ఇదే ఈనాడు ఓ దశలో మోడీకి విపరీతంగా డప్పుకొట్టింది… చంద్రబాబుతోపాటు తనూ దూరమైంది… అంతే… తన రాగద్వేషాలే తన పాలసీలు… అంతకుమించి తేడా ఏమీ ఉండదు… లోతైన ఆలోచన, జాతికోణంలో సంయమనం వంటివి దానికి పట్టవు… పడితే అది ఈనాడే అనిపించుకోబడదు…
మోడీని అనేక అంశాల్లో ఆక్షేపించవచ్చు… తప్పేమీ లేదు… మోడీ విమర్శలకు అతీతుడేమీ కాదు, ఉపేక్షించాల్సిన పనీ లేదు… నోట్ల రద్దు దగ్గర్నుంచి ఆత్మనిర్భర్ దాకా అనేకానేక వైఫల్యాలున్నయ్… అయితే ఒక విమర్శ చేసేముందు ప్రతిపక్షం గానీ, మీడియా గానీ… మోడీ కోణంలో చూస్తున్నాయి తప్ప, యాంటీ మోడీ అనే ధోరణి తీసుకుంటున్నాయి తప్ప… జాతి, ప్రతిష్ట అనే కోణాలే పట్టవు…
విచిత్రంగా కేసీయార్, మమత వంటి నేతలు సైతం రాహుల్‌గాంధీ నకళ్లులా మారిపోవడం… చైనావాళ్లు దంచికొడుతున్నారు, సర్జికల్ స్ట్రయిక్స్‌కు ప్రూఫ్స్ ఉన్నాయా..? వంటి వ్యాఖ్యలు చేసేముందు కాస్త రాజకీయ సంయమనం అవసరమనే సోయి వీళ్లకు ఉండదు… ప్రతి విషయాన్నీ యాంటీ మోడీ స్టాండ్‌తో మాత్రమే విమర్శించడం అనే దరిద్రం బాగా పెరిగిపోయింది… మోడీ ఎడ్డెం అంటే తెడ్డెం అనాల్సిందే, అంతే…
Ads
ఇదీ అలాంటి కార్టూనే… అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు చెండాడుతున్నారు… వేరే పత్రికల్లో కార్టూన్ల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు… కానీ ఈనాడులో వస్తే దాని రీచ్ వేరు… పైగా ఇది ‘‘ఆలోచన కనిపించని నాసిరకం కార్టూన్’’లా కనిపిస్తున్నది…
వాస్తవానికి కార్టూనిస్టు తప్పేమీ లేదు… ఎవరో కొత్త కార్టూనిస్టు… ఇప్పుడిప్పుడే ప్రమోట్ చేస్తున్నారు… కానీ కార్టూన్ కంటెంటును బట్టి పబ్లిష్ చేయాలో వద్దో సంపాదక సిబ్బంది నిర్ణయం తీసుకోవాలి, ఆలోచించాలి… అవసరమైతే గైడ్ చేయాలి… ఈనాడులో అవన్నీ శూన్యం ప్రస్తుతం… ఈ కంటెంటు విషయానికి వస్తే…
మోడీ ఏమన్నాడు..? ప్రపంచానికి ఆహారం అందించేందుకు భారత్ సిద్దం అని ఎక్కడో మాట్లాడాడు… దాన్ని వెకిలి చేస్తూ ఈ కార్టూన్… ఇండియన్లే విదేశీయుల పేర్లు చెప్పుకుని మోడీని ఆహారం అడుక్కోవాలి అన్నట్టుగా ఉంది… విదేశీయులకు ఇస్తాడట కానీ ఇండియన్లకు ఇవ్వడం చేతకాదు అనే సెటైర్… స్థూలంగా చూస్తే వోకే… కానీ..?
సాధ్యమా..? అసాధ్యమా..? డబ్ల్యూటీవో అంగీకరించేనా..? మోడీ నిజంగా ఇచ్చేనా..? ఇక్కడా ఏతుల మాటలేనా..? అనే సందేహాలు, ప్రాబబులిటీస్ వదిలేస్తే… ‘‘మేం ఈ సంక్షోభ వేళలో ప్రపంచానికి తిండి పెట్టగలం, పెడతాం’’ అని ఇండియా చేసిన ప్రకటన నిజంగా గొప్పది… మోడీ అనే లీడర్ ప్రకటన కాదు అది, ఇండియా ప్రధాని చేసిన ప్రకటన… నిజంగా ఈరోజు ఇండియా తలెత్తి, సగర్వంగా మేం ప్రపంచానికి తిండిపెట్టగలం అని చెబుతున్నదంటే మాటలు కాదు…
ఒకప్పుడు పామాయిల్, గోధుమల్ని కూడా తెచ్చుకున్నాం… స్వయంసమృద్ధి సాధించడానికి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు… కానీ ఈరోజు…? మన ఆహారభద్రతకు అవసరమైన నిల్వలకన్నా మూడురెట్లు అధికంగా గోదాముల్లో ఉన్నాయి… రష్యా, ఉక్రెయిన్, శ్రీలంకలకు కూడా ఆహారధాన్యాలు పంపించాం… పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, అఫ్ఘనిస్థాన్, చైనా… ఇలా చాలా దేశాలకు అవసరమైన సందర్భాల్లో తిండిగింజలు ఇచ్చాం… ఇంకొన్ని దేశాలు అడిగితే కూడా మానవతాకోణంలో అందించడానికి సిద్ధంగా ఉన్నాం… ఇది మన గర్వస్థితి…
ఇక స్వదేశీయులకు ఆహారం పంపిణీ గురించి…! కరోనా సంక్షోభవేళ మోడీ చేసిన ఏకైక మంచి కార్యం ఉచిత ఆహారధాన్యాల పంపిణీయే… ఈరోజు ఇండియా ఇలా ప్రపంచానికి తిండి పెట్టగలను అని చెబుతున్నదంటే… అది మోడీ విజయం కాదు, తను చేసిందేమీ లేదు… కానీ స్వతంత్రం తరువాత మన రైతు సాధించిన విజయం ఇది… తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యవసాయాన్ని వదలని మన జీవనవిధానం… ఒక కార్టూన్ గీసేముందు ఈ కోణాల్లో కూడా ఆలోచించాలి… వెకిలి చేయడం ఈజీయే… కానీ సమర్థించుకోవడం చాలా చాలా కష్టం… ఇప్పటి ఈనాడుకు అంత సీన్ లేదు… ఇకపై రాదు కూడా…!!
కామ్రేడ్ రామోజీరావూ, మోడీ మీద ద్వేషాన్ని ఇండియా మీద ద్వేషంగా పరిణమించొద్దు, అలా ఆవిష్కరించొద్దు… నిజానికి మోడీ తన మొత్తం రాజకీయ జీవితంలో అత్యంత మర్యాద ఇచ్చిన ఏకైక పత్రికాధిపతి నువ్వే… కానీ చివరకు నువ్వే… ఇలా…!!
Share this Article