.
అందరూ రాశారు… 84 సంవత్సరాల నజ్మా హెప్తుల్లా సోనియా గాంధీ మీద చేసిన విమర్శ అది… In persuit of democracy, beyond party lines అని ఆత్మకథలాంటి పుస్తకం రాసింది, అందులో చేసిన విమర్శ… ఏమిటంటే..?
తను ఓసారి Inter Parliamentary Union అధ్యక్షురాలిగా ఎన్నికైంది… ఇది షేర్ చేసుకోవడానికి బెర్లిన్ నుంచి ఫోన్ చేస్తే మేడమ్ బిజీ అని చెప్పిన ఎవరో ఆమె సిబ్బంది వెయిట్ చేయండి అన్నారుట… ఈమె గంటసేపు వెయిట్ చేసి, ఇక పెట్టేసిందట…
Ads
అదే విషయం వాజపేయికి చెబితే వెంటనే ఆనందంగా కంగ్రాట్స్ చెప్పి, వచ్చెయండి లెటజ్ సెలబ్రేట్ అన్నాడట… ఆమె హోదా పెంచాడు, ఆమె పర్యటనలకు అప్పట్లోనే కోటి రూపాయలు కేటాయించాడు… ఆ పదవి రావడం ఇండియాకు, ఓ భారతీయ మహిళకు గౌరవం అని ఆనందపడ్డాడు అని నజ్మా హెప్తుల్లా కథనం…
ఇందిర వేరు, నాయకులు కార్యకర్తలతో టచ్‌లో ఉండేది… ప్రజల్లోకి నేరుగా వెళ్లేది… సోనియా వేరు, ఆమె చుట్టూ కోటరీ… ఆమెకు ఏ విషయమూ సరిగ్గా తెలియనిచ్చేవారు కాదు… కాంగ్రెస్ కోసం బాగా పనిచేసిన సీనియర్లు చాలామంది దూరమైంది అందుకే… సోనియా వచ్చాక టెన్ జనపథ్‌తో అదే సమస్య, స్టాఫ్, కోటరీ నియంత్రణలో ఉండేది… అని నజ్మా హెప్తుల్లా చెప్పుకొచ్చింది ఆ పుస్తకంలో…
ప్రముఖ సమరయోధుడు అబుల్ కలాం ఆజాద్ మనవరాలు, ఆరుసార్లు రాజ్యసభ సభ్యురాలు… సోనియాతో పడక 2004లో బీజేపీ చేరి, పార్టీ ఉపాధ్యక్ష పదవి పొంది, కేంద్ర మంత్రిగా పనిచేసి, తరువాత మణిపూర్ గవర్నర్‌గా కూడా చేసిందామె…
ఐతే ఇక్కడ ఆమె ఎక్స్‌ప్రెస్ చేసిన కొన్ని అంశాలను మనం భిన్నంగా కూడా చూడొచ్చు… సోనియా స్టాఫ్ చేసిన తప్పును సోనియాకు ఆపాదించడం కరెక్టు కాదు… గంటసేపు వెయిట్ చేయడం దేనికి…? అంతసేపు లైన్‌లోనే ఉంచడం ఆ స్టాఫ్ తప్పు… నేనే మేడమ్‌తో కనెక్ట్ చేస్తాను తరువాత అని చెప్పేస్తే సరిపోయేది… వోకే, మేడమ్ బిజీ అయిపోయాక ఓసారి నాకు కనెక్ట్ చేయండి, ఇంపార్టెంట్ అని ఈమె చెబితే సరిపోయేది…
నజ్మా ఫోన్ కాల్ గురించి సదరు స్టాఫ్ సోనియాకు చెప్పారా లేదా తెలియదు, అప్పటికే సీనియర్లతో ఆమెకు దూరం పెరుగుతున్నందున ఆమె లైట్ తీసుకున్నదేమో తెలియదు, కొన్ని అంశాల్లో ఎలా రియాక్టవ్వాలో కూడా ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు… ఎందుకంటే..?
నిజమే… ఇందిర వేరు, సోనియా వేరు… ఇందిర పక్కా రాజకీయ వాతావరణంలో పెరిగింది.., నాయకత్వ మెళకువలు, పార్టీ నడిపే తీరు నేర్చుకుంది, ఆమె పర్‌ఫెక్ట్ ఇండియన్… ఆమె ఢక్కామొక్కీలు తిని బలంగా నిలబడిన సాహసి… సోనియా స్వతహాగా పొలిటిషియన్ కాదు… చాలా అంశాల్లో చాలామందిపై ఆధారపడేది… ఆమె పరిమితులు అవి…
సొంతంగా డీల్ చేయలేదు కొన్ని అంశాలు… తనే డీల్ చేసి ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ ఉండేది కాదు, కాంగ్రెస్‌లో విలీనమై ఉండేది… ఇదొక ఉదాహరణ… ఇక వాజపేయికీ సోనియాకు కూడా అస్సలు పోలిక అక్కర్లేదు… ఏ విషయమైన సరే వాజపేయి స్పందించే విధానం వేరు… తను తన మాటలతో ఆత్మీయంగా కనెక్టవుతాడు…
చాలాసార్లు తను పార్టీల పరిధులు దాటి ఓ స్వతంత్ర వ్యక్తిగానే ఆలోచిస్తాడు… వ్యవహరిస్తాడు… సో, నజ్మా హెప్తుల్లా సోనియా మీద రాసిన కంటెంట్, ఆ టోన్ సరైనవిగా అనిపించడం లేదు… అఫ్‌కోర్స్, ఆమె ఫీలింగ్స్ అవి, కాదనడానికి మనమెవరం..?!
Share this Article