Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సొంత సినిమా పోస్టర్‌కేమో నకల్ కొడతడు… అవతార్‌పై ఏదేదో కూస్తడు…

December 18, 2022 by M S R

జేమ్స్ కామెరూన్ ఓ విషయం సీరియస్‌గా ఆలోచించాలి… అవసరమైతే అవతార్-3 సీక్వెల్ కొన్నాళ్లు వాయిదా వేసి, కోడి మెదళ్ల మీద ఓ సినిమా తీయాలి… ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ గ్యారంటీ… కావాలంటే హైదరాబాద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగురోజులు, బాలీవుడ్ ముంబైలో నాలుగు రోజులు, చెన్నై-బెంగుళూరుల్లో రెండేసి రోజులు క్యాంప్ వేస్తే సరి… మొత్తం స్క్రిప్టు తయారవుతుంది… అంతెందుకు..? టాలీవుడ్‌లో నాగవంశీ అనే కేరక్టర్ ఉంది… తనతో ఒకరోజు ఉండండి…

టాలీవుడ్‌లో నిజంగానే విష్వక్సేనులు పెరిగిపోతున్నారు… ఈ నాగవంశీ ఒకవైపు తన కొత్త సినిమా, వచ్చే 26న విడుదల కాబోయే బుట్టబొమ్మ సినిమాకు పోస్టర్ కూడా క్రియేటివ్‌గా, ఇండిపెండెంటుగా రూపొందించలేకపోయాడు… అదీ కాపీయే… గతంలో ది ప్రిస్టేజీ అనే సినిమా పోస్టర్‌కు కాపీ… ఇక సినిమాలో ఏయే సీన్లు దేనికి కాపీయో తేలాలంటే పీహెచ్డీ రీసెర్చ్ జరగాలి… తన సినిమాలేమో పక్కా కాపీ వర్క్… తను అవతార్‌ మీద సెటైర్లు వేస్తున్నాడు…

నిజానికి అవతార్-2 విమర్శలకు, సెటైర్లకు అతీతం ఏమీ కాదు… కానీ తెల్లారిలేస్తే వీసమెత్తు క్రియేటివిటీ లేని కాపీ బతుకులు కూడా తమ డ్యాష్ కింద నలుపును మరిచిపోయి జేమ్స్ కామెరూన్‌ను వ్యంగ్యంగా ఆడిపోసుకోవడమే కరెక్టు కాదు… ఆ నైతికార్హత అలాంటోళ్లకు లేదు… అలాంటివాళ్లే ఎక్కువగా మాట్లాడతారు అంటారా..? అయితే వాకే…

Ads

buta bomma

చూశారు కదా బుట్టబొమ్మ పోస్టర్… అప్పుడెప్పుడో 2006లో రిలీజైన ది ప్రిస్టేజీ సినిమా పోస్టర్… తను చేసిన ట్వీట్‌కు తెలుగు అర్థమేమిటంటే..?

‘‘మెరైన్ బయోలజీ డాక్యుమెంటరీ చూడాలనుకునే జేమ్స్ కామెరూన్ ఆదేశించారు. త్రీడీలో చిత్రీకరించారు కాబట్టి అవతార్ 2ను విజువల్ వండర్ అనాలి. మాస్టర్ క్రాఫ్ట్, బ్లాక్ బస్టర్ అని మెచ్చుకోవాలి. లేకపోతే నావీ అంగీకరించదు…’’

ఇంతకీ ఎవరీ సూర్యదేవర నాగవంశీ… ఎక్కడి నుంచి వచ్చాడు..? ఎప్పుడూ వినలేదు అని జుత్తు పీక్కోనక్కర్లేదు… జెర్సీ, డీజే టిల్లు, బీమ్లా నాయక్ తదితర సినిమాలు తనవే… కాస్త డబ్బు బుర్రకెక్కినట్టుంది… అసలే టాలీవుడ్ కదా, భజన టీం భారీగా చేరినట్టుంది చుట్టూ… ఒక మంచి టేస్ట్, ఒక మంచి ప్రయోగం, మెచ్చే క్రియేటివిటీ గట్రా ఉన్న నిర్మాతలైతే, అరె ఏం చెబుతున్నాడు అని వినొచ్చు… ఇలాంటి కేరక్టర్లు ట్విట్టర్‌లో ఏం కూసినా దానికి విలువ ఏముంటుంది..?

ఇంతకీ బుట్టబొమ్మలో స్టార్స్ ఎవరు అంటారా..? అనిఖ సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్… పేర్లు ఎప్పుడూ వినలేదా..? పర్లేదు, నాగవంశీ ఇలాంటి అనామక తారల్ని కూడా అకస్మాత్తుగా స్టార్స్‌ను చేసేస్తాడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions