Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మలినమైన ఆ శారద దేహం గంగలో స్వీయ నిమజ్జనం…

November 30, 2024 by M S R

.

ఇది అచ్చంగా శారద సినిమా . మూడోసారి ఊర్వశి అవార్డును శారదకు తెచ్చిపెట్టిన సినిమా . మొదటి రెండు ఊర్వశి అవార్డులు మళయాళ సినిమాల్లో నటించినందుకు వచ్చాయి . మూడోది మాత్రం 1979 లో వచ్చిన ఈ నిమజ్జనం తెలుగు సినిమాలో నటించినందుకు వచ్చింది .

గూడ్స్ బండి స్పీడులో నడుస్తుంది సినిమా . ఆరోజుల్లోనే డబ్బులు రాలేదు . అవార్డులు మాత్రం బాగా వచ్చాయి . ఇప్పటి తరం వారు చూడలేరేమో !

Ads

తండ్రి అస్తికలను కాశీలో నిమజ్జనం చేయటానికి పెద్ద కొడుకు , ఆయన భార్య తమ గ్రామం నుండి రైల్వేస్టేషనుకు ఎద్దుల బండిలో బయలుదేరుతారు . ఎద్దుల బండివాడు ఆమె మీద కన్ను వేస్తాడు . అస్తికల ముంతను కావాలని దారిలో పడేసి , దానిని తెచ్చేందుకు భర్త వెనక్కి వెళ్ళేలా చేస్తాడు . ఈలోపు ఒంటరిగా ఉన్న భార్యని మానభంగం చేస్తాడు .

మలినమైన తన శరీరాన్ని కూడా గంగలో నిమజ్జనం చేస్తుంది భార్య . ఎద్దుల బండివాడు తిరిగి తీసుకొని వెళ్లడానికి రైల్వేస్టేషనుకు వస్తాడు . ఆమె గంగలో మునిగి చనిపోయిందని తెలుసుకుని ఖిన్నుడై తన తప్పును చెప్పుకుని చనిపోతాడు . చనిపోయే ముందు భర్త గంగాజలాన్ని బండివాడు నోట్లో పోస్తాడు . టూకీగా ఇదీ కధ .

మంజేరి యస్ ఈశ్వరన్ చిన్న కధల్లో ఒకటి ఈ సినిమా కధ . ఇంత గూడ్స్ బండి సినిమాను తీసేందుకు ముందుకు వచ్చిన జి జగన్నాధ్ గౌడ్ , కె కేశవరావు , బి ధనలక్ష్మిలను మెచ్చుకోవాలి . గొప్ప సాహసమే . బి యస్ నారాయణ దర్శకులు . ఈ సినిమాకు నేపధ్య సంగీతాన్ని అందించింది యం బి శ్రీనివాస్ . ఇప్పుడు బేక్ గ్రౌండ్ మ్యూజిక్కును అందిస్తున్న సంగీత దర్శకులు తప్పక చూడాలి .

శారద భర్తగా చక్రపాణి నటించారు . బహుశా ఈయన నటి రోజారమణి భర్త అనుకుంటాను . Subject to correction . రావి కొండలరావు , రాధాకుమారి , పొట్టి ప్రసాద్ , పుష్పకుమారిలే నాకు తెలిసినవారు .

ఈ సినిమాకు మూడు అవార్డులు వచ్చాయి . ఒకటి జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు . రెండవది పి యస్ నివాసుకు జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు . మూడవది శారదకు ఊర్వశి అవార్డు . అంతే కాదు ; 1980 లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది . అదే సంవత్సరం వార్షా- పోలెండ్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ప్రదర్శించబడింది .

సినిమా యూట్యూబులో ఉంది . వీడియో క్వాలిటీ బాగాలేదు . ఈ సినిమా ఎందుకు ఆడలేదు ; ఎందుకు అవార్డులు వచ్చాయో తెలుసుకోవాలి అనుకునే ఆసక్తి కలవారు వీక్షించవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ తప్పుడు కలెక్షన్ల ప్రకటనలతో ఇప్పుడు ఒరిగేదేమిటి సూర్యా..?!
  • ప్చ్, మన బ్రాహ్మి ఆగిపోయాడు… కానీ వడివేలు వదలడం లేదు…
  • == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
  • నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
  • ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
  • అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
  • విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
  • వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?
  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions