Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

The Elephant Whisperers… ఐదేళ్ల షూటింగులో ఆ ఏనుగు పిల్లలు చుట్టాలయ్యాయి…

March 13, 2023 by M S R

ఇది మన సినిమా… షార్ట్ ఫిలిమ్ కమ్ డాక్యుమెంటరీ కావచ్చుగాక… సౌత్ ఇండియా క్రియేటర్స్ కృషి… ఐదేళ్ల శ్రమ… మనిషికీ జంతువుకూ నడుమ ప్రకృతి ఒడిలో పెరిగిన బంధాన్ని కళ్లముందు ఉంచిన ఫిలిమ్… ఇద్దరు ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ లైఫ్ చిత్రీకరణ మీద ఆసక్తి ఉన్నవాళ్లు, ఇద్దరూ మహిళలు… ఆస్కార్ అవార్డు అందుకుంటున్న దృశ్యం అబ్బురంగా తోచింది… కడుపు నిండినట్టుగా ఉంది… వాళ్లు నిజంగా ప్రశంసలకు, చప్పట్లకు అర్హులు… డాక్యుమెంటరీలు అంటే మనకున్న చిన్నచూపును పక్కకు తోసేసి, కాసేపు దీని గురించి చెప్పుకోవాలి…

వీళ్లు కమర్షియల్ కల్తీవీరులు కారు… వందల కోట్లు కుమ్మేసే చరిత్ర వక్రీకరణులు కారు… అవును, నేను చెబుతున్నది ది ఎలిఫెంట్ విష్పరర్స్ గురించే… దీనికి దర్శకురాలు కార్తీకి… ప్రధాన నిర్మాత గుణీత్ మోాంగా… కార్తీకి కూడా డబ్బు పెట్టింది… అంతేకాదు, ఆమె స్వయంగా ఓ సినిమాటోగ్రాఫర్… ఆస్కార్‌కు నామినేటయ్యాక హిందుస్థాన్ టైమ్స్ కార్తీకితో మాట్లాడి ఈమధ్య చాలా వివరాలు తెలియజేసింది… కనీసం చాలా పత్రికలు ఈ దశలో కూడా అసలు ఆ డాక్యుమెంటరీ ప్రాధాన్యాన్ని పట్టించుకోలేదు…

oscar

అయిదేళ్ల క్రితం కార్తీకి ఊటీకి వెళ్తోంది… తమిళనాడు… బొమ్మన్ కట్టునాయకన్ అనే ఓ జంతుసంరక్షకుడు రోడ్డు పక్కన కనిపించాడు… తనతోపాటు ముదుమలై అడవులకు చెందిన రఘు అనే ఓ బుల్లి ఏనుగు పిల్ల… నిజానికి ఆ సమయంలో రఘుకు స్నానం చేయించడానికి తీసుకెళ్తున్నాడు బొమ్మన్… అలా చూస్తూ ఉండిపోయింది కార్తీకి (36)… ఆ బంధం అపురూపంగా గోచరించింది ఆమెకు… కాసేపు అలాగే చూస్తుండిపోయింది కారు ఆపుకుని… ఆ ఏనుగు పిల్లకు తల్లి, తండ్రి, ఫ్రెండ్, అన్నీ ఆ బొమ్మనే…

ఆ అడవుల్లో కట్టునాయకన్ తెగ ఏనాటి నుంచో ఏనుగుల సంరక్షణను చూస్తుంటుంది… కృష్ణజింకల్ని ప్రేమించే బిష్ణోయ్ తెగ తెలుసు కదా… అలాగన్నమాట… ఆ ఇద్దరినీ చూశాక కార్తీకి కెరీరే మారిపోయింది… ఓ డాక్యుమెంటరీ తీయడానికి పురికొల్పింది… అంత హడావుడిగా తీసిపారేసే రకం కాదు ఆమె… ఆ బొమ్మన్ కుటుంబంతో కలిసిపోయింది కొన్నాళ్లు… ఆ బంధం పెరిగితే తన ఫిలిమ్ బాగా వస్తుందని ఆశ… కానీ అనుకోకుండా వాళ్లతో ఓ చుట్టరికమే డెవలపైంది ఆమెకు…

ఆ డాక్యుమెంటరీ మొత్తం బొమ్మన్, ఆయన భార్య బెల్లీ, రెండు బుల్లి ఏనుగులు… వాళ్ల నడుమ బంధం గురించి… వాటి పేర్లు రఘు, అమ్ము.. ఈ ఫిలిమ్ తీసుకుని కార్తీకి అమెరికా వెళ్లింది… అందరినీ ఆకర్షించింది అది… అలా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేటైంది… ఆమె డబ్బులేమీ ఖర్చుపెట్టలేదు…

ఈ ఏనుగు పిల్ల రఘు తల్లి కరెంటు షాక్‌తో మరణిస్తుంది… 3 నెలల వయస్సులో ఉన్న రఘు మీద వేటకుక్కలు దాడిచేస్తాయి… దానికి సపర్యలు చేసిన ఫారెస్ట్ రేంజర్స్ దాని పోషణ, సంరక్షణ బాధ్యతను ఈ కుట్టునాయకన్ తెగకు చెందిన బొమ్మన్‌కు అప్పగిస్తారు… ఆ రిజర్వ్ ఫారెస్టులో బొమ్మన్ ఇల్లు… అక్కడికి తీసుకుపోతాడు… ‘ఏనుగుల సంరక్షణకు సంబంధించి నాకేమీ శిక్షణ లేదు…’ అయితేనేం, మా తెగ మొత్తం అందులో నిష్ణాతులే అంటోంది బెల్లీ…

rrr

కార్తీకి ఈ డాక్యుమెంటరీ తీయాలనుకుని, తనే దర్శకత్వం చేపట్టింది… డెబ్యూట్… నడి అడవిలో షూటింగ్… రెండు పిల్ల ఏనుగులు… ఒక్కొక్కటాీ 150 కిలోలు… అనేక సవాళ్ల నడుమ అయిదేళ్లు పట్టింది ఇది పూర్తి కావడానికి… ‘‘ఏడాదిన్నర సమయం నాకు ఆ కుటుంబంతో బంధం పెంచుకోవడం కోసమే సరిపోయింది… నా టీం కూడా చాలా చిన్నది… ముగ్గురే…’’ అని చెప్పుకొచ్చింది కార్తీకి… ఆ ఏనుగులు కెమెరాలున్నాయనే సంగతిని మరిచిపోవాలి… అందుకే ఈ నిరీక్షణ అంతా…

