.
దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రపంచ సుందరి పోటీలు… ప్రారంభోత్సవానికే పరిమితం కానున్న ప్రభుత్వ వర్గాలు, ప్రజాప్రతినిధులు…
ఒక ప్రైవేట్ కార్యక్రమంలా నిర్వహించుకునేలా చూడాలని అధికారుల ఆదేశం… 13న చౌమహల్లా ప్యాలెస్ సందర్శన రద్దు… భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే కార్యక్రమాల కుదింపు… ఔట్ డోర్ పర్యటనల తగ్గింపు…
Ads
అనూహ్య పరిణామాలు జరిగితే పోటీల రద్దు పైనా నిర్ణయం తీసుకునే అవకాశం… ఇది ఒక వార్త…
.
ఐపీఎల్ నిరవధిక వాయిదా… ప్రస్తుత మ్యాచులన్నీ రద్దు… ఇది మరో వార్త…
కమలహాసన్ సినిమా థగ్ లైఫ్ ఆడియో ఫంక్షన్ రద్దు… నిత్యదరిద్రుడు, ధూర్తుడు అనే ఆరోపణలున్న ఎర్ర మెదడు ప్రకాష్‌రాజ్‌కన్నా వంద రెట్లు మేలు అనిపించుకున్న కమలహాసన్… ఇది ఇంకో వార్త…
.
ఎస్, ఇక్కడే మరో మాట చెప్పుకోవాలి… ఏదో తన సినిమా బాగానే సక్సెస్ అయ్యిందనే ఆనందంలో అల్లు అరవింద్ ఆ సినిమా వసూళ్లలో కొంత శాతం ఇండియన్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తానని ప్రకటించాడు… (ఇచ్చాడో లేదో ఎవడూ ఆడిటింగ్ చేయడు, ఆధారాలు ఎవరూ చూపరు, అది వేరే కథ… కనీసం ప్రకటనల్లోనైనా ఓ స్పిరిట్ ఉంది…)
.
దేశం అణు యుద్ధం ముంగిట్లో ఆందోళనలో ఉన్న వేళ…
ఇక్కడ మరో దరిద్రుడి గురించి చెప్పాలి… అసిస్టెంట్ డైరెక్టర్‌గా జీవితం ప్రారంభించి, పూటగడవడమే కష్టమైన దురవస్థ నుంచి పెద్ద హీరో (?)గా మారిన నాని గురించి… గంగ చంద్రముఖిలా మారినట్టు దరిద్రపు సగటు తెలుగు హీరో అవలక్షణాలన్నీ సంతరించుకుని ప్రకాష్ రాజ్‌కు ప్రతిరూపంగా మారుతున్నాడు వీడు…
ఎస్, వీడు అనే సంబోధన కరెక్టే… ఎందుకో కాస్త చెప్పుకుందాం… తను ఏదో తలతిక్క… బూతులు, విపరీతమైన హింస, నెత్తుటి ధారల కమురు వాసనతో ఓ దరిద్రపు సినిమా తీశాడు కదా… పైగా దానికి ఏవేవో సమర్థనలు… హిట్3 అని ఏదో నెత్తిమాసిన పేరు ఏదో పెట్టారు… మన ప్రేక్షకుల దరిద్రపు టేస్టు పుణ్యమాని వాడికి వందల కోట్ల వసూళ్లు వచ్చాయట… ఐనా చెత్త సినిమా చెత్తే…
వాడు సక్సెస్ మీట్ ఆర్గనైజ్ చేశాడు… ఒరేయ్, ఒకవైపు దేశమే థ్రెట్‌లో ఉంది, యుద్దం జరుగుతోంది… ఈ దిక్కుమాలిన ఈవెంట్లు దేనికిరా ఇడియట్ అనే ప్రశ్నలు ఎదురవుతాయని తెలిసి, తెలివిగా (పర్వర్షన్) …. ‘‘పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాలో ఒక సినిమా ఈవెంట్ కాన్సిల్ అయ్యిందని SATISFACTION రాకూడదు, అందుకే ఇవాళ ఈ సక్సెస్ మీట్ ప్లాన్ చేశాం…’’ అంటున్నాడు…
https://x.com/igtelugu/status/1920874539195695551?s=48
వీడి తెలివి చూసి నవ్వాలో జాలిపడాలో తెలియలేదు… ఎవడో ఓ దిక్కుమాలిన హీరో ఓ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాడని ఆ పాకిస్థాన్ గమనిస్తుందట… థూ… ఓ సినిమా ఈవెంట్ కేన్సిల్ అయ్యిందనే సంతృప్తి వాడికి రాకూడదట… హబ్బ… ఓ సగటు తెలుగు సినిమా హీరో పెంట అవలక్షణాల్ని మొత్తం సంతరించుకున్నావ్ కదరా నానీ… ఇప్పుడు ఒక మాట అనడానికి సాహసిస్తున్నా… యు ఆర్ యాన్ ఇడియట్…
ఇంకా నయం, ఐరాస గమనిస్తోంది… టర్కీ, అజర్‌బైజాన్ గమనిస్తున్నాయ్, మాల్దీవులు గమనిస్తున్నాయి అనలేదు… అందుకే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాం అని నిర్లజ్జగా చెప్పుకోలేదు… ఎవడూ రాసివ్వలేదా ఏం..?
నీకు ఇంత ఇచ్చిన సొసైటీకి నువ్వు రివర్స్ ఏమీ ఇవ్వకపోయినా సరే, ఇంకా దుర్లక్షణాలతో దోచుకున్నా సరే… కనీసం యుద్ధ సమయాల్లోనైనా సంయమనం లేదు నీకు… పైగా నీ దిక్కుమాలిన సక్సెస్ అనే బోడి ఈవెంట్‌కు కుళ్లిపోయిన సమర్థన… ఎవడ్రా నువ్వు..? ఐనా, నిన్ను ఇన్నిరోజులూ ఓ నేచురల్ స్టార్ అని నెత్తిన మోసిన ప్రేక్షకులు కదా సిగ్గుపడాల్సింది…
Share this Article