Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ వెకిలి చతుష్టయానికి హీరో నాని బాధితుడు… చేతులు, మూతులు కాల్చుకున్నాడు…

March 7, 2023 by M S R

నిన్నటి వివాదం ఏమిటంటే… కేరాఫ్ కంచరపాలెం సినిమా తీసిన దర్శకుడు మహా వెంకటేష్ కేజీఎఫ్ సినిమా హీరో కేరక్టరైజేషన్ మీద చిల్లర వ్యాఖ్యానాలకు పూనుకున్నాడు అదేదో ఇంటర్వ్యూలో… తన పక్కనే ఉన్న ఇంద్రగంటి, నందినీరెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ పగులబడి నవ్వారు…

నిజానికి వెంకటేశ్ మహా అనే ఘనుడి మెదడు పాదాల్లో ఉన్నట్టుంది సరే… మేం కూడా తనకు సరిసాటి అన్నట్టుగా తమ వెకిలి తత్వాలను బయటపెట్టుకున్నారు ఈ మిగతా నలుగురు కూడా..! కేజీఎఫ్ హీరో పాత్ర గురించి వెంకటేశ్ మాట్లాడుతూ… ‘‘తల్లి ఓ కొడుకును ఎప్పటికైనా గొప్పోడు అవ్వమని కోరుతుంది. బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడమని ఆమె ఉద్దేశం. అతడు మనుషుల్ని పెట్టి బంగారం తవ్విస్తాడు. వాడి దగ్గర కొన్ని వేల మంది పనివాళ్లు ఉంటారు. వాళ్లకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు ఇచ్చి, మొత్తం బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారేస్తాడు. వాడంత నీచ్ కమీన్ కుత్తే ఎవడైనా ఉంటాడా. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడుగుతుంది. ఆ మహాతల్లిని నేను ఒకసారి కలవాలి. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొట్టి హిట్ చేస్తున్నాం…”

ఇది ఖచ్చితంగా చిల్లర వ్యాఖ్యానమే… నేను కేజీఎఫ్ హీరో పాత్రను వెనకేసుకురావడం లేదు గానీ… అదొక కథలోని పాత్ర… అంతే… మనం చప్పట్లు కొట్టి హిట్ చేస్తున్నాం అని వ్యాఖ్యానిస్తున్నావంటే… ఆ సినిమాను మెచ్చిన కోట్ల మంది ప్రేక్షకుల అభిరుచిని కించపరుస్తున్నావని అర్థం… అంతకన్నా ఒక దర్శకుడికి దరిద్రం, కుసంస్కారం ఏముంటుంది..? ఆ వ్యాఖ్యలు వింటూ పగులబడి నవ్విన ఆ ఇతర దర్శకులూ అంతే కదా… పైగా వీళ్లకు జనంలో బాగా క్రెడిబులిటీ ఉందట…

Ads

బోల్తా పడిన మహానుభావులు

విలువలకు కట్టుబడి ఇలాంటి మాస్ సినిమాలు చేయలేదట… ఇది మరీ చిల్లర వ్యాఖ్య… నీ క్రెడిబులిటీ ఏమిటో ప్రేక్షకులు చెప్పాలి, నువ్వు కాదు కదా… “ప్రేక్షకుల్లో మాకున్న క్రెడిబిలిటీ వల్ల అలాంటి సినిమాలు తీయడం లేదు. మేం అభ్యుదయవాదం పక్కనపెట్టి, పెన్ను బదులు కత్తి పట్టుకుంటే, వాళ్లు బాబులాగ సినిమా తీస్తాం. మాకున్న సృజనాత్మక దృష్టికి హింసను కూడా సౌందర్యాత్మకంగా చూపించగల శక్తి మాకుంది. కానీ మేం కావాలనే అలాంటి పనులు చేయడం లేదు. అందుకే మేం లోకువ అయిపోతున్నాం…” అబ్బో… ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉంది… మీకు చేతకాని విద్య మొత్తం ట్రాష్ అన్నట్టుగా ఉంది…

https://muchata.com/wp-content/uploads/2023/03/334118647_900757274377962_6055113975700210108_n.mp4

పోనీ, వీళ్ల తెలివితేటలు, ప్రతిభ ఏమిటో చూద్దాం… కేరాఫ్ కంచరపాలెం సినిమా ఓ మలయాళీ సినిమాకు రీమేక్… మరో సినిమా ఏదో ఏడ్చినట్టుంది… మూడో సినిమాకు దిక్కులేదు… ఇన్నేళ్లూ ఖాళీయే… వీళ్లు వెక్కిరిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈరోజు దేశంలోనే హయ్యెస్ట్ పెయిడ్ డైరెక్టర్… మన తెలుగువాడే… ప్రేక్షకుల పల్స్ పట్టుకున్నాడు… ప్రేక్షకులకు నచ్చిన సినిమా నీకు నచ్చకపోతే అది నీ భావదరిద్రం… పోనీ, నీ సినిమా కథల్లో లోపాలు చూపి, నీచ్ కమీన్ కుత్తే అంటే వోకేనా..?

ఇంద్రగంటి మోహనకృష్ణ గతంలో నేతులు తాగాడు… ఇప్పుడేమీ లేదు… వట్టిపోయింది పాడిబర్రె… నానితో వి అనే సినిమా తీయడంతో ఆమధ్య తెల్లారిపోయింది తన ప్రతిభ… ఏదో జటాయువు అనే కథ ఉందట… దేకిన నిర్మాత లేడు… నందిని రెడ్డిని ఓ దర్శకురాలు అనవచ్చా..? ఆమె కూడా డొల్ల కేసే… శివనిర్వాణ ఏదో నాని సినిమాకు దర్శకత్వం వహించాడట… గుర్తులేదు… వివేక్ ఆత్రేయ కూడా హీరో నానికే ఓ భయంకరమైన ఫ్లాప్ ఇచ్చాడు…

ఇక్కడ ఒక విషయం చెప్పాలి… ఆ తిక్క వెంకటేశ్‌ను వదిలేయండి… శివనిర్వాణ ‘టక్ జగదీష్‌’తో నానిని బాధితుడిని చేశాడు… వివేక్ ఆత్రేయ కూడా నానికి ఓ బ్యాడ్ డ్రీమ్… ఆ సినిమా పేరు ‘అంటే సుందరానికి’ కావచ్చు బహుశా… ‘వి’ అనే సినిమాతో కూడా నాని బాధితుడే… ఈ సినిమాకు దర్శకుడు ఇంద్రగంటి… నందినిరెడ్డి తీసిన ‘అలా మొదలైంది’ సినిమాలో కూడా నాని హీరో… కాకపోతే ఈ ఒక్క సినిమా ఫ్లాప్ కాదు… సో, ఈ అయిదుగురిలో నలుగురికీ నాని బాధితుడు… ఎందుకయ్యా నానీ ఇలాంటి కేరక్టర్లను ఎంకరేజ్ చేశావు..?

venkatesh

venkatesh

కేజీఎఫ్ రెండు పార్టులకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు… నిజానికి లాజిక్ ఏముంటుంది..? పాత్రల్ని పాత్రలుగా చూడాలి… పుష్పలో బన్నీ పాత్ర, బాహుబలిలో ప్రభాస్ పాత్ర… అన్నీ అంతేగా… అంతెందుకు ఆర్ఆర్ఆర్‌లో రెండు పాత్రలకూ చరిత్రకు వక్రబాష్యం చెప్పినవే కదా… మరి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారుగా… వాళ్లిష్టం… ఈ చర్చ ఒడవదు, తెగదు… ఇక్కడే ఆపేద్దాం… అన్నట్టు… సరదాగా వీళ్ల సినిమాల్లోని పాత్రలనూ ఇలాగే నీచ్ కమీన్ కుత్తే వంటి పదాలతో వెక్కిరిస్తే ఎలా ఉంటుంది..? ట్రోలింగ్ చేస్తే ఏమవుద్ది..? ఏమీ కాదు… అలా మాట్లాడితే పర్లేదని వాళ్లే పరోక్షంగా చెప్పేస్తున్నారు కదా…!! హలో నానీ, ఈ వెంకటేశ్‌తో ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నావా..?! ముందే జాగ్రత్తపడతాం… ముందే చెప్పు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ కుటుంబమే క్షమించేసింది… మళ్లీ ఇప్పుడు ఈ ఆగ్రహ ప్రకటనలేల..?!
  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’
  • ఆల్రెడీ యూట్యూబ్ వీడియోల క్వాలిటీకి ఎఐ టూల్స్ పర్యవేక్షణ…
  • బ్యాక్ బెంచర్స్..! తరగతి గది సీటింగు మార్చేస్తున్న ఓ కొత్త సినిమా..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions