ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి మొన్నటి ఆదివారం అర్థంతరంగా జడ్జిల్లో ఒకరైన నిత్యా మేనన్ బయటికి వెళ్లిపోయింది… వీడ్కోలు చెప్పింది… అమ్మల దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్స్ అవి… కంటెస్టెంట్ల తల్లులు కూడా పార్టిసిపేట్ చేశారు… అకస్మాత్తుగా వాళ్ల అమ్మను తలుచుకుని ఎమోషన్‌కు గురైన నిత్యా మేనన్ అమ్మను కలవడానికి వెళ్తున్నాను అంటూ మధ్యలోనే లేచి వెళ్లిపోయింది… మణిశర్మ పాల్గొన్న ఆ ఎపిసోడ్‌లో మధ్యలో వెళ్లిపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది…
నిజానికి బెంగుళూరులో స్థిరపడిన ఓ మలయాళీ కుటుంబం వాళ్లది… నిత్యా ఒక్కతే సంతానం వాళ్లకు… సో, బెంగుళూరు వెళ్లి అమ్మను చూసి రావడం అనేది పెద్ద విషయమేమీ కాదు… తెలుగు టీవీ సీరియళ్లలో నటించడానికి అనేకమంది కన్నడ నటీనటులు వస్తుంటారు, పోతుంటారు రెగ్యులర్‌గా… బెంగుళూరు-హైదరాబాద్ ఫ్లయిట్స్‌లో సగం ప్రయాణికులు వాళ్లే ఉంటారు… సరే, ఏం జరిగిందో, ఇష్యూ ఏమిటో తెలియదు కానీ నిత్యా మేనన్ పూర్తిగానే ఈ షోకు బైబై చెప్పినట్టుగా ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది…
ఇటు థమన్, పక్కనే నిత్యా… జడ్జిల పోడియం నిండుగా కనిపించేది… సింగర్ కార్తీక్ కాస్త స్లిమ్… ఆమె రెగ్యులర్ సింగర్ కాదు, రైటర్ కాదు, కంపోజర్ కాదు, మరి జడ్జి ఎలా..? అనే ప్రశ్నకు సమాధానం లేదు… కాకపోతే పార్ట్ టైమ్ సింగర్ తను… జడ్జిగా కూడా పర్లేదు… ఓ గ్లామర్ టచ్ ఆ షోకు… వచ్చే శనివారం రామజోగయ్య శాస్త్రి గెస్టు… ఆ సందర్భంగా ఓ ప్రోమో రిలీజ్ చేసింది ఆహా టీం… హఠాత్తుగా అందులో శ్రావణ భార్గవి కనిపించడం ఆశ్చర్యపరిచింది…
Ads
అయితే తను జడ్జి స్థానంలో లేదు, స్టేజీ మీద ఉంది… బహుశా శ్రీరామచంద్రకు కో-హోస్ట్‌గా తీసుకొచ్చారేమో… ఆమధ్య భర్త హేమచంద్రతోపాటు వచ్చి ఒకరిద్దరు కంటెస్టెంట్లతోపాటు కలిసి పాటలు పాడింది… ఇప్పుడు ఏకంగా హోస్ట్ మైక్ అందుకున్నట్టుంది… ఇప్పుడు టీవీలు, ఓటీటీల్లో హోస్టింగ్, యాంకరింగ్ చేయాలంటే ఓవర్ యాక్షన్, అరుపులు అవసరం… ఆమె చేయగలదా చూడాలి…
బిగ్‌బాస్ చూసేవాళ్ల సంఖ్య చాలా చాలా పడిపోయింది… ఒకప్పుడు బిగ్‌బాస్ షో సీజన్‌లో సోషల్ మీడియా ఫుల్ ఆ వార్తలే కనిపించేవి, వినిపించేవి… ఇప్పుడు ఎవడూ చూసేవాడు లేడు, మాట్లాడుకునేవాడు లేడు… బిగ్‌బాస్ 24 గంటల ఓటీటీ షో ఉత్త ఫ్లాప్… పైగా బూతు, వెగటు, అసభ్య ధోరణులు పెచ్చుమీరాయి… అలాగే ఐపీఎల్ ప్రేక్షకుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది… దానిపై క్రేజు గతంతో పోలిస్తే బాగా తగ్గింది… సోషల్ మీడియా ట్రెండ్స్ చెప్పేది కూడా అదే…
ప్రేక్షకులు ఓటీటీలు, టీవీల్లో ఇతర రియాలిటీ షోల వైపు మళ్లుతున్నారు… అది ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షోకు ప్లస్ అయినట్టుంది… అఫ్‌కోర్స్, ఇతర టీవీల్లో వచ్చే మ్యూజిక్ రిలేటెడ్ షోలతో పోలిస్తే ఇది బెటరే… మొన్నామధ్య ఆహా ఓటీటీ వాడే… ‘‘40 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్, 36 లక్షల మంది వ్యూయర్స్’’ అని డప్పు కొట్టుకున్నాడు ఓ వీడియోలో… కానీ ఆ వీడియోకు జస్ట్, 1.76 లక్షలు యూట్యూబ్ వ్యూస్ మాత్రమే ఉన్నయ్… కాబట్టి ఆ షో మరీ అంత హిట్ ఏమీ కాకపోవచ్చు… కామెంట్స్‌లో కూడా ఎక్కువ శాతం శ్రీరామచంద్ర అభిమానులే కనిపించారు… మగ కంటెస్టెంట్లు నానాటికీ నాసిరకం ప్రదర్శన ఇస్తుండగా… ఆడ కంటెస్టెంట్లు మాత్రం ఇరగదీస్తున్నారు… ప్రత్యేకించి యంగ్ చెన్నై సింగర్ వైష్ణవి… తనతోపాటు వాగ్దేవి, లాలస, ప్రణతి, అదితి తదితరులు బలంగా పోటీపడుతున్నారు..!!
Share this Article