Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భార్యాభ‌ర్త‌లు ఇలా సంగీతంలో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటారూ..?

June 1, 2023 by M S R

Bharadwaja Rangavajhala……..   భార్యా భ‌ర్త‌లు ఇలా సంగీతంలో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటారూ ?

మొన్న మీరేమ‌న్నారూ …. వ‌ల‌చి రాగంలో వెన్నెల‌రేయీ ఎంతో చ‌లీ చ‌లీ అన్లేదూ …

Ads

అదెప్ప‌టి మాట వేస‌వి రాక‌పూర్వం … ఇప్పుడు ఇందాక వ‌ర్షం ప‌డ్డాక‌ ప‌రిస్తితి చూస్తుంటే … వ‌ల‌చిలోనే నా రాణి క‌నుల‌లోనా అని పాడాల‌నుంది.

స‌ర్లెండి … ఎవ‌రేనా వింటే న‌వ్వుతారు… వ‌సంత‌గాలికి వ‌ల‌పులు రేగ అని పాడే వ‌య‌సా మ‌న‌ది వ‌ల‌చి రాగంలోనే …

అందుకే అనేది కాస్త జైజ‌వంతి వినిపించినా మ‌న‌సున మ‌న‌సై బ్ర‌తుకున బ్ర‌తుకై తోడొక‌రుండిన అదే భాగ్య‌మూ అన్నారు శ్రీశ్రీ వ‌ల‌చిలోనే

మ‌ర‌దే … ఏం మాట్లాడినా … ఆనంద‌భైర‌విలో ప‌లుకే బంగారమాయెరాఅన్న‌ట్టుండాలి … అంటారు .. మ‌న‌సున మ‌న‌సై అట …

మాకు తెల్సులెండి … శివ‌రంజనిలో కూడా మెరిసే మేఘ‌మాలికా అని రొమాన్స‌గ‌లం తెల్సా మీకు ?

అవునూ అదేదో హిందీ పాట క‌దూ …

అదే మ‌రి సూర‌జ్ మూవీలో బహారోం ఫూల్ బర్సావో పాటే అది …

అవునూ అది కాపీ రాగం అనుకుంటా …

స‌రే కాఫీ నుంచీ వ‌చ్చిన‌దే శివ‌రంజ‌ని … ఇది హిందూస్తానీయే … విషాదానికి వాడే శివ‌రంజ‌నిని శంక‌ర్ జైకిష‌న్ లు ఇలా రొమాన్సుకు వాడి చేసిన ఆ ప్రయోగం రాజేశ్వ‌ర్రావుకు ఎంత ఇష్ట‌మో తెల్సా …

అవును … అయినా ఈ శాస్త్రీయ రాగాల ఆధారంగా పాట‌లు కంపోజ్ చేస్తార‌ని చెప్పుకోడ‌మే గానీ … కొన్ని పాట‌లు మ‌రీ ఇదిగా ఉంటాయి క‌దా ..

ఏమిటా ఇదిగా అనిపించిన పాట‌లు ?

మోహ‌న‌లో ఇళ‌య‌రాజా చేసిన ఎన్టీఆర్ పాట … దాదాదా దాస్తే దాగేదా పాట కాస్త ఎబ్బెట్టుగా అనిపించ‌దూ …

ఏం ఉండ‌దు … అందులో ఆత్రేయ‌గారి సాహిత్యం ఎంత బాగుంటుంది … ఏ తాడైనా మూడే ముళ్లు సంబ‌ర‌మంతా మూణ్ణాళ్లూ ఎవ‌డ్రాస్తాడండీ అలా …

ఆ ఇళ‌య‌రాజానే చేసిన పాటింకోటుంటుందండీ మోహ‌న‌లో …అది బానే ఉంటుంది ..

ఏంట‌దీ వాణీ జ‌య‌రాం పాడిందీ నినుకోరీ వ‌ర్ణం అదేనా ?

అదే అదే … ఇంకా వే వేలా గోపెమ్మ‌లా ..కూడా బానే ఉంటుంది కానీ … అక్క‌డ‌క్క‌డా అన్య‌స్వ‌రాలు వాడాడు. కాస్త ఎక్కువ‌గానే అనుకోండి …

నాకైతే అమ్మాయీ …మోహ‌న అన‌గానే లాహిరి లాహరిలోనే … అనుకో …

ఎప్పుడూ మీక‌దే రంధి నాకు తెలియ‌దా ఇవ‌న్నీ కాదుగానీ ఆ సింధుభైర‌విలో వినిపిస్తుందే … తిరుప‌తి దేవుడి పాటండీ ..వేంక‌టాచ‌ల నిల‌యం వైకుంఠపుర‌వాసం ఎంత హాయిగా ఉంటుందీ మీ సినిమా పాట‌ల‌క‌న్నానూ …

నువ్వ‌లా భ‌క్తి వైపు ప‌రుగులు తీయ‌కు … ల‌లిత ప్రియ‌క‌మ‌లం పాట భ‌లే ఉంటుంది క‌దా… ఇళ‌య‌రాజా ల‌లిత్ లో చేశాడు ఈ పాట …

ల‌లిత్ లోనే చేశాడుగానీ ఏమిటో ఆ బాల‌చంద‌ర్ గోల … ఆ అమ్మాయి ఆలాప్ తీయ‌డం హీరో ల‌లిత క‌దా నీ పేరు అన‌డం వ‌ర‌కు స‌రే … అయినా ల‌లితా శివ‌జ్యోతి అని పేరెట్ట‌డం వెన‌క్కాల … గ‌ణేశ్ పాత్రో ఉండుండేమో అని నా అనుమానం …

ఉండుంటాడులే … కానీ నాద వినోదము అంటూ సాగ‌ర‌సంగ‌మంలో క‌మ‌ల‌హ‌స‌నూ జ‌య‌ప్ర‌దా డాన్స్ చేస్తారు క‌దా అదీ ల‌లితేగా …

పూర్తిగా కాదు … అమావాస్య చంద్రుడులో సుంద‌ర‌మో సుమ‌ధుర‌మో ల‌లిత్ అనుకోవ‌చ్చు …

ఇంకేమిటి విశేషాలు …?

ఆ ఏముంది లెండి … శుద్ద ధ‌న్యాసిలో … పాటందుకోవాల‌నుంది …

ఏమిట‌దీ ఎంత వార‌లైన కాంత దాసులే అనా … స‌రే కానీ …

హ‌హ‌హ

ఇలాగానీ మాట్లాడుకుంటే …

జ‌నాల‌కు పిచ్చెక్కేయ‌దూ …. జంధ్యాల టైపులో ఏదైనా సినిమాలో పెట్టాలి …

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
  • ఆ ఫ్లాట్లలోనే మగ్గిపోకుండా… స్విగ్గీలు అయిపోకుండా… కాస్త కిందకు దిగండి…
  • పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
  • గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
  • పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’
  • సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
  • Petal Gahlot… పాకిస్థాన్ అధ్యక్షుడిని కబడ్డీ ఆడేసుకుంది… అసలు ఎవరీమె..?!
  • మందు ఎక్కితే… ఆంగ్లం దానంతటదే తన్నుకుని వస్తుంది అదేమిటో గానీ…
  • బాబు గారూ… మీకు చౌతాలా వయస్సు, జైలుశిక్ష గురించి ఏమైనా తెలుసా..?!
  • సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions