Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పటి స్టార్ హీరోలకు దీటుగా… ఫుల్లు డామినేట్ చేసిన కైకాల సినిమా…

September 1, 2024 by M S R

మొన్న గురువారం రోజున… సరిపోదా శనివారం అనే ఓ సినిమా వచ్చింది కదా… నాని హీరో, ఎస్ జే సూర్య విలన్… కానీ హీరోను విలన్ నటనలో డామినేట్ చేసేస్తాడు… కేరక్టర్‌కు కూడా బాగా ఎలివేషన్ ఇచ్చారు… 1976లో ఓ సినిమాలో కూడా ఇలాగే… పేరుకు రామకృష్ణ హీరో… కానీ సత్యనారాయణ ఫుల్లు డామినేట్ చేసేసి, ఒకరకంగా తనే హీరో అనిపించుకున్నాడు… అప్పటి స్టార్ హీరోలకు దీటుగా…

అవును . ఈ సినిమాలో సత్యనారాయణ పేరే భగవాన్ . ఈ సినిమాకు సత్యనారాయణే హీరో . NTR లాగా , ANR లాగా , కృష్ణ లాగా , శోభన్ బాబు లాగా మారు వేషాలు కూడా వేస్తాడు . హిందీలో ధర్మ అనే టైటిల్ తో సూపర్ హిట్టయిన సినిమా ఆధారంగా మన తెలుగులో 1976 లో యస్ డి లాల్ దర్శకత్వంలో నా పేరే భగవాన్ గా వచ్చింది . వంద రోజులు ఆడింది కూడా . హిందీలో ప్రాణ్ వేసిన పాత్రను సత్యనారాయణ వేసారు . బాగా నటించారు .

ధర్మయ్య కోటినాగులు అయి , రాబిన్ హుడ్ అయి , భగవాన్ అయి , కాసేపు నవాబు అయి , ప్రభుత్వాన్ని , దుర్మార్గులని గజగజలాడించి , అలసిపోయి , చట్టప్రకారం జైలు శిక్ష అనుభవిస్తాడు . హిందీ సినిమాకు మక్కీకిమక్కీ తీసారు . కాబట్టి కధ , స్క్రీన్ ప్లే సమస్యలు లేవు . ఇలాంటి సినిమాలు తీయటంలో దిట్ట యస్ డి లాల్ . బాగా తీసారు . గొల్లపూడి మారుతీరావు డైలాగులు బాగా వ్రాసారు .

Ads

ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలలో ఒకటి పాటలు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు హిట్టయ్యాయి . రెండు ఖవాలీ పాటలు హిట్టయ్యాయి . మేడలో చేరిన చిలకమ్మా , మన్నించుమా ప్రియా మన్నించుమా ఖవాలీ పాటలు చిత్రీకరణ కూడా బాగుంటుంది . మొదటిది జయమాలిని మీద , రెండవది మంజుల మీద . మొదటి పాటలో సత్యనారాయణ నటన హైలైట్ . నిప్పు లాంటి మనిషి సినిమాలో స్నేహమేరా జీవితం పాటలో ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది . మిగిలిన పాటలు ఎంత బాగుంటుంది పడుచుపిల్లకెంత బాగుంటుంది , నిన్న నీవు నీవు కావు , నిన్ను మధుశాల రమ్మన్నది ఈ మధుబాల తోడున్నది కూడా బాగుంటాయి .

ఈ సినిమాలో ఇంకో విశేషం కూడా ఉంది . మంజుల రెండు పాత్రల్ని పోషిస్తుంది . తల్లీకూతుళ్ళ పాత్రలు . హిందీలో రేఖ పోషించింది . హిందీలో నవీన్ నిశ్చల్ పోషించిన పాత్రను తెలుగులో రామకృష్ణ పోషించాడు . సత్యనారాయణ తర్వాత అంత ముఖ్య పాత్ర ప్రభాకరరెడ్డిది . బాగా నటించారు . ఇతర పాత్రల్లో గిరిబాబు , గిరిజ , అల్లు రామలింగయ్య , త్యాగరాజు ప్రభృతులు నటించారు . బహుశా అల్లు రామలింగయ్య లేని సినిమానే ఉండేది కాదేమో ! ఏ పాత్ర అయినా ఒదిగిపోయే మన నటుల్లో ఒకరు అల్లు రామలింగయ్య .

రెండు సినిమాలూ యూట్యూబులో ఉన్నాయి . రెండూ బాగుంటాయి . సినిమా ప్రియులు , ముఖ్యంగా సత్యనారాయణ , మంజుల అభిమానులు తప్పక చూడతగ్గ సినిమా . 1970s మంజులకు అచ్చొచ్చిన దశకం . చాలా హిట్ సినిమాలు ఉన్నాయి . వాటిలో ఒకటి ఈ సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు   ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీఎం సాబ్, నీ కడుపు సల్లంగుండ..! మెచ్చుకునే నిర్ణయం చెప్పావు..!!
  • విజయ్ వెనుక మాస్టర్ బుర్ర…! పళనిస్వామిపై పగ తీర్చుకున్నాడు..!!
  • మగవాదం..! ‘‘సుమతీ శతకం’’పై ఓ సైకలాజికల్ అనాలిసిస్…!!
  • ఐ-ప్యాకప్…! సోషల్ మాఫియాపై పార్టీల భ్రమలు ఎగిరిపోయాయ్…!!
  • ఎన్నో ఆత్రేయ పాటల్లో- పదాల్లో ఉర్దూ గజల్ స్థాయి అభివ్యక్తి..!
  • Next Telangana..! ఆశ సహజమే..! ఓసారి తమిళ ఫలితంతో పోలిస్తే..?!
  • శోభన్‌బాబును చంపేస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా..? ఛఫో అనేశారు..!
  • తలైవా… Time to Lead…! నాడు జయలలిత గేటు ముందు విజయ్..!!
  • మంత్రి సీతక్క ఝలక్… బీఆర్ఎస్ దుష్ప్రచారంపై కోర్టు అక్షింతలు…
  • జనం సొమ్ము… నగలు, ఫ్యాషన్లు… వందల కోట్ల విలాస ప్రదర్శన…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions