.
చాన్నాళ్లు… దాదాపు 26, 27 ఏళ్ల క్రితం… పీపుల్స్‌వార్ ఉత్తర తెలంగాణ కమిటీ సెక్రెటరీ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ మహిళాదళం ఏర్పాటైంది…
స్ట్రాటజీ, ఆపరేషన్, ఆంబుష్, టెక్ తదితర అన్ని విషయాల్లో శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేశారు దాన్ని… వరంగల్ నుంచి ముఖ్యమైన విలేకరులను తీసుకుపోయి మరీ తను వెల్లడించాడు… (అప్పటికి శాటిలైట్ టీవీలు లేవు… ఈటీవీ వంటి ఒకటీరెండు లేట్ న్యూస్ చానెళ్లు మినహా)…
Ads
అప్పుడు అనిపించింది… నిజమే కదా… లేడీస్ ఎందులో తక్కువ… సరిగ్గా నేర్పించాలే గానీ పురుషులకు ఏం తక్కువ..? ఎందులో తక్కువ..? మిలిటరీ ఆపరేషన్లలో పిసరంత ఎక్కువ ప్రతిభ కనబరుస్తారు కదాని…
దైహికంగా ఫిట్‌నెస్ గట్రా నథింగ్… ఇన్నాళ్లకు ఇదెందుకు గుర్తొచ్చిందీ అంటే… నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఓ స్పెషల్ లేడీ కమాండో స్పెషల్ టీమ్ ఫామ్ చేసింది… సూపర్…
ఆమధ్య నలుగురు తునికాకు కూలీలు దట్టమైన అడవిలో తప్పిపోతే తనే రంగంలోకి దిగి ఆమె కాపాడిన తీరును మనం చెప్పుకున్నాం, మెచ్చుకున్నాం… ఇప్పుడు మరోసారి ఆమె ఇనీషియేటివ్‌కు అభినందనలు…
ఇప్పుడు నక్సలైట్లతో పెద్ద సవాళ్లు ఏమీలేకపోవచ్చుగాక… కానీ కొన్నిసార్లు స్పెషల్ టాస్కుల్లో ఈ కమాండో టీమ్స్ బాగా ఉపయోగపడతాయి…
నిజానికి దేశంలోని త్రివిధ దళాలలో స్పెషల్ కమాండో ఫోర్సులు, ఆర్మీ కమాండోలు, నేవీలో మార్కోస్, అలాగే ఎన్‌ఎస్జీ, ఎస్‌పీజీ వంటి అత్యుత్తమ బలగాలు, మన రాష్ట్రంలో గ్రేహౌండ్స్ బలగాలు పనిచేస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు మహిళా కమాండోలు ఏ రాష్ట్రంలో లేరు…
ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచనలతో ‘టీం శివంగి’ని తయారు చేయడం జరిగింది… ఈ టీమ్‌కు అధునాతన ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు. వాటిని వినూత్న రీతిలో వాడేలా తీర్చిదిద్దారు…
మహిళలకు శారీరక దృఢత్వం పెంపొందించడమే కాకుండా, రన్నింగ్ రేసులు, వర్టికల్ రోప్ క్లైంబింగ్, డిఫెన్స్ పద్ధతులు, యుద్ధ తంత్రాలు, పేలుడు పదార్థాల వినియోగం, అన్ని రకాల ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు.
ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాల ఫైరింగ్, నిర్వహణ, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేని నావిగేషన్, ఆకస్మిక వ్యూహాలు, శత్రు కదలికల అంచనా, అడవిలో సంకేతాలను అర్థం చేసుకోవడం, నిఘా పద్ధతులు, ఆకస్మిక దాడులు, ఎదురు దాడులపై… వాట్ నాట్, పర్‌ఫెక్ట్ శిక్షణ అందించారు…
అంతేకాకుండా.., ఒక్కొక్కరిని ఒక్కో విభాగంలో నిపుణులుగా తీర్చిదిద్దారు… కొంతమందికి యుద్ధ తంత్రాలపై, మరికొంతమందికి ఫీల్డ్ సిగ్నల్స్, ఇంకొంతమందికి ఫైరింగ్, మరో వర్గానికి నిఘా వ్యవస్థలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు… వీరందరినీ ఒక సమర్థవంతమైన స్పెషల్ టీమ్‌గా రూపొందించారు…
గుడ్… నిజానికి రాష్ట్ర స్థాయిలో ఓ టీమ్ అవసరం… అలాగే జిల్లాల్లో ఇలాంటి కమాండో ఫోర్స్ అవసరం… వీటిని ఏ సందర్భాల్లో, ఏ అవసరాలకు వాడుకుంటాం అనేది వేరే సంగతి… కానీ సుశిక్షితులైన కమాండ్ ఫోర్స్ అవసరం… అదీ మహిళా స్పెషల్ మరీ మరీ అభినందనీయం…!!
Share this Article