Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పార్టీ ప్రచారచిత్రమైనా సరే… ఉక్కు రొమాన్స్ స్టెప్పులూ ఉండాల్సిందే…

March 24, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… మన దేశం సినిమాతో ప్రారంభమయిన యన్టీఆర్ నట ప్రస్థానం ఈ నా దేశం సినిమాతో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది . అక్టోబర్ 27 , 1982న విడుదలయిన ఈ సినిమా ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ ప్రచారానికి కూడా బ్రహ్మాండంగా ఉపకరించింది .

1982 మార్చి ఆఖర్లో ప్రకటించిన ఆయన పార్టీ ప్రచార ప్రభంజనం జరుగుతున్న రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ 19 రోజుల్లో పూర్తి చేసి విడుదల చేసారు . ప్రచారంలో ఆయన చెప్పే మాటలే చాలావరకు ఈ సినిమాలో వాడబడ్డాయి . పరుచూరి బ్రదర్స్ డైలాగులను మొత్తం పార్టీ ప్రచారానికి వ్రాసారు .

Ads

ముఖ్యంగా సినిమా క్లైమాక్సులో సత్యనారాయణ , జగ్గయ్య , గిరిబాబులను కట్టేసి రోడ్ మీద పెరేడ్ చేయించే సీన్ థియేటర్లలో పేలిపోయింది . ఎంతగా అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే స్వ పర బేధం లేకుండా తప్పు చేసింది ఎవరయినా అలాగే కట్టి ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్షించే అధికారం , అవకాశం జనానికే ఇస్తారని నమ్మేంత .

యస్ వెంకటరత్నం , దేవీ వరప్రసాద్ వంటి పెద్ద నిర్మాతలు ఈ సినిమా నిర్మాతలు . బొబ్బిలి పులి , జస్టిస్ చౌదరి వంటి బ్లాక్ బస్టర్లు థియేటర్లలో ఉండగానే ఈ నా దేశం సినిమా వచ్చి కోటి రూపాయల్ని కలెక్ట్ చేసిందట . పది సెంటర్లలో వంద రోజులు ఆడింది .

ఈ సినిమా వంద రోజులు కాకముందే ఆయన 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసారు . మన దేశంతో మొదలయిన ఆయన ప్రస్థానం నా దేశంతో ముఖ్యమంత్రి అవతారంతో ముగిసింది . Of course , తర్వాత మళ్ళా కొన్ని సినిమాలు వచ్చాయి .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో ఉన్నాడురా ఆ దైవము ఉంటాడురా నీ కోసము అనే పాట సినిమాకు ఐకాన్ సాంగ్ అని చెప్పవచ్చేమో . నందమూరి రాజా పాడారు . సినిమాలోని ఆరు పాటల్నీ వేటూరే వ్రాసారు . ప్రేమకు పేరంటము , చల్లపల్లిలో చల్లనమ్మే , ఈ చెంప ముద్దందిరో , రోజులన్ని మారె నాలుగు పాటలు యన్టీఆర్ , జయసుధల మీదే .

జయసుధ కూడా షూటింగ్ అయి ఇంటికి వెళ్ళాక కాపు పెట్టించుకుని ఉంటుంది యమగోల జయప్రదలాగా . ఇంకో పాట నేనొక నెత్తురు దీపం యన్టీఆర్ మీద .

భారీ తారాగణం . సత్యనారాయణ , జగ్గయ్య , గిరిబాబు , అల్లు రామలింగయ్య , ప్రభాకరరెడ్డి , పి యల్ నారాయణ , శివకృష్ణ , పద్మనాభం , సుత్తి వేలు , చలపతిరావు , సిల్క్ స్మిత , రాధాకుమారి , కృష్ణవేణి , రోహిణి , ప్రభృతులు ఉన్నారు . కాంచన , జమున తల్లులుగా నటించారు .

ఈ సినిమా చూడని యన్టీఆర్ అభిమానులు , తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఉండరు . ఎవరయినా ఒకరూ అరా ఉంటే యూట్యూబులో చూసేయవచ్చు . In a way , Naa Desam movie is a promotional cinema of the then new Telugu Desam Party . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions