దాదాపు 420 సినిమాల వరకూ చేసి ఉంటాడు… మమ్ముట్టి అంటే మాలీవుడ్ లెజెండ్… రీసెంటుగా ఏదో సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో… ‘‘నా చివరి క్షణం వరకూ నటిస్తూనే ఉంటాను… ఇంకా అలసిపోలేదు… నేను మరణించాక జనం ఎన్నాళ్లు గుర్తు పెట్టుకుంటారో నేను చెప్పలేను, ఐనా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి…
నేనేమైనా తోపునా..? ప్రపంచంలో వేల మంది నటులున్నారు… ఏమో, నేను పోయాక మహా అయితే రెండేళ్లు చెప్పుకుంటారేమో…’’ ఇలా సాగిపోయింది తన ఇంటర్వ్యూ… స్థూలంగా పరికిస్తే తన మాటల సారాంశం పట్ల నెగెటివ్, పాజిటివ్ ఫీలింగ్స్ రెండూ కలుగుతాయి…
72 ఏళ్లు ఇప్పుడు తనకు… దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తనది… ఏ వయస్సులో కూడా తన ఫిజిక్, లుక్ కాపాడుకుంటున్నాడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ముసలోడైపోలేదు… ఎస్, భిన్నమైన పాత్రల్లో దూరిపోగలడు, అద్భుతమైన నటుడు… కానీ నాణేనికి మరోవైపు చూస్తే… కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా రాణిస్తున్నాడు… తను ఇన్నాళ్లూ సంపాదించుకున్న బోలెడంత సంపద ఉంది… సో, డబ్బు గురించిన తాపత్రయం కాదు మమ్ముట్టిది…
Ads
తను రిటైరయిపోయి ఇంట్లో కూర్చోలేడు… తనకు సినిమాయే వ్యాపకం… చుట్టూ కెమెరాలుండాలి, సినిమా వాతావరణం ఉండాలి… నిజమే, కానీ ఇంత సీనియర్లు కూడా ఫీల్డ్ వదలకపోతే కొత్త నీరు వచ్చేదెలా..? కొత్త మొహాలు, ఇంకా వైవిధ్యం తెరమీదకు రావాలి కదా… పాత నీటి పాచు వదిలి కొత్త నీరు ప్రవహించాలి కదా… ఈ కోణంలో మమ్ముట్టి మాటలు కాస్త నిరాశను కలిగిస్తాయి… కానీ..?
తను ఎవరికైనా సరే అడ్డుపడటం లేదు… ఇంకా జనం చూస్తున్నారు కదాని, ఇంకా పాపులారిటీ ఉంది కదాని, తన సినిమాలకు బిజినెస్ వర్కవుట్ అవుతుంది కదాని, ఇంకా డబ్బులొస్తున్నాయి కదాని… ఏ పాత్రపడితే ఆ పాత్ర చేయడం లేదు… సగటు ఇండియన్ హీరో, మరీ ప్రత్యేకించి సౌత్ ఇండియన్ హీరోలు అంగీకరించని వైవిధ్యభరిత పాత్రలు కూడా చేస్తున్నాడు, మెప్పిస్తున్నాడు…
నిన్న గాక మొన్న వచ్చిన సగటు తెలుగు హీరోకు కూడా మితిమీరిన బిల్డప్పులు, ఇమేజ్ ఫోజులు… కానీ మమ్ముట్టి చేసినట్టు ఓ గే పాత్ర ఎవరైనా చేయగలరా..? భ్రమయుగం పాత్ర చేయగలరా..? కొందరు ముసలోళ్లున్నారు తెలుగులో… భ్రమయుగం పాత్రకూ స్టెప్పులు పెట్టి, ఫైట్లు పెట్టి నాలుగు వెకిలి డైలాగులు, వీలయితే ఓ ఐటమ్ సాంగ్ కూడా పెట్టించుకుంటారు… అఫ్‌కోర్స్, తమిళంలో కూడా… వీపుకు బద్దలు కట్టుకుని, అలా చేతులు, కాళ్లు కష్టమ్మీద కదిలిస్తూ హీరోయిన్లతో స్టెప్పులు, కంపు రొమాంటిక్ డైలాగులు, పాటలు… ఇక ఫైట్ల సంగతి చెప్పనక్కర్లేదు… రొటీన్ పాత్రలు, ఒక్కడికీ కాస్త వైవిధ్యమున్న పాత్ర చేయాలనే తపన లేదు, ఇంకా ఇంకా డబ్బు యావ తప్ప…
అన్నింటికీ మించి మమ్ముట్టి చెప్పిన కొన్ని మాటలు బాగున్నయి… ‘వేల మంది నటుల్లో తనొకడు, తను పోతే ఇంకొకడు, ఎందుకు జనం ఎక్కువ కాలం గుర్తుంచుకోవాలి…’ నిజం… కాలప్రవాహంలో ఎందరో కొట్టుకుపోతుంటారు, అంతే… మరీ తెలుగు పాత హీరోలను, ప్రజెంట్ హీరోలను దేవుళ్లుగా కీర్తించే కాలంలో, తమను తాము దేవుళ్లుగా భావించుకునే హీరోల కాలంలో మమ్ముట్టి మాటలు ఎంత రియలిస్టిక్… బాగా చెప్పావు Muhammad Kutty Panaparambil Ismail అలియాస్ మమ్ముట్టి భాయ్… మరికొన్ని వెరయిటీ పాత్రలూ నీకోసం వేచి ఉన్నయ్, కుమ్మెయ్..!!
Share this Article