.
అనుకుంటాం గానీ… చిన్నాచితకా నటులు, దర్శకులు, నిర్మాతలు ఏదో 90 వేసి వచ్చి, కడుపులో ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను సినిమా వేదికల మీద కక్కేస్తుంటారు గానీ…
అంతకుమించి పిచ్చి కూతలకు నిజానికి పెద్ద తలకాయలే ప్రసిద్ధం… పక్కా ఉదాహరణ ఏమిటంటే..? ది గ్రేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మురళీ మోహన్… ఎస్, తనను ఓ నటుడిగానో, ఓ హీరోగానో గుర్తించాల్సిన పనిలేదు, తనకు అంత సీన్ కూడా లేదు…
Ads
జస్ట్, అలా వచ్చాడు, ఇలా హీరో అయ్యాడు… వాళ్లదే కదా సినిమా రాజ్యం… కొనసాగాడు… అంతకుమించి తనకు ఏమీ తెలియదు… ఇంత సీనియర్ కదా, ఏదైనా మంచి ఎమోషన్ సీన్ ఇచ్చి నటించవయ్యా అంటే బ్బెబ్బెబ్బే…
తిరుమల వెంకటేశ్వర స్వామిన కూడా చౌదరి అని పిలిచిన ధూర్తుడు తను… సరే, అది వదిలేస్తే… రెండు తెలుగు ప్రభుత్వాలు వేర్వేరుగా అవార్డులు ప్రకటిస్తే సమస్యలు వస్తాయట… ఒక సంవత్సరం ఏపీ, మరో సంవత్సరం తెలంగాణ అవార్డులు ప్రకటించాలట… పర్‌ఫెక్ట్ పిచ్చి కూత ఇది…
హైదరాబాద్ బేస్డ్, తెలంగాణలో నడిచే తెలుగు సినిమాలు గనుక దరఖాస్తు చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం అవార్డులకు పరిగణనలోకి తీసుకుంటుందయ్యా మహానుభావా..? ఈ వాక్యానికి అర్థం తెలియకపోతే ఇక నోరు విప్పకపోవడం నీకే మర్యాద…
ఏపీలో ఎవడు సినిమాలు తీస్తాడో తెలంగాణ ప్రభుత్వానికి అనవసరం… వేర్వేరు అవార్డులు దేనికి..? రెండు ప్రభుత్వాలు వేర్వేరుగా అవార్డులు ప్రకటిస్తే ఈ వ్యాపాారికి ఏం నొప్పి..? వోకే, తెలంగాణ ప్రభుత్వమో, ఏపీ ప్రభుత్వమో ఓ అవార్డు ప్రకటించిందీ అనుకుందాం…
ఇక కేంద్ర ప్రభుత్వమూ జాతీయ అవార్డులకు పరిగణనలోకి తీసుకోవద్దా..? పిచ్చి వాదన కాదా ఇది..? గద్దర్ అవార్డులు వేరు, ఒకవేళ చంద్రబాబు నంది అవార్డులు ఇస్తే గనుక అవి వేరు… తనకు అంత సీనూ లేదు… తెలంగాణ ప్రభుత్వానిది ఓ కోణంలో గ్రేట్‌నెస్…
2014 నుంచీ వచ్చిన సినిమాలను పరిశీలించి ఏడాదికి మూడు సినిమాలను గుర్తించింది… ఇదే మురళీమోహన్ బాస్ చంద్రబాబుకు అదీ చేతకాలేదు… అటు పవన్ కల్యాణ్, ఇటు మురళీమోహన్ బాపతు వర్గాలు.,.. వీళ్లు ఎటూ తెగనివ్వరు… పైగా తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపు…
శాస్త్రీయమో, అశాస్త్రీయమో… సరైనవో కావో… కేసీయార్ సినిమాకు చేసిన గుర్తింపు ద్రోహాన్ని రేవంత్ రెడ్డి దిద్దుతున్నాడు… మధ్యలో ఈ మురళీమోహన్‌లను ఇన్వాల్వ్ కానివ్వొద్దు… మొత్తానికే కంపు పట్టిస్తారు… అదే మురళీమోహన్ చేస్తున్న వ్యాఖ్యలతో లీలగా కనిపిస్తున్న విపత్తు…
అయ్యా, రేవంతం సారూ… పొరపాటున కూడా ఇలాంటి కేరక్టర్లను సినిమా సంబంధ ఇష్యూల్లో ఇన్వాల్వ్ చేయొద్దు సుమీ… మీ చంద్రబాబుకు ఎంత ఆత్మీయులైనా సరే… నిన్నే నిండా ముంచేస్తారు…!
Share this Article