Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా రాజ్యాధికారాన్ని శాసించదు… శాసించగలమనే భ్రమల్లో ఉంటుంది…

April 11, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. నాయకురాలు . మరో ఎర్ర సినిమా . ప్రజల సమస్యలను ఎత్తి చూపి , రాజకీయ నాయకుల సంఘ విద్రోహుల ఆగడాలను ఉతికి ఆరేయటమే పత్రికల పని అని నమ్మే వ్యక్తి బోస్ పాత్రలో రంగనాథ్ . పత్రిక పేరు జనశక్తి . ఆయన భార్య శారద సాదాసీదా గృహిణి , భయస్తురాలు . పత్రిక స్థాయి నుండి ఓ ప్రాంతీయ పార్టీ జనశక్తి పార్టీని ప్రారంభించే స్థాయికి ఎదుగుతాడు రంగనాథ్ .

(మీడియా రాజ్యాధికారాన్ని శాసించదు, కానీ శాసిస్తామనే భ్రమల్లో ఉంటుంది… సరే, అప్పట్లో ఇలాంటి కథలు చాలా వచ్చేవి సినిమాల్లో)… ఇదంతా గిట్టని స్థానిక మంత్రి గారు , అతని చెంచాలు రంగనాథుని నడిరోడ్డు మీదే మీటింగ్ వేదిక మీదే హత్య చేస్తారు . చనిపోయిన భర్త ఆశయాల కొరకు భార్య జనని పాత్రలో శారద రంగం లోకి వస్తుంది . ఆమె పత్రికను మార్కెట్ లోకి రాకుండా , ప్రజలు కొనకుండా రాజకీయులు రుబాబు చేస్తుంటారు .

Ads

ఆమె తన తెలివితేటలతో చేయని నేరాలకు జైలు శిక్ష అనుభవిస్తున్న నలుగురు యువకులను సద్ప్రవర్తన ఆధారంగా బయటకు తీసుకుని వస్తుంది . ఆ నలుగురు యువకులను కన్విన్స్ చేసి తన పత్రికకు రక్షకులుగా మారుస్తుంది . జనశక్తి పార్టీ పెద్దల అభ్యర్ధన మేరకు పార్టీకి నాయకురాలు అవుతుంది . క్లైమాక్సులో రాజకీయులతో ఘర్షణ , నలుగురు యువకులు చనిపోవటం , శారద ముఖ్యమంత్రి కావటంతో సినిమా ముగుస్తుంది .

సత్యారెడ్డి ఈ సినిమాకు కధను అందించటమే కాకుండా స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని దర్శకత్వం వహించారు . సామాజిక స్పృహ ఉన్న సినిమాలను దర్శకత్వం వహించిన ఈయన ప్రస్తుతం హాలీవుడ్లో కింగ్ బుధ్ధ అనే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారని ఎక్కడో చదివాను .

శారద ఎప్పటిలాగే బాగా నటించింది . నలుగురు యువకులుగా భానుచందర్ , ఆహుతి ప్రసాద్ , సాయికిరణ్ , నాగబాబు నటించారు . ఆ నలుగురితో పాటు కవిగా కాళిదాసు అనే నూతన నటుడిని పరిచయం చేసారు . ఈ సినిమాకు మాటల్ని వ్రాసిన గణేష్ పాత్రో దూరదర్శన్ అధికారిగా ఓ అతిధి పాత్రలో కూడా కనిపిస్తారు .

మంత్రిగా మరో నూతన నటుడు ఆదిత్య కుమార్ , చెంచాగా మా గుంటూరు వారయిన జయప్రకాష్ రెడ్డి , ఇతర పాత్రల్లో సీత , పి జె శర్మ , భీమేశ్వరరావు  తదితరులు నటించారు . రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో వందే మాతరం ఇది మా నవతరం పాట బాగా హిట్టయింది .

సీతను తమ ఊహల్లో ఊహించుకుంటూ నలుగురు యువకులు పాడుకునే పాటలో సీత డాన్స్ అందంగా ఉంటుంది . దర్శకుడు సత్యారెడ్డి కళాత్మకంగా తీసాడు ఈ పాటను . వెన్నెలకంటి పాటల్ని వ్రాయగా వాటిని మాధవపెధ్ది రమేష్ , జానకమ్మ , మనో , రాధిక పాడారు .

హింసా దౌర్జన్యాలతో కాకుండా అహింసాయుత మార్గంలో గాంధీగిరి ద్వారానే ఫలితం ఉంటుందనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినా సినిమాంతానికి అన్ని సినిమాలలాగానే హింసతో ముగుస్తుంది . మొత్తం మీద ఈ ఎర్ర సినిమా సినిమా ప్రియులకు చూడబులే . స్క్రీన్ ప్లేని బిర్రుగా చేసుకుని ఉంటే మంచి సినిమా అయి ఉండేదేమో ! సినిమా యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు ట్రై చేయవచ్చు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బీఆర్ఎస్‌లో హరీష్‌రావు ఒంటరి అయిపోతున్నాడా..? ఏమవుతోంది..?
  • మావిగన్ ప్రతిపాదన కాదు, సూచన కాదు, వెటకారం కాదు… అదొక హెచ్చరిక…
  • చర్చల దారి చర్చలదే… మరో అమెరికన్ నిఘా డ్రోన్ కూల్చివేత…
  • మీడియా రాజ్యాధికారాన్ని శాసించదు… శాసించగలమనే భ్రమల్లో ఉంటుంది…
  • ఆ క్షణం ఒక యుగం! 𝐓𝐡𝐞𝐒𝐩𝐥𝐚𝐬𝐡𝐃𝐨𝐰𝐧… భూమి ఎదురుచూస్తోంది..!
  • రొట్టె- చక్కెర … వైరల్ వీడియోపై బోలెడు పోస్టులు… కానీ..?
  • రాజీనామా చేశాడట… బారా ఖూన్ మాఫ్… వాటీజ్ దిస్ మోడీ…
  • పిల్లి కళ్ల పిల్ల మోనాలిసా ప్రేమపెళ్లి కథలో ట్విస్ట్… మొగుడిపై పోక్సో…
  • రేపు పోలింగ్ అనగా… ఓ ఉపఎన్నిక రద్దు… ఓ చిత్రమైన కేసు…
  • కొత్త కొత్త నాయికలతో రాజేంద్ర ప్రసాద్ రొమాన్స్… ఈమె ఎవరో తెలుసా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions