Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

My Old Neighbours- హఠాత్తుగా వాళ్లలోని ప్లస్ పాయింట్స్ కనిపించసాగాయి…

March 7, 2023 by M S R

చాలా ఏళ్లుగా… దశాబ్దాలుగా వాళ్లు మా పక్కింటివారు… వాళ్లూ మాలాగే మార్వాడీలు… కానీ ఆమెను నేనస్సలు ఇష్టపడే వాడిని కాను… ఆమెకు మా అమ్మ వయస్సుంటుంది… ఆమెను మేం భువాజీ అని పిలిచేవాళ్లం… ఆమె ఎప్పుడూ మా ఇంట్లోనే ఉన్నట్టు ఉండేది… హఠాత్తుగా ఊడిపడేది… మా అమ్మ మీద ఆధిపత్యం, పెత్తనం చూపించేది… నా భార్యను కూడా పదే పదే ఏదో విషయంపై కామెంట్ చేసేది… చీరె సరిగ్గా కట్టలేదనీ, మొహంపై ఘూంగత్ సరిగ్గా లేదనీ, చీరె బదులు డ్రెస్ వేసుకున్నదనీ రకరకాలుగా ఏదో సాకు చూపి మరీ తప్పు తీసేది…

రోజూ పొద్దున్నే ఆమె మా ఇంటికి రావడం ఓ తప్పనిసరి కార్యక్రమం… కప్పు పెరుగు, కాస్త చక్కెర అంటూ వచ్చేది… కొన్నిసార్లు ఉప్పు కావాలని వచ్చేది… ఆమె బాసిజం నాకు చిన్నప్పటి నుంచీ నచ్చేది కాదు… కానీ భరించక తప్పేది కాదు… ఆమె మా కుటుంబాన్ని ద్వేషిస్తూనే మళ్లీ మళ్లీ మా ఇంటికి ఎందుకు రావాలి అనిపించేది…

వాళ్లతో పోలిస్తే మాది కాస్త కంఫర్టబుల్ ఫ్యామిలీయే… మా నాన్న ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటాడు… కానీ ఆమె భర్త యాభయ్యేళ్లకే రిటైరయ్యాడు… ఆమె పిల్లలు కూడా నాకు ఇష్టముండేది కాదు… ఆమెకు నలుగురు కొడుకులు… తను గర్వంగా చెప్పుకునేది ఆ సంఖ్యను… ఆ సంఖ్యలో గొప్పతనమేమిటో దేవుడికే తెలియాలి… ఏమో, భౌతిక సౌకర్యాలు సరిగ్గా లేనివాళ్లే ఈ గర్వం, అతిశయాల్లో పడిపోతుంటారేమో…

Ads

పదేళ్ల క్రితం… ఓరోజు ఆమె ఎప్పటిలాగే వచ్చింది… మేం ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నామని మా అమ్మతో చెప్పింది… ఎక్కడో పట్టణ శివారులోకి వెళ్తున్నారట… అరె, ఎప్పుడూ చెప్పలేదేం, ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఏమిటి అనడిగింది… నిజమే, తాము ఇల్లు మారుతున్నట్టు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు ఇన్నాళ్లూ… మేం ఊహించలేదు కదా, అందుకని కాస్త షాకింగ్…

హమ్మయ్య, వెళ్లిపోయారు… హేపీగా ఉంది అని కొన్నాళ్లు నేనూ సంబరపడ్డాను… నచ్చని నైబర్ వెళ్లిపోతేనే మంచిది కదా… కొన్నాళ్ల తరువాత నాకు వాళ్లు వెళ్లిపోవడం నచ్చలేదు విచిత్రంగా… మనసులో బలంగా అనిపిస్తోంది… వాళ్లు వెళ్లకుండా ఉండేనే బాగుండేదని… వాళ్లు ఉన్నన్నిరోజులూ ఆమెను ద్వేషించేవాడిని… నేనిప్పుడు ఎవరిని ద్వేషించాలి..? అరె, నేనేమిటి ఇలా ఆలోచిస్తున్నాను… ద్వేషించడానికీ మనుషులు కావాలని కోరుకుంటున్నానా..?

