మంచి టేస్టున్న పాట… చెప్పలేని అల్లరేదో, తొంగిచూసే కళ్లలోనా అని స్టార్టవుతుంది… పేరున్న సంగీత దర్శకులు కాదు, పేరున్న గాయకుడు కాదు… పేరున్న లిరిసిస్ట కాదు… కానీ హాయిగా ఆహ్లాదాన్ని నింపేలా ఉన్న మెలొడీ…
ఈ పాట నరుడి బత్రుకు నటన అనే సినిమాలోనిది… టేస్టున్న అమెరికన్ నిర్మాతలు తీశారు… చాన్నాళ్లయింది… ఏదీ..? ఇండస్ట్రీలో విడుదలకు ఒక్కరైనా సహకరిస్తే కదా… భిన్నమైన కథ, విభిన్నమైన ప్రజెంటేషన్ అని విన్నాను… ఐతేనేం, ధర్మదాత దొరికితే కదా, ప్రేక్షకుల్ని చేరేది…
ఏదో కిందా మీదా పడి, చాన్నాళ్లు ప్రయత్నిస్తే పీపుల్స్ మీడియా ముందుకొచ్చింది… ఐనా ఏవో అడ్డంకులు, అరిష్టాలు ఉన్నట్టున్నయ్… ప్రేక్షకుడిని చేరడం లేదు… నిజానికి మార్కెట్‌లో మంచి గ్యాప్ ఉంది, ఇప్పుడే కదా చాన్స్ అంది పుచ్చుకోవాల్సింది… ప్చ్, ఏదో లోపిస్తోంది…
Ads
ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు… టుబీ ఫ్రాంక్ బాగుంది… మంచి మెలొడీ… ఇది ఏ మహిమో, తెలియదు గానీ… మది పసిపాపై సరదా పడెనో… మంచి ప్రయోగం… నీవే నీవే నే వెతికిన లాలనవే… ఈ పదాలూ బాగా పడ్డయ్… మొనాటనీ వచ్చేసిన పిచ్చి తెలుగు పాటల నడుమ ఓ భిన్నమైన వ్యక్తీకరణ… మరీ మరీ కుర్చీ మడతబెట్టే పిచ్చి థమన్ పాటల నడుమ ఎంత పెద్ద రిలీఫ్… ఆహా…
మ్యూజిక్ ఎవరో లోపెజ్ అట… పరిచయం లేదు… గీత రచయిత చిత్రన్ అట… పరిచయం లేదు… గాయకుడు అనంతు అట… పరిచయం లేదు… కానీ పాట బాగుంది… సరళంగానే… నాపై రాలే నీ చిరునవ్వులే… నన్నే నీకు దగ్గర చేసేలే అని పరవశించిపోతున్నాడు కథానాయకుడు పాటలో… నాపై రాలే నీ చిరునవ్వులే నన్నే నీకు దగ్గర చేసేలే అంటూ పులకరించిపోతున్నాడు… బాగుంది…
ఎటొచ్చీ హీరో హీరోయిన్ల ఎంపికలో ఇంకాస్త జాగ్రత్తపడాల్సిందేమో… ప్చ్,.. ఏమో… కథాకథనాలు బాగుంటే ఈ లోెపాలు కొట్టుకుపోతాయేమో గానీ… ఫస్ట్ లిరిక్ మాత్రం ప్రోత్సాహకరమే… ఆల్ ది బెస్ట్…!! అవును మరి, ఎంతసేపూ ఆ పుష్ప మొనాటనీ సుకుమారుడేనా..? ఈ నిర్మాత సుకుమారులూ రావాలి కదా ఇండస్ట్రీలోకి…!!
Share this Article