Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…

June 7, 2025 by M S R

.

Subramanyam Dogiparthi….. కృష్ణ- KSR దాస్- మహారధి కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమా ఈ నాయకులకు సవాల్… అవినీతి , అరాచక రాజకీయ నాయకులను ఉతికి ఆరేసిన సినిమా . రాజకీయ నాయకులను ఉతికి ఆరేయటంలో యన్టీఆర్ తర్వాత కృష్ణే (సినిమాల్లో)… బహుశా కృష్ణే నాలుగడుగులు ముందు ఉన్నారేమో !

1983 ప్రారంభంలో యన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణ మొదట్లో పరోక్షంగా యన్టీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు . 1984 లో రాజీవ్ గాంధీ ప్రధాని , 1985 లో వైయస్సార్ పిసిసి అధ్యక్షుడు అయ్యాక డైరెక్టుగానే టార్గెట్ చేసారు . నా పిలుపే ప్రభంజనం (1986) , మండలాధీశుడు (1987) , సాహసమే నా ఊపిరి (1989) ఆ క్రమంలో వచ్చినవే .

Ads

1989 ఎన్నికల్లో MP కూడా అయ్యారు . Of course , 1991 లో ఓడిపోయాక ప్రత్యక్ష రాజకీయాల నుండి నిష్క్రమించారు . తర్వాత రాజకీయ వ్యంగ్య చిత్రాలలో కూడా నటించినట్లు లేదు .

1984 జూన్లో వచ్చిన ఈ సినిమాలో మహారధి డైలాగ్స్ రాజకీయ నాయకులను డైరెక్టుగా ఉతికి ఆరేసినవే . జనం నాకేమయినా ఊరక ఓట్లు వేసారా ? డబ్బులు తీసుకునే కదా ! కాబట్టి జనం నుండి మళ్ళా రాబట్టుకుంటున్నాను అంటాడు MLA అల్లు రామలింగయ్య .

ఏరా సస్పెండ్ అయ్యావు కదా అని కానిస్టేబుల్ని అడిగితే మళ్ళా లంచం ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నానని అంటుంది ఒక పోలీసు పాత్ర .

ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టుకోండి . మేము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ రద్దు చేస్తాం అనే డైలాగ్ ఇప్పుడు మన ప్రభుత్వాలు ఉపసంహరించుకుంటున్న కేసుల స్టోరీ గుర్తుకు తెస్తుంది . సంతోషం ఏమిటంటే నలభై ఏళ్ళ కింద దేశం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది . కాకపోతే ఇప్పుడు కొంగ్రొత్త మాటలు వచ్చాయి . మనోభావాలు , భావోద్వేగాలు వగైరా వగైరా …

చాలా సినిమాలలో లాగానే నాయకుల ముఠా . నిర్భయంగా హత్యలు , మానభంగాలు , పోస్టుమార్టం రిపోర్టులను మార్పించటాలు , వగైరా ఉంటాయి . అచ్చం ఇప్పటిలాగానే . వాటిని ఎదుర్కొంటానికి హీరో కృష్ణ , జర్నలిస్టుగా జయప్రద ఉంటారు . ఓ ముఖ్యమంత్రి , మంత్రులు , వాళ్ళల్లో కాస్త మంచోళ్ళు , నిస్సహాయ ప్రజలు , రాజకీయ బాసులకు జీహుజూర్ అనే ఖాకీలు , వగైరా . అచ్చం ఇప్పటిలాగానే .

ప్రధాన విలన్లుగా నాగభూషణం , సత్యనారాయణ , గిరిబాబు , అల్లు రామలింగయ్యలు నటించారు . వాళ్ళకు ఈ పాత్రలు కొట్టిన పిండేగా ! కృష్ణను మనసులోనే ప్రేమించే , స్నేహితురాలు జయప్రద కోసం తన మానం , ప్రాణం పోగొట్టుకునే పాత్రలో సుమలత బాగా నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ , ప్రభాకరరెడ్డి , పుష్పకుమారి , రాధాకుమారి , రావు గోపాలరావు , పి యల్ నారాయణ , హేమసుందర్ , ప్రభృతులు నటించారు .

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగానే ఉంటాయి . బయట గొప్పగా హిట్ కాలేదనుకుంటాను . నువ్వుంటే ఓ జంట , కన్ను కొట్టు , చినుకుల దరువు చీరెకు బరువు డ్యూయెట్లు హుషారుగా ఉంటాయి .

నాగభూషణం కునుకులోకి జారి అనూరాధతో డాన్స్ వేస్తాడు . సరదాగా ఉంటుంది . మరో డాన్స్ అల్లు రామలింగయ్య , జయమాలినిలకు కూడా ఉంటుంది . ఇది పాట లేకుండా ఉత్త డాన్సే . సరికొత్త ప్రయోగం . సాధారణంగా అలా శాస్త్రీయ నృత్యాలు ఉంటాయి . ఉదాహరణకు గుండమ్మ కధలో యల్ విజయలక్ష్మి నృత్యాల్లాగా .

కృష్ణ అభిమానులకు నచ్చుతుంది . యూట్యూబులో ఉంది . సినిమా చూస్తుంటే ఈనాడు , ప్రజారాజ్యం , కంచుకాగడా సినిమాలు గుర్తుకొస్తాయి . అయినా చూడబులే . డ్యూయెట్లు , జయమాలిని , అనూరాధల డాన్సులు బాగానే ఉంటాయి . చూడనివారు ట్రై చేయవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్‌లో రాముడి కొడుకు లవ కుమారుడి ఆలయ పునరుద్ధరణ..!!
  • సోషల్ మీడియా డర్టీ క్యాంపెయిన్‌లో రేవంత్ ఫెయిల్… కేసీయార్ డిస్టింక్షన్…
  • పక్కపక్కనే మూడు ప్రేమ కథలు… విషాద ముగింపులు వేర్వేరు…
  • ఎయిర్ బస్సా… ఎర్ర బస్సా…! ఓ ఇంట్రస్టింగ్ వార్త ఏదో తేడా కొడుతోంది..!!
  • ఒక పోలీసమ్మ… దాడులకు వెళ్లి… కాసేపు ఓ బిడ్డకు అమ్మయింది..!!
  • వెరీ మిస్టీరియస్ ప్రొఫైల్…! ఆమెకు తెలిసిన విద్యల పేర్లూ విచిత్రమే..!!
  • శృతి ద్వివేది..! లేడీ వేణుస్వామి..! అజిత్ మృతిని ముందే చెప్పింది..!!
  • ఎన్సీపీ, శరద్ పవార్ కుటుంబ తదుపరి రాజకీయ వారసుడు ఎవరు..?
  • గళ మాధుర్యం..! నడత, నడక అన్నీ విశేషమే… అరుదైన కేరక్టర్ అర్జీత్…
  • ‘ముసలి సమాజాలు’… రష్యా, చైనా, జపాన్ బాటలో తెలుగు రాష్ట్రాల అడుగులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions