్యతిరేకంగా ప్రచారం చేసి దెబ్బతిన్నారు!

********

మాహాయుతి ముఖ్యమంత్రి మాఝి లడకి బెహన యోజన!

21 సంవత్సరముల నుండి 65 ఏళ్ళ మధ్యలో ఉన్న మహిళలకి ఎవరి ఆదాయం సంవత్సరానికి 2 లక్షల యాభై వేలకి మించకుండా ఉంటుందో వాళ్ళకి నెలకి 1500/- నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది ప్రభుత్వం.

ఈ పథకం ప్రకటించగానే రాహుల్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు విరుచుకు పడ్డారు!

మహారాష్ట్రని అప్పుల ఊబిలోకి నెట్టబోతున్నది బీజేపీ అంటూ!

Ok! ఉచిత పథకాలకు బీజేపీ వ్యతిరేకం, అలాగని కాంగ్రెస్, ncp, ఉద్ధవ్ ఠాక్రేలకి అధికారం అప్పచెప్పడానికి బీజేపీ సిద్ధంగా లేదు!

పాల్ఘర్ సాధువుల దుర్ఘటన తాలూకు మచ్చలు అలానే ఉన్నాయని, అవి ఎప్పటికీ మానేవి కావనీ బీజేపీకి తెలుసు!

అయితే కాంగ్రెస్ కి సీట్లు తగ్గడానికి కావాల్సిన ఇంధనం మల్లిఖార్జున ఖర్గే అందించాడు… ఒక పక్క మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కర్నాటక కాంగ్రెస్ నాయకులని ఉద్దేశించిం మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే…

‘‘మీరు చేయలేని వాటిని ఎందుకు వాగ్ధానం చేశారు? హామీలు ఇచ్చేముందు ఆలోచించుకోరా?’’

ఇవీ ఖర్గే చేసిన వ్యాఖ్యలు. సిద్ధరామయ్య , Dk శివకుమార్ లని ఉద్దేశించి ఖర్గే అన్నాడు. KSRTC కి ప్రభుత్వం ఇవ్వాల్సిన 1000 కోట్లు ఇవ్వకపోతే మేము బస్సులని నడపలేమని చెప్పినప్పుడు నిధుల కొరతతో ఉన్న కర్నాటక ప్రభుత్వం మీద ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశాడు.

KSRTC కి రోడ్ టాక్స్ నుండి మినహాయింపు ఇచ్చాము కాబట్టి ఇక కొత్తగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకుల వాదన.
మరి 2020 నుండీ KSRTC జీతాలు పెంచలేదు. ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉంటుంది కదా? నాలుగేళ్ళ క్రితం ఉన్న జీతాలతో కార్మికులు ఎలా నెట్టుకొస్తారు? ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకోరా? ప్రతీ సంవత్సరం విడి భాగాల ధరలు పేరుగుతూనే ఉంటాయి వీటిని ఎవరు భర్తీ చేస్తారు? ఇదీ KSRTC వాదన.

అందుకే మాకు ఉచిత టికెట్స్ ద్వారా కోల్పోతున్న ఆదాయం 1000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని చెల్లించి, అలాగే టికెట్ల ధరలను 20% పెంచడానికి అనుమతి ఇస్తేనే కానీ బస్సులను నడపలేం అని KSRTC అంటున్నది.

దీనినే సుత్తి కొడవలి హస్తన్యాయం అంటారు! ఇదే కనుక బీజేపీ అధికారంలో ఉంటే KSRTC నిరవధిక సమ్మెకు దిగి ఉండేది!

ఎన్నికల ప్రచారంలో ఖర్గే వ్యాఖ్యలు హైలైట్ అవడంతో మహారాష్ట్ర ప్రజలు మహవికాస్ అఘాడీని ప్రజలు నమ్మలేదు!

*******

స్పృశించ వలసిన అంశాలు చాలానే ఉన్నాయి.

క్లుప్తంగా…

400 NGO లు బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి!

RSS ప్రచారం వాటిని తిప్పి కొట్టింది. హర్యానాలో కూడా RSS కృషి మరువలేనిది!

*******
చంద్రుడికి నూలు పోగు లాగా పవన్ కళ్యాణ్ షోలాపూర్, లాతూర్ లలో చేసిన ప్రచారానికి ప్రజలు భారీ సంఖ్యలో హజరయి మద్దతు తెలిపారు. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ మరాఠీలో మాట్లాడి ఆశ్చర్యపరిచాడు! తన పిల్లల ద్వారా కొంచెం మరాఠీ నేర్చుకున్నాను అని తెలిపాడు!

********
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏమి చెప్తున్నాయి?

వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లింది అని తీర్పు చెప్పారు. 83 ఏళ్ళ శరద్ పవార్ ను రాజకీయాల నుండి తప్పుకోమని ఖరాఖండిగా చెప్పేసారు! కూతురు సుప్రియ సూలేను ఆమోదించము అని చెప్పారు!

మంచికో చెడుకో అజిత్ పవార్ శరద్ పవార్ ను వీడి బీజేపీతో చేతులు కలపడాన్ని ప్రజలు ఆమోదించారు!

శరద్ పవార్ శకం ముగిసింది! మిగిలిన అవశేషాలు అయితే అజిత్ పవార్ పంచనో లేదా షిండే పంచనో చేరతారు మెల్లిగా! శరద్ పవార్ వర్గాన్ని బీజేపీలోకి ఆహ్వానించడం ప్రమాదకరం!

******
శివసేన ఉద్ధవ్ ఠాక్రేను మహా ప్రజలు ఆమోదించలేదు! ఈ విషయంలో మహారాష్ట్ర ప్రజలు స్పష్టంగా ఉన్నారు! కోర్టు తీర్పులు, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు ఎలా ఉన్నా ఏక్ నాథ్ షిండేను అసలైన శివసేన అని గుర్తించారు!

ఈ పరిణామం ఉద్ధవ్ ఠాక్రే స్వయంకృతాపరాధం!

బాల్ ఠాక్రే సిద్ధాంతం అయిన సనాతన ధర్మ రక్షణ అనే అంశాన్ని విస్మరించి శరద్ పవార్, సోనియా పంచన చేరి తప్పు చేశాడు! వాళ్లతో చేరితే ఫలితం ఇలాగే వుంటుంది!

ఇక బేబీ పెంగ్విన్ కి రాజకీయ భవిష్యత్ ఉండబోదు!

******
ఒకసారి చూద్దాం అనే ధోరణి నుండి ఈసారి అసలు కాంగ్రెస్ కీ అవకాశం ఇవ్వకూడదు అని మహా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు!

శివసేన, శరద్ పవార్ కంటే ఎక్కువ నష్టపోయింది కాంగ్రెస్సే!

ఒక చిన్న మాట చెప్పుకోవాలి ఇప్పుడు..
టికెట్ దక్కలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు.

దేవేంద్ర ఫడ్నవీస్ తిరుగుబాటు అభ్యర్థుల కోసం ఠానే, నాగ్ పూర్ లలోని వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ నచ్చచెప్పి పోటీ నుండీ విరమించుకునేలా చేసి మరీ తిరిగి ముంబై వచ్చారు!

కాంగ్రెస్ నేతలు కేవలం ఫోన్ చేసి బుజ్జగించాలని చూసినా వాళ్ళు మాట వినకుండా రెబెల్ అభ్యర్థులుగా పోటీలో కొనసాగి తమ పార్టీ ఓట్లని చీల్చారు.

రెబెల్ అభ్యర్థుల తలనెప్పి ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ లకి కూడా ఉంది. వాళ్ళ ఇళ్ళకి వెళ్లి ఒప్పించే వాళ్ళు ఎవరున్నారు?

శరద్ పవార్ కి విపరీతమైన అహంకారం ఉంది… ఎంతలా అంటే అడగకుండా తన గదిలోకి వచ్చినందుకు ఉద్ధవ్ ఠాక్రేను వేలు పెట్టి చూపిస్తూ బయటకి వెళ్ళమని ఈసడించుకున్నాడు ఓసారి. ఇది పాత ఘటనే కానీ ఆ సమయంలో అక్కడే ఉన్న ఎవరో మొబైల్ లో వీడియో తీశారు. మొన్న ఎన్నికలలో ఆ వీడియోను మళ్ళీ వైరల్ చేసింది బీజేపీ.

శరద్ పవార్ దగ్గర పనివాడిగా ఉండే ఉద్ధవ్ ఠాక్రే తన ఇంటికి రాగానే బాల్ ఠాక్రేలాగా ఫోజులు కొడతాడు. వీళ్ళద్దరిలో ఎవరు రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళని బుజ్జగిస్తారు?

కాంగ్రెస్, NCP, ఉద్ధవ్ ఠాక్రేలు తమ స్వంత రెబెల్ అభ్యర్థుల ఓట్లు చీల్చడం వల్ల మెజారిటీ కోల్పోయారు!

దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా నెరిపిన దౌత్యం పనిచేసి మహాయతి ఓట్లు చీలకుండా చేసింది!

లోక్ సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీకి ఎక్కువ సీట్లు వచ్చి అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు తగ్గాయి అనే దాని మీద కూర్చుని చర్చిస్తాం అని రాహుల్ అనడం చూస్తే EVM ల మీదకి నెపం వేయడానికే!

********
2019 లో బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచిన తరువాత, ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని వదిలి కాంగ్రెస్, శరద్ పవార్ పంచన చేరిన తరువాత, శరద్ పవార్ కూతురు సుప్రియ సూలె దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉద్దేశిస్తూ ఎగతాళిగా ఇలా అన్నది…..

“ఎండిపోయిన చెరువు దగ్గర నిలబడి ఏం చేస్తావు ఫడ్నవీస్”

దీనికి బదులుగా ఫడ్నవీస్ ఇలా అన్నాడు….

“నేను సముద్రాన్ని, నా ఒడ్డున ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నావు, అలలు ముందుకి వచ్చి నీ ఇంటినీ ముంచెత్తుతాయి”

బీజేపీ గెలవగానే సుప్రియ సూలే అన్నమాటలు, బదులుగా ఫడ్నవీస్ అన్న వీడియోలు వైరల్ చేశారు బీజేపీ అభిమానులు.

ఈ ఎన్నికల ఫలితాలు రాగానే మోడీ అభినందనలు తెలిపే ప్రసంగంలో రాజ్యాంగంలో వక్ఫ్ అనేదాన్ని పేర్కొనలేదు అని అన్నారు… ఉద్దేశ్యం ఏమిటో అర్థం అవుతున్నది కదా? ……. (పొట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions