.
3 రోజుల్లో 40 లక్షల వ్యూస్ అని ఓ వార్త కనిపించింది… ఫోక్ టచ్ ఉన్న యూట్యూబ్ వీడియోలకు ఈ వ్యూస్ పెద్ద విశేషం ఏమీ కాకపోవచ్చు… అలా చాలా పాటలు చాలా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి కూడా, పర్టిక్యులర్‌గా తెలంగాణ ఫోక్ ఈరోజుల్లో ట్రెండింగ్…
ఐతే మరి ఈ వీడియో ఏమిటి..? పెద్దగల్ల పెద్దిరెడ్డి అనే టైటిల్… కాజువల్‌గా ఓపెన్ చూస్తే… బాగుంది… ఏదో తోచిన నాలుగు పదాలను రొటీన్ ఫోక్ ట్యూన్‌లో, డీజే మోతతో పొల్యూట్ గాకుండా… భావసహితంగా ఉంది… వివరాలు చూస్తే లిరిక్ రైటర్ లక్ష్మణ్ అని కనిపించింది…
Ads

ఆమధ్య బంపర్ హిట్ పాట… బుల్లెట్ బండి… దాని రచయిత ఈయనే… ఈసారి తండ్రీబిడ్డల ప్రేమను మంచిగా ఆవిష్కరించాడు… తను కాస్త ఎమోషన్‌ను రంగరిస్తాడు పాటలో…

కాకపోతే బిడ్డ పాత్రకు ఎవరైనా సూటవుతారు… నాగదుర్గ అయితే త్వరగా జనంలోకి వెళ్తుందని ఆమెను ఎంపిక చేసుకున్నారు… ఆమె ఉంటే అది ఏ తరహా పాటైనా సరే, నాలుగు డాన్స్ స్టెప్పులు కూడా పెడతారు కదా… ఇందులో కూడా సందర్భరహితంగా పెట్టేశారు… పాట లింక్ ఇదుగో
కానీ ఏమాటకామాట… ప్రస్తుతం తెలుగు యూట్యూబ్ స్టార్ ఆమే… ఈ పాటలో ఒక తండ్రి, ఒక బిడ్డను కన్న దగ్గర్నుంచీ, తను కాటికి వెళ్లే దాకా ఎంత ప్రేమగా చూసుకున్నాడనేది సారాంశం… బాగా రాశాడు లిరిక్ రైటర్… కాస్త ఖర్చు కూడా పెట్టినట్టున్నారు నిర్మాతలు…

ప్రేమగల్ల తండ్రి మరణించాక, తనకు పుట్టిన కొడుక్కి తండ్రి పేరు పెట్టుకోవడం దగ్గర వీడియో మరింత బాగుంది… నాగదుర్గ మంచి డాన్సరే కాదు, నటి కూడా… ప్రస్తుతం రెండుమూడు సినిమాలు కూడా చేస్తున్నట్టుంది… ఎటొచ్చీ తండ్రిని ఖననం చేసిన దగ్గర ఓ చిన్న సమాధిని చూపిస్తే బాగుండేది… మరీ ఓ మట్టిదిబ్బను చూపించారు… దర్శకత్వ వైఫల్యం…

అవును, ఏ స్టార్ హీరో సినిమా పాటైనా సరే యూట్యూబులో పెయిడ్ ప్రమోషన్ ఉంటే తప్ప వ్యూస్ రావడం లేదు… పేపర్లలో రాసుకునే వ్యూస్ సంఖ్యలు అన్నీ టెక్నికల్లీ ట్యాంపర్డ్, పెయిడ్… కానీ యూట్యూబ్‌లో రియల్ ట్రెండ్ సెట్టర్స్ సినిమా స్టార్స్ కాదు… ఫోక్ స్టార్స్… ఇదీ అలాంటి వీడియోల్లో ఒకటి… 4, 5 రోజుల్లో ఇట్టే అలవోకగా కోటి వ్యూస్ అనేది ఇప్పుడు ఫోక్ స్టార్స్‌కు సాధారణ విషయంగా మారిపోయింది..!!

Share this Article