.
John Kora …….. పాకిస్తాన్‌లో ఉన్నోళ్లకు కోహ్లీనో కపిలో స్టార్ కావొచ్చు.. ఇండియాలో అఫ్రీదీనో, ఇమ్రాన్‌నో అభిమానించవచ్చు. కానీ పాలిటిక్స్ అండ్ వార్ విషయంలో ఇరు దేశాల్లో ఎవరినైనా ఒకరిని హీరోగా పిలుస్తారా? పాకిస్తాన్‌లో గాంధీ హీరో అవుతాడా? ఇండియాలో జిన్నా హీరో అవుతాడా? ప్రపంచంలో ఏ రెండు శత్రు దేశాల్లో అయినా ఒక్కడే హీరో ఉంటాడా? ఉండగలుగుతాడా?
వాస్తవానికి ఉండకపోవచ్చు. ఒక దేశానికి హీరో అయితే.. ఆ దేశపు శత్రువుకు కూడా శత్రువే కదా.. కానీ రెండు శత్రు దేశాల మధ్య శాంతి కోసం 'డబుల్ ఏజెంట్'లా పని చేసిన ఒకరు ఏకంగా ఇరు దేశాల్లో హీరోగా పరిగణించబడ్డాడు.
అలాంటి అరుదైన ఘనత ఈజిప్ట్‌కు చెందిన అష్రఫ్ మర్వాన్‌కు దక్కింది.
Ads
ఆయనపై అనేక ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి. కానీ అంతిమంగా ఈజిప్ట్, ఇజ్రాయేల్ దేశాల్లో అతనొక హీరోగా ఇప్పటికీ చెప్పుకుంటారు.
మహ్మద్ అష్రఫ్ అబు వఫా మర్వాన్.. సింపుల్‌గా అష్రఫ్ మర్వాన్ 1944లో ఈజిప్ట్‌లోని కైరోలో పుట్టాడు. ఇతని కుటుంబం ఈజిప్ట్ న్యాయ, మిలటరీ వ్యవస్థలో కీలకమైనది. వీళ్ల నాన్న ఈజిప్ట్ మిలటరీలో మేజర్ జనరల్ ర్యాంకులో ఉండేవాడు. ఈజిప్టులోని అల్ ఫయాద్ కుటుంబం అంటే ఒక ఉన్నతమైన కుటుంబంగా ఉండేది. మర్వాన్ వాళ్ల అమ్మ అదే కుటుంబానికి చెందింది. ఇంత హై ప్రొఫైల్ కుటుంబంలో పుట్టిన వాడే అష్రఫ్ మర్వాన్.
70వ దశకంలో ఈజిప్ట, ఇజ్రయేల్ మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉండేది. ఈజిప్ట్‌కు చెందిన పలు ప్రాంతాలను ఇజ్రాయేల్ ఆక్రమించుకోవడం… పాలస్తీనాలోని ముస్లింలపై ఇజ్రాయేల్ దాడులకు పాల్పడటంపై ఈజిప్ట్ చాలా కోపంగా ఉండేది. అయితే ఇజ్రాయేల్‌కు అమెరికా, యూకే అండదండలు ఉండటంతో ఈజిప్ట్ నేరుగా ఎటాక్ చేయడానికి చాలా ఆలోచించేది.
ఈజిప్ట్‌కు రెండవ అధ్యక్ఝుడిగా గమాల్ అబ్దుల్ నాసెర్ ఉన్నప్పుడు.. ఇదే మర్వాన్ ప్రెసిడెన్షియల్ కార్యాలయంలో కీలక పదవిలో ఉండేవాడు. పైగా మర్వాన్.. ప్రెసిడెంట్ గమాల్ అబ్గుల్ కూతురు మోనాను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ప్రెసిండెట్ గమాల్.. తన అల్లుడు మర్వాన్, కూతురు మోనాను యూకేకి పంపించాడు.
అయితే.. మర్వాన్ మాత్రం లండన్‌లో ఈజిప్ట్ దేశానికి ప్రతినిధిగా ఉంటూనే… ఇజ్రాయేల్‌కు చెందిన మొసాద్ ఏజెంట్లతో టచ్‌లో ఉండేవాడు. అష్రఫ్ మర్వాన్ రెండు శత్రు దేశాల ఏజెంట్లు, రాజకీయ ప్రతినిధులతో రహస్యంగా సంబంధాలు నెరుపుతూ ఉంటూనే… ఎవరికీ అన్యాయం జరిగేలా మాత్రం వ్యవహరించేవాడు కాదు.
