Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘మీ ఏడుపే మాకు దీవెన’’… లారీల వెనుక కనిపిస్తుంటుంది కదా… ఇదే…

March 30, 2026 by M S R

.

బాక్సాఫీస్‌లో కొన్ని హిట్స్ ఉంటాయి… కొన్ని బ్లాక్‌బస్టర్స్ ఉంటాయి… అరుదుగా మాత్రమే “ఫెనామెనాన్”లు వస్తాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి దూసుకెళ్లిన సినిమా  Dhurandhar 2: The Revenge. Ranveer Singh కెరీర్‌లోనే కాదు… ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక రేర్ బాక్సాఫీస్ ఎక్స్‌ప్లోషన్.


11 రోజుల్లో లైఫ్‌టైమ్‌ను మింగేసిన సీక్వెల్

Ads

2025లో వచ్చిన Dhurandhar
ప్రపంచవ్యాప్తంగా ₹1307 కోట్లతో ముగిసింది.

కట్ చేస్తే —  “దురంధర్ 2” అదే నంబర్‌ను 11 రోజుల్లోనే దాటేసింది!

  • Day 10: ₹1250+ Cr
  • Day 11: ₹1340–1360 Cr (అంచనా)

మూడు నెలల ఆ పాత రన్‌ను. ఇది రెండే వారాల్లో రీప్లేస్ చేయడం!
ఇది కేవలం సక్సెస్ కాదు — అల్టిమేట్ డామినేషన్.


 ఇండియా + ఓవర్సీస్ = డబుల్ బ్లాస్ట్

  •  ఇండియా: ₹1000 Cr (11 రోజుల్లో)
  •  ఓవర్సీస్: ₹350+ Cr
  •  USA: $20.8M+ (ఆల్‌టైమ్ ఇండియన్ రికార్డ్)

 ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా “మాస్ + క్లాస్” రెండింటినీ క్యాచ్ చేసింది.

durandhar


ఇక్కడే స్టోరీకి అసలు ట్విస్ట్ ఏమిటంటే… టాప్ వసూళ్ల సినిమాల్లాగా చైనాలు, జపాన్‌లు, గల్ఫ్ దేశాల్లో ఇది రిలీజ్ కాలేదు… ఇండియన్ స్పై, ఇంటలిజెన్స్ గ్లోరిఫై చేసే సినిమా కాబట్టి చైనా రానివ్వదు… పాకిస్థాన్ వంటి దేశాలకు నచ్చదు కాబట్టి గల్ఫ్ దేశాలూ రిలీజ్ కానివ్వవు… ఇండియన్ సినిమాలకు ఆ మార్కెట్ కూడా పెద్దదే… కానీ అవేవీ లేకుండానే చరిత్రను తిరగరాస్తోంది దురంధర్-2

దురంధర్

 అసలు మ్యాజిక్ ఇదే!  ఈ మార్కెట్లు లేకుండానే, ₹1300+ కోట్లు దాటేసింది! … అన్ని దేశాల్లోనూ రిలీజ్ చేసి ఉంటే ఈపాటికే టాప్ త్రి లిస్టులోకి చేరి ఉండేదేమో… ఆల్‌టైమ్ లిస్ట్‌లో దురంధర్ ఎంట్రీ ఇలా…

ప్రస్తుతం ఇండియన్ టాప్ గ్రాసర్స్… 

  1. Dangal – ₹2070 Cr
  2. Baahubali 2: The Conclusion – ₹1788 Cr
  3. Pushpa 2: The Rule – ₹1742 Cr
  4. దురంధర్ 2 – ₹1360+ Cr
  5. దురంధర్ – ₹1307 Cr

 రెండు సినిమాలతోనే టాప్-5లో డబుల్ ఎంట్రీ — ఇది ఫ్రాంచైజ్ పవర్‌కు ఉదాహరణ.

durandhar


 రన్ ఇంకా మిగిలే ఉంది! రోజుకు 35- 40 కోట్ల దాకా వసూళ్లు కొనసాగుతున్నయ్… నిన్నటి శనివారం 58, ఆదివారం 63 కోట్లు… అంటే 10, 11 రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్… ఆక్యుపెన్సీ స్ట్రాంగ్, పెద్ద పోటీ లేదు, వర్డ్ ఆఫ్ మౌత్ సూపర్… అంటే… “ఇది పీక్ కాదు… రికార్డులు తిరగరాయడం ఇప్పుడే మొదలైంది…

ఇండియాలోనే ఉండి యాంటీ -ఇండియా వైఖరులతో ఏడ్చేవాళ్లు ఏడ్చేకొద్దీ సినిమాకు పబ్లిసిటీ పెరుగుతోంది… చూడాలనే కాంక్షను పెంచుతోంది… అవును, కొన్నిసార్లు నెగెటివ్ క్యాంపెయిన్ కూడా అనుకూలిస్తుంది… శుభం… కొన్ని లారీల వెనుక కనిపిస్తూ ఉంటుంది కదా... ‘‘మీ ఏడుపే మాకు దీవెన’’... ఇదే...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘మీ ఏడుపే మాకు దీవెన’’… లారీల వెనుక కనిపిస్తుంటుంది కదా… ఇదే…
  • రియల్ లైఫ్‌పై రీల్ లైఫ్ ఇంపాక్ట్…! పాపం, ఓ సినిమా విలన్ కథ…!!
  • ఓటి కుండకు మోత ఎక్కువ- గిల్ట్ నగలకు మెరుపు ఎక్కువ…
  • పాపం సాక్షి..! పాత ఎడిటర్ వ్యాసాలకూ ఇంత నాసిరకం ప్రజెంటేషనా..?
  • పక్షపాతం- పక్షవాతం…! తటస్థ మీడియా ఎక్కడుంది చంద్రబాబూ…?
  • ఉల్టా పేలిన హరీష్ తుపాకీ..! ఇరికించే ప్లాన్ చేసి దొరికిపోయాడు..!!
  • ప్రతివారం రెండురోజులు లాక్‌డౌన్… పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం…
  • మా ఇడ్లీపై పడ్డారేంట్రా బాబూ… మా తిండి కూడా మమ్మల్ని తిననివ్వరా…
  • లేడీ గెటప్పులో ఈ నరేష్… తల్లి విజయనిర్మలకన్నా అందంగా…
  • ఏదో ఒకరోజు… తప్పకుండా వస్తుంది… అప్పుడు ‘గుర్తింపు’ తథ్యం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions