బ్రహ్మాండమైన ధమ్‌కా బిర్యానీ వండారు… తీరా శాంపిల్‌గా ఓ స్పూన్ తిని చూస్తే యాఖ్… అది ఏ రీతిలోనూ లేదు… దాన్ని హోటల్ కస్టమర్లకు గనుక వడ్డిస్తే మళ్లీ హోటల్‌కు ఎవడూ రాడు… తిట్టిపోస్తారు… ఒకరిద్దరు తన్నినా దిక్కులేదు… దాంతో మళ్లీ పొయ్యి మీదకు ఎక్కించాడు చెఫ్… కాస్త ఉప్పు నీళ్లు జల్లి మంట పెట్టాడు… మసాలా యాడ్ చేశాడు… ప్చ్, బేసిక్‌గా వంటకం మొదట్లోనే తన్నేసింది…
రంగు, వాసన ఏదీ కుదరలేదు… పైగా ఘోరమైన రుచి… ఇంకా ఏవేవో రిపేర్లు చేసుకొద్దీ పెంట పెంట అయిపోయింది… ఆ మొత్తం వంటను పారేయలేడు… కస్టమర్లకు వడ్డించలేడు… వెయిట్ చేస్తున్నవారికి ఇంకాస్త వెయిట్ చేయండి, ప్లీజ్ అంటున్నాడు హోటల్ ఓనర్… ఆదిపురుష్ సినిమా కథ అదే… ఆ సినిమా ఫీడ్ ఏం చేయాలో నిర్మాతలకు, హీరో ప్రభాస్‌కు అర్థం కావడం లేదు… దర్శకుడు కమ్ చెఫ్ ఓం రౌత్ మాత్రమే నిమ్మలంగా ఉన్నాడు…
బహుశా ఇండియన్ సినిమా చరిత్రలోనే టీజర్ స్థాయిలో ఇంత ట్రోలింగుకు గురైన సినిమా మరొకటి ఉండకపోవచ్చు… అంత దారుణంగా విమర్శలు… ప్రత్యేకించి బిన్ లాడెన్ లుక్కులో రావణుడు, ఏవో ఇంగ్లిషు యానిమేషన్, కార్టూన్ సినిమాల నుంచి ఎత్తుకొచ్చిన సీన్లు, రావణుడి వాహనం గట్రా విమర్శలే కాదు నవ్వులాట అయిపోయింది ప్రేక్షకులకు… నెట్‌లో బోలెడు మీమ్స్ పడ్డయ్ దాని మీద… టీజర్‌లో కనిపించే ప్రతి సీన్ గతంలో ఏయే సినిమాల్లో వచ్చిందో వీడియో బిట్లతో సహా పెట్టేసి, నెటిజన్లు కడిగి పారేశారు… సినిమా అంత దారుణంగా రూపొందుతున్నా సరే, నిర్మాతలకు సోయి లేదు, హీరో ప్రభాస్‌కు అంతకన్నా లేదు…
Ads
కనీసం ఒక టీజర్ రిలీజ్ చేస్తుంటే దాన్ని కూడా ముందుగా ఓసారి చూసుకునే తెలివి లేదా వీళ్లకు..? జనం బూతులు అందుకునేసరికి, అబ్బే, త్రీడీలో సూపర్ ఉంటుంది అని ఏదో కవరింగు స్టార్ట్ చేశారు… అదీ ఎదురుతన్నింది… 500 కోట్లు ఖర్చు పెట్టినట్టు దొంగ లెక్కలు ఏవో చెప్పారు… సంక్రాంతికి విడుదల అన్నవారు కాస్తా జూన్‌లో రిలీజ్ చేస్తాం అన్నారు… ఇప్పుడు ఆగస్టు అంటున్నారు… గ్రాఫిక్స్ కాస్త మార్చుతాం అన్నారు… దానికి మరో 200 కోట్లు బొక్క… తీరా చూస్తే అదేమీ చక్కబడదు…
బేసిక్‌గానే బోలెడు తప్పులు… ఇంకా ఏ రిపేర్లు చేసినా కుదిరే స్థితి కనిపించడం లేదు… ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌లో చర్చ ఏమిటంటే… ఆగస్టు కాదు కదా, ఇంకా ఆలస్యం తప్పదు అని..! ఐనా డౌటే… అసలే రాధేశ్యామ్ చీదేసరికి ప్రభాస్‌కు దిక్కుతోచడం లేదు… ఆదిపురుష్ కథ ఇది… అసలు ఇవే కాదు, సీతమ్మ కిడ్నాప్‌ను సమర్థించేలా సీన్లు ఉన్నాయనే వివాదం ఉండనే ఉంది… అదేగనుక నిజమైతే ఈ కథ మరింత పెంట కావడం ఖాయం… మరి ఇప్పుడు ప్రభాస్ చేతులు కాలినయ్… ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు… ముందే చెప్పుకున్నాం కదా… ఆ బిర్యానీ పారేయలేరు, కస్టమర్లకు వడ్డించలేరు… ఏం చేయాలి..?!
Share this Article