ఇంతలో మర్వాన్ మామ.. ఈజిప్ట్ ప్రెసిడెంట్ గమాల్ అబ్దుల్ చనిపోతాడు. ఆ తర్వాత అన్వర్ సదత్ ప్రెసిడెంట్ అవుతాడు. గమాల్ అంటే సదత్‌కు కోపం. పెద్దగా పడదు. అయినా సరే తన టాక్టీస్ ఉపయోగించి మర్వాన్ కొత్త ప్రెసిడెంట్ మనసు దోచుకుంటాడు. అతడి కొటరీలో కీలకంగా మారతాడు.
ఒకానొక దశలో మర్వాన్ మాటే సదత్‌కు ఫైనల్ అనే లెవెల్‌కు వెళ్తాడు. దీంతో సదత్.. మర్వాన్‌ను తిరగి లండన్ పంపుతాడు. ఇజ్రాయేల్, అమెరికాకు వ్యతిరేకంగా ఆఫ్రికాలో కూటమి కోసం మర్వాన్‌ను రాయబారిగా పంపుతాడు. అప్పటి లిబియా సుప్రీం గడాఫీని ఈజిప్ట్‌కు అనుకూలంగా ఒప్పించడంలో మర్వాన్‌దే కీలక పాత్ర.
నాన్నా.. పులి..
అరబ్ (ఈజిప్ట్), ఇజ్రాయేల్ వార్ నుంచి ఇరు దేశాలను రక్షించడానికి మర్వాన్ చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఇరు దేశాల్లో ఏం జరుగుతుందో మర్వాన్‌కు తెలుస్తుంది. ఈజిప్టులో హై పొజిషన్‌లో ఉన్న మర్వాన్.. తమ దేశం ఎప్పుడు ఇజ్రాయేల్ మీద దాడి చేస్తుందో తెలుసు. ఇదే సమాచారాన్ని మొసాద్‌కు చేరవేస్తాడు.
అయితే మర్వాన్ ఇక్కడే ఇరు దేశాలకు నష్టం కాకూడదని ఆలోచిస్తాడు. ఈజిస్ట్ ఫేక్ దాడులను ఇజ్రాయేల్‌కు చెప్తాడు. ఇజ్రాయేల్ రెడీగా ఉంటే అసలు ఈజిస్టు దాడి చేయదు. ఇలా రెండు మూడు సార్లు జరుగుతుంది. చివరకు మార్వాన్ చెప్పినా.. ఇజ్రాయేల్ నమ్మదు..
కానీ చివరకు సీనాయ్ కొండ దగ్గర ఈజిప్ట్ దాడి చేస్తది.. కానీ అప్పుడు ఇజ్రాయేల్ రెడీగా ఉండదు.. ఆ సమయంలో ఇరు దేశాలు యుద్దం కారణంగా నష్టంపోతాయి. చివరకు మార్వాన్.. ఇరు దేశాలతో మాట్లాడి శాంతి ఒప్పందం కుదురుస్తాడు.
ఒక వేళ ఆనాడు మార్వాన్.. నాన్న పులి ఆట ఆడకపోతే ఈజిప్టు, ఇజ్రాయేల్ తీవ్రంగా నష్టపోయి ఉండేవి. ఇవ్వాళ ఈజిస్ట్ ఇంత కూల్‌గా ఉండటానికి కారణం ఆనాడు జరిగిన శాంతి ఒప్పందమే. అందుకే రెండు దేశాల్లో మర్వాన్‌ను ఒక హీరోలా చూస్తారు. అదే సమయంలో మర్వాన్ మామ గమాల్ అంటే కూడా ఈజిప్ట్‌లో చాలా గౌరవం. సూయజ్ కెనాల్‌ను జాతీయం చేసి.. ఆ దేశానికి అమితమైన సంపదను సమకూర్చింది అతనే.
అయితే… ఈ మర్వాన్ ఇలా డబుల్ ఏజెంట్‌గా పని చేయడానికి ఒకరే స్పూర్తి. ఆయన ఎవరో.. ప్రపంచం చరిత్రలోనే గ్రేటెస్ట్ గూఢచారుల్లో ఒకడిగా అతను ఎందుకున్నాడో.. మళ్లీ ఎప్పుడైనా చెప్పుకుందాం ..
PS: మర్వాన్ ఆ యద్దం తర్వాత ఆయుధాల వ్యాపారిగా స్థిరపడ్డాడు. లండన్‌లోని తన పోష్ ఇంటిపై నుంచి పడి.. అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు….. #భాయ్‌జాన్
Share this Article