సినిమా, టీవీ, గ్లామర్ ఇండస్ట్రీలో కొన్ని పంచాయితీలు తలెత్తుతుంటయ్… ఎవరి పక్షం వహించాలో అర్థం కాదు… ఏం కామెంట్ చేయాలో కూడా తెలియదు… కేరళ ఇలాంటి పంచాయితీలకు కాస్త ఫేమస్… నటి భావన తెలుసు కదా… మన తెలుగులోనూ ఒంటరి, హీరో, మహాత్మ వంటి కొన్ని సినిమాల్లో నటించింది అప్పట్లో… ఎక్కువగా మలయాళమే… అయిదారేళ్ల క్రితం వరకూ పాపులర్ హీరోయిన్… అందం, ప్రతిభ కలబోసిన కేరక్టర్…
హఠాత్తుగా ఓ వివాదం… నటుడు దిలీప్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడని కేసు… పోలీసులు కూడా సీరియస్ సెక్షన్లు పెట్టి బుక్ చేశారు… చాన్నాళ్లు బెయిల్ కూడా రాలేదు… ఇష్యూ కోర్టులో ఉంది… ఆరోజు నుంచీ ఆమె మళ్లీ మలయాళంలో నటించలేదు… కన్నడంలో సెటిలైపోయింది… దిలీప్ అభిమానులు ఆమెపై నీచమైన సోషల్ ట్రోలింగ్‌కు పాల్పడ్డారు… మీడియా, సోషల్ మీడియా ప్రచారంతో ఆమె ఆ లైంగికదాడిని మించిన బాధనే అనుభవించింది…
ఇప్పుడు మళ్లీ ఆమె మలయాళ తగాదాల తెరమీదకు వచ్చింది… ఇన్నేళ్లు కన్నడమే తప్ప మళ్లీ మలయాళం మొహం చూడని ఆమె ఇటీవల Ntikkakkakkoru Premandaarnnu సినిమాలో నటిస్తోంది… ఇప్పుడు వివాదం ఏమిటీ అంటే… ఈమధ్య గోల్డెన్ వీసా తీసుకోవడానికి దుబయ్ వెళ్లింది… అక్కడ ఫ్యాన్స్‌తో కలిసి సరదాగా రెండుమూడు డాన్స్ స్టెప్పులు వేసింది… ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ సందర్భంగా ఆమె వేసుకున్న డ్రెస్ వివాదానికి కారణమైంది…
Ads
ఆమె లూజ్ వైట్ టాప్ ధరించింది… నిజానికి దాన్ని టాప్ అనాలో లేదో తెలియదు… (పోంచో)… ఆమె చేతులు ఎత్తినప్పుడల్లా పొట్ట, ఛాతీ భాగం కొంత బరిబాతల కనిపిస్తున్నయ్… నిజానికి ఏ సెలబ్రిటీ అయినా సరే, తాము ధరించే డ్రెస్సుల పట్ల, అవి ధరించడం వల్ల తమ అప్పియరెన్స్ పట్ల కాస్త సోయి ఉండాలి… నిజంగానే ఆమె డ్రెస్సింగ్ బాగాలేదు… ఈ మాట ఎవరైనా అంటే చాలు, మా దుస్తుల మీద కూడా మీ ఆంక్షలా..? ఇదేం వివక్ష..? మా బతుకు మమ్మల్ని బతకనివ్వరా..? ఇంకెన్నాళ్లు ఈ మగకళ్ల అరాచకం, ఢాంఢూం అని ఉల్టా మాట్లాడేస్తారు…
కానీ సోషల్ మీడియా ఊరుకోదు కదా… లోకులు మాట్లాడుకున్నట్టుగానే సోషల్ మీడియా రియాక్టవుతుంది కదా… రకరకాల లోకులు ఉంటారు కదా అందులో… పైత్యాలు ప్రకోపించినవాళ్లకూ కొదువ ఉండదు కదా… ఇంకేముంది..? ట్రోలింగ్, వెక్కిరింపులు మొదలయ్యాయి… ‘‘పురుషులూ, ఆమెకు దూరంగా ఉండండిరోయ్, లేకపోతే వేధింపుల కేసులపాలవుతారు..’’ అనే వ్యాఖ్యలు సహా రకరకాల కామెంట్స్, పోస్టులు… దీనికి ఆమె రియాక్టైంది…
‘‘నా సన్నిహితుల నుంచి నా బాధల్ని, నా సమస్యల్ని దూరం ఉంచాలని ఎంత ప్రయత్నించినా సరే… అంతా బాగుందిలే అని ఎప్పటికప్పుడు నాకు నేనే సమాధానపరుచుకుంటున్నా సరే… ప్రతి విషయానికీ తమ మాటలతో నామీద దాడికి దిగి గాయపరుస్తూనే ఉన్నారు చాలామంది… మళ్లీ నన్ను ఆ చీకటిరోజుల్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు… వాళ్లకు దీనివల్ల ఆనందం కలుగుతోందా..? అదే నిజమైతే, వాళ్లు అలాగే ఆనందించనీ, నేనిలాగే ఉంటాను…’’ అని పోస్ట్ చేసింది… తన డ్రెస్సింగును సమర్థించుకోవడానికి ఎమోషన్స్‌ను ప్రయోగించింది… నేను ఆ టాప్ కింద స్లిప్ ధరించానని కూడా క్లారిటీ ఇచ్చింది… (స్లిప్ అంటే బ్రా వంటి ఓ అండర్ గార్మెంట్…)
ట్రోలర్లే కాదు, ఆమెకు మద్దతుదారులూ బోలెడుమంది ఉన్నారు… ఇన్‌స్టాగ్రాం ఇన్‌ఫ్లుయెన్సర్ ఐషా మార్కరౌజ్ ఏం రాసిందంటే… ‘‘భావన ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు, వివరణలూ అక్కర్లేదు… చేతులెత్తితే ఏముందిరా చూడటానికి..? మ్యూజియం కనిపిస్తోందా..? డీడీ1 చానెల్ కనిపిస్తోందా..? పోనీ, స్లిప్ కూడా ధరించలేదూ అనుకుందాం, అరెస్టు చేస్తారా..? ఉరితీస్తారా..? మనమేమైనా అప్ఘనిస్తాన్‌లో ఉన్నామా..? చట్టవిరుద్ధమా..?’’
ఇంకొన్ని భిన్నమైన విశ్లేషణలు కూడా వినిపిస్తున్నయ్… ఆమె లైంగికదాడి బాధితురాలు, ఇన్నేళ్లూ మలయాళ ఇండస్ట్రీకి దూరంగా ఉండి, ఇప్పుడే కాస్త ధైర్యం చేసి ఓ సినిమా చేయడానికి సిద్ధపడింది… లైంగిక దాడి సమయంలో ఆమె మీద భయంకరంగా ట్రోలింగ్, నెగెటివ్ ప్రచారానికి పాల్పడిన బ్యాచులే ఇప్పుడూ కావాలని, సాకు దొరికింది కదాని ఇలా కొత్త దాడికి దిగాయనేది ఆ విశ్లేషణల సారాంశం.,. ఆల్‌రెడీ బాధితురాలు కదా, కాస్త డ్రెసింగ్ సెన్స్ లేకపోతే ఎలా అనడిగేవాళ్లూ బోలెడుమంది… ఇంతకీ ఆమె చేసింది తప్పా..? రైటా..? తెలుగు ఆంటీ, నువ్వేమంటావ్…?
Share this Article