ఈ ఫిలిమ్ 40 నిమిషాల లోపే కదా… కానీ వీళ్ల షూటింగుల 450 గంటల ఫీడ్ వచ్చింది… దాన్ని కుదించడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది… చాలావరకూ ప్రకృతి సంబంధమైన సీన్స్… ప్రకృతితో మనిషి, ప్రకృతితో జంతువు, జంతువుతో మనిషి… ఈ బంధాలన్నీ తక్కువ నిడివిలో కవర్ కావాలి… అదే పెద్ద టాస్క్…

Bellie tells Ammu to lie down next to her, ‘but not on me again, or you’ll get a spanking’.

ఆ 450 గంటల నిడివిలో ప్రధాన పాత్ర అడవి… అడవిలో జంతువులు… మనుషులు, ఏనుగులు, గద్దలు, గుర్రాలు, కోతులు… చివరకు పులులు, చిరుత పులులు కూడా…! ‘‘మీరు నమ్ముతారా… అడవిలో ఉత్త పాదాలతో నడిచాం అనేకసార్లు… ఎందుకో మనసులో చెప్పులు విడిచి అడవిని గౌరవించాలనిపించేది…’’ అంటుంది కార్తీకి…

మాకు సమీపంలోనే ఓ చిరుత తన ఆహారంపై దాడి చేస్తుంటుంది… ఓ పులి వేటాడుతుంది… అవన్నీ స్పష్టంగా వినిపించేవి… మేం నిశ్శబ్దాన్ని ఆశ్రయించేవాళ్లం… ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడే బొమ్మన్, బెల్లీ పెళ్లి జరిగింది… అదీ షూట్ చేశాం… ‘‘నాన్న ఓ ఫోటోగ్రాఫర్, అమ్మ జంతుప్రేమికురాలు… మా బామ్మ నేచురలిస్టు, స్కూలు పిల్లలకు ప్రకృతి పాఠాలు నేర్పించేది… సో, నాకు నడకకన్నా ముందు ప్రకృతిని ప్రేమించడం నేర్పించింది మా కుటుంబం…

మాల్స్, మూవీస్‌కు కాదు… మా కుటుంబం అడవుల్లో, గుట్టల్లో, బీచుల్లో పడి తిరిగేది… నాకు 18 నెలలున్నప్పుడు ఫస్ట్ టైమ్ నన్ను క్యాంపింగుకు తీసుకుపోయారు… ఊటీలోని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లో పెరిగాను… అంటే అన్నిరకాల జంతువుల నడుమ పెరిగాను… మా ఇంటి గేటుకు దగ్గరలో కెమెరా ట్రాప్స్ పెట్టారు… చిరుతలు, పులులను ఆ కెమెరాలు బంధించేవి… అలా నాకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీద ప్రేమ పెరిగింది’’ అని తన నేపథ్యాన్ని వివరించింది కార్తీకి…

In the film, the viewer sees the forest as the Kattunayakan do — a shared, sacred space that belongs equally to the humans, elephants, eagles, hares, monkeys, tigers and leopards. ‘We walk in it barefoot, to show respect to it,’ Bellie says.

ఇప్పుడు ఆస్కార్ ఆమెకు అంతులేని ఉత్సాహాన్ని, తదుపరి ప్రాజెక్టు దిశలో బలాన్ని ఇచ్చింది… ‘‘ప్రపంచానికి మరోవైపు వెళ్లిపోతున్నాను… పసిఫిక్ నార్త్ వెస్ట్‌లోని ఆర్కాస్ మీద, ప్రజలతో వాటి బంధం మీద ఫిలిమ్ తీస్తాను… ఏనుగుల్లాగే అవి కూడా తెలివైనవి… అందమైనవి… ఇంకా ఇంకా అడవుల లోపలికి వెళ్లాలి…’’ అంటూనే చివరలో అసలు విషయం చెప్పింది ఆమె… ది ఎలిఫెంట్ విష్పరర్స్ కథలోని రఘు పెద్దదైపోయింది… వాళ్లను విడిచిపెట్టి బయటికి వచ్చేసింది… త్వరలో అమ్ము కూడా ప్రకృతి ఒడిలోకి వెళ్లిపోకతప్పదు… !!

gunith

చివరగా :: మనదేశంలో ఎవరికైనా రెండుసార్లు ఆస్కార్ పురస్కారం వచ్చిందా..? వచ్చింది..! గుణీత్ మాంగా అనే మహిళా నిర్మాత రెండు సార్లు ఈ పురస్కారం పొందారు. “పీరియడ్ : ఎండ్ అఫ్ సెంటెన్స్” అనే డాక్యుమెంటరీకి 2019లో మొదటిసారి ఈ అవార్డు దక్కింది… ఈ ఏడాది రెండోసారి “ది ఎలిఫెంట్ విస్పరర్స్” డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం లభించింది…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions