Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్లడ్డు, బ్రీడు అంటావు కదా బాలయ్యా… ఈ ‘బ్రీత్’ వివరాలేమైనా వింటివా..?

January 7, 2024 by M S R

ఒక వార్త… అయిదారు రోజుల క్రితం కనిపించింది ఎక్కడో… మెదడు నుంచి పోవడం లేదు… అదేమిటంటే..? ముందుగా ఆ వార్త యథాతథంగా… ‘‘నంద‌మూరి చైత‌న్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన బ్రీత్ మూవీ డిసెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లో రిలీజైంది. మెడికో థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ టాలీవుడ్‌లో ఓ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది.

థియేట‌ర్ల‌లో బ్రీత్ మూవీ జీరో క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. దాదాపు నాలుగు కోట్ల బ‌డ్జెట్‌తో బ్రీత్ మూవీ తెర‌కెక్కిన‌ట్లు స‌మాచారం. బుకింగ్స్ యాప్ ద్వారా ఈ సినిమా సింగిల్ టికెట్ కూడా అమ్ముడుపోలేద‌ని స‌మాచారం.

జీరో క‌లెక్ష‌న్స్‌తో దారుణ‌మైన డిజాస్ట‌ర్ కా బాప్‌గా బ్రీత్ నిలిచిన‌ట్లు చెబుతున్నారు. బ్రీత్ సినిమాకు వంశీకృష్ణ ఆకేళ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నంద‌మూరి బాల‌కృష్ణ అన్న‌య్య జ‌య‌కృష్ణ వార‌సుడిగా చైత‌న్య కృష్ణ బ్రీత్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొడుకును హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం కోసం జ‌య‌కృష్ణ స్వ‌యంగా బ్రీత్ మూవీని నిర్మించాడు.

Ads

ఎలాంటి ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డంతో ఈ సినిమా ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. బ్రీత్ కంటే ముందు చైత‌న్య కృష్ణ కొన్ని సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించాడు. బ్రీత్ హీరోగా అత‌డి మొద‌టి మూవీ కావ‌డం గ‌మ‌నార్హం..’’

ఇదీ వార్త… సోకాల్డ్ బాలయ్య మాట్లాడితే చాలు పదే పదే మా బ్లడ్డు, మా బ్రీడు అంటుంటాడు కదా… అక్కడికి నటనకు ఆ నందమూరి కుటుంబమే పేటెంట్ హక్కుదారు అన్నట్టు గొప్పలు చెబుతుంటాడు కదా… మరి తన సొంత అన్నయ్య కొడుకు ఇంత భీకరమైన డిజాస్టర్ కావడం ఏమిటి..? ఎవరెవరో ధనికులు, బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నవాళ్లు తమ కొడుకులను వెండితెర మీద రుద్దుతూనే ఉన్నారు కదా… కానీ ఇంత దరిద్రంగా ఫెయిల్ కావడం ఏమిటి..? చివరికి మొన్నటికిమొన్న సింగర్ సునీత కొడుకు, యాంకర్ సుమ కొడుకులు కూడా చూడబుల్ ఫేసులు కాకపోయినా కాస్తోకూస్తో కలెక్షన్లు సంపాదించారు కదా… మరీ నందమూరి వారసుడేమిటి..? జీరో వసూళ్లు ఏమిటి..? ఒక్క టికెట్టు కూడా తెగకపోవడం ఏమిటి..?

ఈ డౌటనుమానాలతో చెక్ చేస్తుంటే ఓ ప్రముఖ సినిమా సైట్‌లో పదికి 3 రేటింగ్, 1100 కామెంట్స్ కమ్ ఆడియెన్స్ రివ్యూస్ అని కనిపించింది… ఓపెన్ చేస్తే… ‘‘ఎవడ్రా వీడు..? ఎక్కడ పట్టుకొచ్చారు..? ఇదేం రుద్దుడురా భయ్..?’’ వంటి భారీ ట్రోలింగ్ బాపతు అభిప్రాయలే కనిపించాయి… కలెక్షన్ల వివరాలు దొరకడం కష్టమైపోయింది… అసలు ఇదొక సినిమా వచ్చింది పోయిందీ అనే విషయాన్ని కూడా చాలా సైట్లు గుర్తించలేదు… సరైన ప్రమోషన్ లేకపోవడం, హీరో మెటీరియల్ కాకపోవడం, అసలు దానికి సినిమా రూపస్వభావాలు లేకపోవడం వంటి చాలా విషయాలతో అది ఓ అనామక సినిమాగా మిగిలిపోయింది…

సరే, జీరో కలెక్షన్లు దగ్గరకొద్దాం… ఎవడూ టికెట్ కొనకపోతే 1100 రివ్యూస్ కమ్ ఒపీనియన్స్ ఎలా వచ్చాయి..? జీరో అనేది టెక్నికల్‌గా తప్పు… కష్టమ్మీద ఓచోట కనిపించాయి…

Day 1 ( Sat )

₹ 0.10 Cr

Day 2 ( Sun )

₹ 0.12 Cr

Day 3 ( Mon )

₹ 0.08 Cr

Day 4 ( Tue )

₹ 0.05 Cr

Day 5 ( Wed )

₹ 0.03 Cr

Day 6 ( Thu )

₹ 0.02 Cr

Week 1 Collection

₹ 0.40 Cr

మొదటిరోజు 10 లక్షలు… ఆరవ రోజు మరీ ఘోరంగా 2 లక్షలు… తరువాత థియేటర్ల నుంచి గాయబ్… సో, 40 కోట్ల ఖర్చుకు గాను 40 లక్షలు వాపస్… అందులో నిర్మాత వాటా ఎంతో తెలియదు ఇక… నందమూరి అనే ఇంటి పేరుంటే, డబ్బుంది కదాని జనం మీద హీరోలను రుద్దితే ఇప్పుడు వర్కవుట్ కావడం లేదు బాలయ్యా… నీకేమో సమజ్ కాదు… ఇదే జూనియర్ మీరు చాన్నాళ్లు దూరం పెట్టినా సరే ఎన్టీయార్ రెండోతరం వారసుడిగా నిలబడ్డాడు, ఎక్కడికో వెళ్లిపోయాడు… తనకు పోటీగా ఒకేరోజు డజను సినిమాల్ని ప్రారంభింపచేసిన తారకరత్న ఫ్లాపయ్యాడు, ఫాఫం దురదృష్టవశాత్తూ లోకమే వదిలాడు… సో, బ్లడ్డు బ్రీడు వంటి మాటలు పొరపాటున కూడా రానివ్వకు బాలయ్యా… అన్నట్టు, నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions