Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాఘవేంద్రరావు పూలూ పళ్లూ లేని స్ట్రెయిట్ కథాగమనం ఇది..!

January 12, 2025 by M S R

.

. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)… …. ప్రముఖ హాస్యనటుడు ఆలీ బాలనటుడిగా నటించిన మొట్టమొదటి లేదా రెండో సినిమా 1980 లో వచ్చిన ఈ నిప్పులాంటి నిజం . హీరోయిన్ తమ్ముడిగా నటించాడు .

సినిమాకు నిజం చెప్పాలంటే హీరో సత్యనారాయణే . సినిమా ఇప్పుడు చూస్తుంటే యన్టీఆర్ జస్టిస్ చౌదరి సినిమా గుర్తుకొస్తుంది . ఇప్పుడు అని ఎందుకు అన్నానంటే జస్టిస్ చౌదరి కన్నా ముందు వచ్చిందీ సినిమా .

Ads

అసలీ సినిమాకు లాయర్ చక్రవర్తి కరెక్ట్ పేరు . ఈ సినిమాలో సత్యనారాయణ లాయర్ చక్రవర్తి .
సత్యనారాయణ తర్వాత చాలా బాగా నటించింది రావు గోపాలరావు . సాడిస్టిక్ విలన్ గా కర్కశంగా నటించారు . వీరిద్దరి తర్వాత షావుకారు జానకి . లాయర్ గారి భార్యగా , అమితమైన దైవభక్తి కల మహిళగా సెంటిమెంటల్ పాత్రను బాగా పోషించింది .

రాఘవేంద్రరావు దర్శకుడే అయినా ఆయన మార్క్ పెద్దగా కనిపించదు . పూలు ఉండవు , పళ్ళు ఉండవు . సత్యానంద్ , జంధ్యాల వ్రాసిన కధను యధాతథంగా నడిపించినట్లుగా ఉంటుంది . కధలో బలం ఉండటం వలన ఫలపుష్పాలు లేకపోయినా బాగానే ఆడింది .

డైలాగులను సత్యానంద్ వ్రాసారు . బాగానే ఉంటాయి . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వ్రాసిన పాటలు నాలుగూ శ్రావ్యంగానే ఉంటాయి . బయట హిట్ కాలేదు .

అబ్బోసి అవునందయ్యో కొబ్బరి మామిడి ముక్క , ఓ చక్కని చుక్కా ఈ చక్కిలిగింత , నూజివీడు చిన్న రసం నా సరసం , సన సనజాజుల సరదా బుల్లెమ్మ పాటలు శ్రావ్యంగానే ఉంటాయి . నాలుగూ డ్యూయెట్లే .

మురళీమోహన్ , రాజ్యలక్ష్మి , కాంతారావు , అల్లు రామలింగయ్య , గిరిజ , పి జె శర్మ చలపతిరావు ప్రభృతులు నటించారు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . ఇంతకుముందు చూసి ఉండకపోతే సత్యనారాయణ అభిమానులు తప్పక చూడతగ్గ సినిమాయే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోస్ట్ చేయడానికీ డబ్బుల్లేవ్… ఆమె తన హెయిర్ డ్రయర్ అమ్మేసింది…
  • కాల్పనిక కథను మించి..! జీవితాన్ని మించిన మెలోడ్రామా ఏముంటుంది..?
  • తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో… మంచాలిక దిగండోయ్ కొక్కొరొకో…
  • ఇవేం బంధాలు..? ఇవేం పంచాయితీలురా బిగ్‌బాస్ బాబూ…!!
  • లొట్టపీసు కేసు కాదు..! కేటీయార్ పక్కాగా ఫిక్సవుతున్న పెద్ద కేసు..!!
  • ఇదేమీ పాత్రికేయ ఘన పురస్కారం కాదు… జస్ట్, డబ్బు కక్కుర్తి యాడ్..!!
  • పరువు, పగ వికృతకోణం… కలుక్కుమనిపించే క్లైమాక్స్… ప్రేమ గెలవలేదు…
  • పవన్ కల్యాణ్, ఇదుగో ఓ సరికొత్త సనాతన ధర్మసారథి వస్తున్నాడు..!
  • బీఆర్ నాయుడు… కనీసం ఈ అపహాస్యపు శివజ్యోతినైనా శిక్షించగలడా..?
  • ఏమయ్యా నరేషూ… మరీ తెలంగాణ యాసను అంత ఖూనీ చేయాలా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions