వక్రబాష్యాలు, అబద్దాలు, వక్రీకరణలతో పదేళ్లూ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూనే ఉన్నారు… కాస్త ఆగండిర భయ్… అప్పుడే మొదలుపెట్టారా..? నమస్తే తెలంగాణలో ఈరోజు బ్యానర్ స్టోరీ… పచ్చని తెలంగాణలో పంట బంద్ అట… క్రాప్ హాలీడే అట… భోగి వేళ రైతన్నకు బ్యాడ్ న్యూస్ అట… ఇప్పుడు బరాజ్‌ల రిపేరుతో తల్లడం మల్లడం అట… 2019 నుంచి కాళేశ్వరంలో ఫుల్లు నీళ్లు అట… పైగా మార్పు అని వెటకారంగా ఓ చిన్న టచ్…
ఔరా వారీ… కేసీయార్ కుర్చీ దిగిపోగానే ప్రాజెక్టులు సమ్మె చేస్తున్నాయంటావా..? కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందని వరుణదేవుడు అలిగాడంటావా..? బీఆర్ఎస్ దేశ్‌ముఖ్‌లకు జనం కర్రు కాల్చి వాతలు పెట్టగానే ప్రకృతి తెలంగాణ మీద పగబట్టిందా..? ఇవేం రాతలు..? అసలు కాళేశ్వరం కట్టిందే మీరు… కట్టిన మరుసటి సంవత్సరం వరదలకే డ్యామేజీలు జరిగితే 500 కోట్లతో రిపేర్లకు ఖర్చు పెట్టింది మీరు… ఉన్న బరాజుల్లో ఒకటి దస్కింది… మరొకటి బుంగలు పడ్డది.,. ఇంకోదాని పరిస్థితేమిటో దేవుడికే తెలియాలి…
ఇప్పుడు ఆ బరాజుల రిపేరుతో తల్లడం మల్లడం అయిపోతోందట సర్కారు… ఏం..? నిర్వాకాలు మీవయితే వాటిని గాలికి వదిలేయాలా..? రిపేర్లు చేయవద్దా..? మీ సొంత ఖజానాలు నిండగానే చాలు, ప్రాజెక్టు పఢావు పడాలా..? అసలు క్రాప్ హాలీడే అంటే తెలుసా..? ఏ పరిస్థితుల్లో ప్రకటిస్తారో తెలుసా..? ఈరోజుకూ మీ బాస్ ఈ కాళేశ్వరం ద్రోహం, డ్యామేజీల మీద ఒక్క ముక్క మాట్లాడలేదు… అదీ ప్రజలంటే తనకున్న తేలికభావన…
Ads
గోదావరిలో గత ఏడాదికంటే అధికంగా నీటినిల్వలున్నాయట, కానీ పంటకు నీరిచ్చేందుకు వెనుకడుగు అట… ముందే ప్రాణహిత-చేవెళ్లను మీ బాస్ కట్టి ఉంటే ఆ అధిక నీరు తెలంగాణ పొలాలను చేరేది కదా… లక్ష కోట్లు కాళేశ్వరం నుంచే మిగిలేవి కదా… నీళ్లున్నా ఇవ్వరు అంటే రేవంత్, ఉత్తమకుమార్ ఇళ్ల పైన ట్యాంకులు నింపుకుంటున్నారా..? నీటికొరతతో నాగార్జునసాగర్ ఆయకట్టు నిల్ అంటున్నారు కదా… ఇదే కేసీయార్ పాలనలో ఎన్నిసార్లు సాగర్ ఆయకట్టుకు నీళ్లిచ్చారు..?
తీరా చదివితే ఆ స్టోరీ డెక్‌లో ఏం రాసుకొచ్చారంటే..? ఈ యాసంగి సీజన్‌లో నిరుటితో పోలిస్తే 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు కోత అట… అంతేనా..? ఇక దాన్ని క్రాప్ హాలీడే అని డిక్లేర్ చేస్తారా..? పైగా ప్రభుత్వం దాన్ని అధికారికంగా ప్రకటించినట్టు రాసిపారేశారు… పచ్చని తెలంగాణలో పంట బంద్… నమస్తే కోరుకునే అరిష్టం అదేనా..? అసలు కాళేశ్వరంతో వచ్చిన కొత్త ఆయకట్టు ఎంతో ఓ ‘స్వేదపత్రం’ ప్రకటించవచ్చుకదా… రాయండి, దుమ్మెత్తండి, బాణాలు సంధించండి… కానీ అవసరమైనవేళ, నిజంగానే వదలాల్సిన వేళ ఎంతైనా విరుచుకుపడండి… ప్రతిపక్షంగా మీ ధర్మం అది… కానీ ఇలాంటి వక్రకథనాలతో కాదు..!!
Share this Article