.
ఈమధ్య చిత్రవిచిత్ర, అనగా తిక్క వ్యాఖ్యలతో వార్తల్లోకి వస్తున్న నిర్మాత నాగవంశీకి జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ సెగ తగులుతూ, ఆ పొగలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు… డిఫెన్స్‌లో పడిపోయి, ఇంకా అయోమయం వ్యాఖ్యలకు దిగాడు…
అసలే డాకూమహారాజ్ సినిమాలో దబిడిదిబిడి పాట చిత్రీకరణ తీరు మీద, ఊర్వశి రౌటేలాతో బాలయ్య వేసిన వెగటు స్టెప్పుల మీద బాగా నెగెటివిటీ మొదలైంది కదా… దీనికితోడు బాలయ్య అన్‌స్టాపబుల్ షో మరింత నెగెటివిటీని పెంచింది… కారణం, ఆ షోలో ఎవరూ, ఏ సందర్భంలోనూ జూనియర్ ఎన్టీయార్ పేరు కూడా ప్రస్తావించవద్దని బాలయ్య పెట్టిన ఆంక్షలు…
Ads
డాకూ మహారాజ్ సినిమా ప్రమోషన్ కోసం ఉద్దేశించిన అన్‌స్టాపబుల్ షోలో ఎక్కడా, ఏ సందర్భంలోనూ జూనియర్ ఎన్టీయార్ పేరు గానీ, సినిమాల పేర్లు గానీ రాకుండా ‘సెన్సారింగ్’ అమలైంది… సహజంగానే జూనియర్ అభిమానుల్లో కోపం పెరిగింది… డాకూ మహారాజ్ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు…
ఈ సెగతో ఉక్కిరిబిక్కిరైన నాగవంశీ ఓ పిచ్చి సమర్థనతో జూనియర్ ఫ్యాన్స్‌ను చల్లబరిచే పిచ్చి ప్రయత్నం చేశాడు… ‘‘ఆ షోలో జూనియర్ పేరు ప్రస్తావనకు రాకపోయినా… దర్శకుడు బాబీతో, నాతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడినప్పుడు బాలయ్య ఫలానా పాత్ర జూనియర్ చేస్తే బాగుంటుందని అన్నాడు, జై లవకుశ సినిమా కూడా నాకు నచ్చిందని చెప్పాడు’’ అంటూ ఏదో కవరప్ చేయడానికి ప్రయత్నించాడు…
డాకూ మహారాజ్ ప్రెస్‌మీట్‌లో కూడా దర్శకుడు బాబీ ఇలాంటివే ఏవో చెబుతూ అబ్బే, అసలు ఇదొక ఇష్యూయే కాదు అన్నట్టు మాట్లాడాడు… రాంచరణ్ పాల్గొన్న అన్‌స్టాపబుల్ షోలో కూడా ఆర్ఆర్ఆర్ ప్రస్తావన రాకుండా చూశారనీ, దానికీ జూనియర్ ప్రస్తావన రావద్దనే బాలయ్య ఆంక్షలే కారణమనే వార్తలు మొదలయ్యాయి… సో, జూనియర్ మీద బాలయ్య మార్క్ సెన్సారింగ్ డాకూ మహారాజ్ సినిమాకు నెగెటివిటీ పెంచాయి…
ఇదంతా జూనియర్ కోణం… సింపుల్‌గా బాలయ్య ఆంక్షలు అబద్ధం, అలాంటిదేమీ లేదు అని చెప్పేస్తే సరిపోయేది… ఆఫ్ ది రికార్డుగా బాలయ్య మెచ్చుకున్నాడు అంటూ ఇష్యూను వాళ్లే ఇంకాస్త పీకి పొడిగించినట్టయింది… మరో కోణం, తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు… సంక్రాంతికి వస్తున్న మూడు పెద్ద సినిమాలకూ తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు నో అనేసింది…
దానికి పుష్పరాజ్ బాపతు కేసు, వివాదం, ప్రభుత్వ నిర్ణయం… సీఎం మనిషిగా చెప్పబడే దిల్ రాజు సినిమాకు సైతం టికెట్ రేట్లను పెంచలేదు… (ఇప్పటివరకూ…) ఏపీలో మాత్రం మూడు సినిమాలకూ రేట్లు పెంచారు… సరే, అక్కడ సినిమా ప్రభుత్వం కదా… తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మా సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు అని చెప్పేస్తే ఫెయిర్‌గా, స్ట్రెయిట్‌గా ఉండేది కదా…
మాకు తెలంగాణలో మా సినిమాకు టికెట్ రేట్ల పెంపు అక్కర్లేదు అని సమాధానం ఇచ్చాడు నాగవంశీ… అక్కడికి తను అడిగితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా..? సింపుల్‌గా అది ప్రభుత్వ విధాన నిర్ణయం అని చెప్పేస్తే సరిపోయేది కదా… అవసరం లేదు అనే జవాబు ఏమిటి..? ఏపీకి, తెలంగాణకు వేర్వేరు అవసరాలు ఉంటాయా..? హేమిటో ఈ సినిమా వాళ్లు, అందులోనూ నాగవంశీ..!!
Share this Article