అనుకుంటాం గానీ… ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర, సాంకేతిక సంస్థలయితేనేం… వాళ్లూ కొన్నిసార్లు మరీ నాసిరకంగా ఆలోచిస్తుంటారు… మరీ సీ గ్రేడ్ హాలీవుడ్ దర్శకుల్లాగా… పోనీ, ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించవచ్చునని నమ్మే టాలీవుడ్ దర్శకుల్లాగా..! విషయం ఏమిటంటే..? నాసా శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులను ఆకర్షించేందుకు పురుషుడు, మహిళ నగ్నచిత్రాలను రోదసిలోకి పంపించాలని ఆలోచిస్తున్నారట… ఏలియన్స్‌ను ఆకర్షించేందుకు ఈ ప్రయోగం ఫలితం ఇవ్వగలదని నాసా సైంటిస్టులు ఆశిస్తున్నట్టుగా బెకాన్ ఇన్ ది గెలాక్సీ అనే అధ్యయనం చెబుతోందట… ఇదీ వార్త…
సంతోషం… పాలపుంతలో జీవం గురించిన ప్రయోగాలు కొత్త పుంతలు… కానీ ఏమాటకామాట… ఆకర్షించాలి అనే ఆలోచన రాగానే పదో పన్నెండో మాంచి హాట్ హాలీవుడ్ ఆడలేడీ స్టార్స్ యాంజిలినా జూలీ, కేట్ విన్‌స్లెట్, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్ తదితరుల బరిబాతల చిత్రాలను మాత్రమే పంపించడం లేదు… అంతే హాట్ ఫిజిక్ కనిపించే మగజెంట్స్ పిక్చర్స్‌కు కూడా పంపిస్తారట… అవును మరి… గ్రహాంతర జీవుల ఆ టేస్ట్ ఏమిటో తెలియదు కదా…
వాళ్లు ఆడో, మగో తెలియదు, అసలు ఆ తేడా ఉందో లేదో తెలియదు, అసలు సంభోగం, పునరుత్పత్తి, కోరిక ఎట్సెట్రా ఎమోషన్స్ ఉంటాయో లేదో తెలియదు… ఉభయలింగ జీవులు కావచ్చునేమో తెలియదు… అందుకని పురుష, స్త్రీ చిత్రాలు విడిగా పంపిస్తారన్నమాట… గుడ్… అయితే ఈ చిత్రాల్ని పొరపాటున చూసేసి, కోరిక చెలరేగిపోయి, ఒరేయ్, భూగ్రహం మీద మంచి సరుకు ఉందిరోయ్, పదండి పదండి మజా చేసేద్దాం అని తెలుగు సినిమా హీరోల్లాగా పాటలు పాడుతూ ఎగేసుకుని వచ్చేస్తారా..? ఓహో… ఏం ఆలోచించారు భయ్యా..?
Ads
అవునూ, అప్పట్లో గ్రహాంతరజీవులు అమెరికా చేతికి చిక్కారనీ, ఎక్కడో నిర్బంధించి ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారని చెబుతుంటారు కదా… ఫాఫం, నాసా వాళ్లకు కూడా ఆ వివరాలు తెలియనివ్వడం లేదా..? వాళ్లూ మనుషుల్లాగా ఉన్నారా ఓసారి తెలిస్తే ఇంకెలాంటి చిత్రాలు రోదసిలోకి పంపించవచ్చో క్లారిటీ వస్తుంది కదా నాసా సైంటిస్టులకు కూడా…!!
అసలు విషయానికి వస్తే… భూగ్రహం మీద నీరుంది… అనుకోకుండా కొన్ని రసాయనాల సమ్మేళనంతో జీవం పుట్టింది… ఓ ఆర్ఎన్ఏ పోగు లేదా ఓ డీఎన్ఏ పోగులాగా పరిణామం పొందడానికే లక్షల ఏళ్లు పట్టిఉంటుంది… తరువాత వైరసులు, బ్యాక్టీరియాలు, ఏకకణజీవులుగా మారడానికి కోట్ల ఏళ్లు… ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కుంటూ, మనుగడ సాగించుకుంటూ, పునరుత్పత్తి ద్వారా వ్యాప్తి చెందుతూ… వృక్షాలుగా, జంతువులుగా… ఆ జంతువులు అల్టిమేట్‌గా మనిషిగా పరిణామం చెందడానికి కోట్ల ఏళ్లు… ఈ రూపం, ఈ మేధస్సు, ఈ ప్రజెంట్ లక్షణాలన్నీ పరిణామగతిలో ఉత్పరివర్తనాలు, మనుగడ కోసం పోరాటంలో భాగంగా సమకూరినవే…
మరి గ్రహాంతరాల్లో ఇవే పరిస్థితులు ఉండాలనేముంది..? అక్కడ జీవం ఉందని అనుకున్నాసరే, అక్కడి భౌగోళిక, ప్రాకృతిక సవాళ్లు, అవసరాలకు అనుగుణంగా జీవం ఎలా పరిణామం చెందిందో తెలియదు… ఆ జీవానికి ఏం ఎమోషన్స్ ఉంటాయో, దాని మేధో స్థాయి ఏమిటో తెలియదు… అలాంటిది మనుషుల నగ్నచిత్రాలను చూడగానే ఆకర్షింపబడతాయనే ఆలోచనే ఎంత అబ్సర్డ్… చివరకు విశ్వపథంలో శాస్త్రీయ పయనానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే నాసా కూడా ఇలా తయారవుతోందా..? రాస్తూ పోతే ఇది తెగదు… సముద్రమంతటి సబ్జెక్టు… అసలు ఇతర గ్రహాల్లో జీవం మనలాగే ఉండటానికి ప్రాబబులిటీ కోట్ల కోట్ల శాతం తేడా… ఇది చాలు కదా..!! అవతార్ సినిమా కాదు, గ్రహాంతర జీవం అన్వేషణ..!!!
Share this Article