neighbour

వాళ్ల మెయిన్ డోర్స్ ఇరగ్గొట్టాలని చిన్నప్పుడు అనిపించేది… ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ… అనుకుంటే తలుపులు బద్దలు కొట్టగలను… కానీ చిన్నప్పుడు కోపంలో అనుకోవడం వేరు, నిజంగానే చేయడం వేరు కదా… ఆ మెయిన్ డోర్ ముందు నుంచీ వెళ్తుంటే నాకు ఎందుకో తెలియని ఉద్వేగం ఆవరిస్తోంది… ఈ రియలైజేషన్ నాకే ఆశ్చర్యంగా ఉంది… ఇప్పుడు అకస్మాత్తుగా ఆ పక్కింట్లోనే ప్లస్ పాయింట్స్ కనిపించసాగాయి… గుర్తుకురాసాగాయి…

నాన్న తెల్లారే ఆఫీసుకు వెళ్లిపోయేవాడు… పిల్లలు, ఇంటి పని పూర్తయ్యాక ఆమే మా అమ్మకు దోస్తు… లోకంలో ఎక్కడెక్కడి విషయాలో ఆమె సేకరించేది… అభిప్రాయాల్ని కలిపి మరీ మా అమ్మకు చెప్పేది… ఎక్కువ శాతం అమ్మ శ్రోత మాత్రమే… నోరు తెరుచుకుని వింటూ ఉండేది… అసలు 650 అడుగుల ఇంట్లో 10 మంది బతకడం ఎలాగో వాళ్లను చూసే నేర్చుకోవాలి నిజానికి… ఒకటే బాత్రూం కమ్ టాయిలెట్… ఎక్కడా చప్పుడు లేకుండా ఎవరి పనులు వాళ్లు చేసుకునేవాళ్లు… వాళ్ల అపార్ట్‌మెంట్ నుంచి చిన్న గొడవ కూడా విన్న ఉదాహరణ లేదు మాకు…

వాళ్లు మా ఇంటి పక్కనే ఉన్నప్పుడు నాకెందుకు ఇన్ని ప్లస్ పాయింట్లున్నాయని అనిపించలేదు..? ఆమెను ద్వేషిస్తూ ద్వేషిస్తూ మిగతావి పట్టించుకోలేదా నేను..? నేను వాళ్లను మిస్సవుతున్నాను… ప్రత్యేకించి ఆమెపైన నాకున్న ద్వేషం ఆవిరైపోయింది క్రమేపీ… ఏదో తెలియని అభిమానం పెరుగుతోంది… వాళ్లు దూరంగా ఉన్నందుకా ఈ మార్పు..? నిజంగానే వాళ్లలోని మంచితనాన్ని గుర్తించలేకపోయానా..? ఆమె ఎప్పుడూ మా మీద ఏ కుట్ర చేయలేదు… మా గురించి ఎవరికీ చెడుగా చెప్పలేదు… మాలోమాకు తగాదాలు పెట్టలేదు…

మేం ఉంటున్న ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలోని బొరివిలిలో ఉంటున్నారు వాళ్లు… ఆమె (భువాజీ) ముసలిదైపోయింది… ఏ సపోర్టు లేకుండా కనీసం సరిగ్గా నడవలేకపోతోంది… గత 3 ఏళ్లలో మూడునాలుగు సార్లు ఆమెను కలిశాను… ప్రేమగా మాట్లాడాను… ఆమె నాలాగే కృష్ణుడి భక్తురాలు… మొత్తానికి నాకు అర్థమైంది ఏమిటంటే..? మనం ఎవరికీ గొప్పగా ప్రేమించకపోతే నష్టమేమీ లేదు… కానీ ద్వేషించాల్సిన పనిలేదు… దానివల్ల విచారం, పశ్చాత్తాపం మాత్రమే దక్కుతాయి… ఈమధ్యే ఆమె కన్నుమూసింది… అందరికన్నా ఎక్కువగా విలపించింది నేనే… దుఖం ఆగలేదు… ఎందుకో నాకిప్పటికీ అర్థం కాలేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions