By…. Hari Krishna MB ……………………… మళ్ళీ మియన్మార్ న్యూస్ లో కి వచ్చింది. ఈ పేపర్ వాళ్ళు వేరే దేశాల news cover చేసేటప్పుడు కొంత research చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది.
మొదటిది Pronunciation
ఆ దేశం పేరు మయన్మార్ కాదు మియన్మార్.
మియన్మార్ లో “ky” ని “కీ” అన్నారు. “చి” అంటారు..
Aung San Su Kyi ని ” సూ కీ” అని రాయకుండా “సూ చీ” అని రాయాలి, పలకాలి…
Win Myint (Acting president) ని “విన్ మింట్” కాకుండా “వి మి” అని రాయాలి, పలకాలి..
మియన్మార్ లో కరెన్సీ “Kyat” – క్యాట్ అనరు.. “చాట్” అంటారు.
కొద్ది గా అక్కడి వాళ్ళతో చెక్ చేసుకుంటే ఈ తప్పులు తప్పుతాయి.
రెండు, అక్కడి రాజకీయాలు… దీని మీద పెద్ద గా బాధపడిపోవాల్సిన పని లేదు…
1947 లో సూ చీ వాళ్ళ నాన్న ని చంపేశారు.. 1948 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది..
1962 నుంచి 1988 వరకూ మిలిటరీ కంట్రోల్ లో ఉన్నింది… Ne Win అనే అతని ఆధ్వర్యం లో.. 1988 లో బాగా అల్లర్లు జరిగితే ఆయన దిగిపోయి U Saw Maung (ఉ సో మోంగ్) అనే వచ్చాడు… ఆ అల్లర్ల లో కొన్ని వేల మంది చనిపోయారు.. అంతవరకూ ఉన్న బర్మా అనే పేరు మియన్మార్ గా మార్చేశాడు..
ఈయన 1990 లో ఎలక్షన్స్ నిర్వహిస్తే మన సూ చీ పార్టీ (NLD) గెలిచింది.. ఈయనకు అది నచ్చలేదు.. సూ చీ ని ఇంట్లో బంధించేసి ఈయనే పాలించాడు… 1992 లో ఈయన sick అయితే U Than Shwe అనే ఆయన వచ్చాడు… ఆయన 2010 వరకూ పాలించాడు..
2010 లో ఇక చాల్లే అని వెళ్లి సింగపూర్ లో రిసార్ట్ బంగాళా లో settle అయ్యాడు… ఆయన మీద మాంచి బుక్ ఉంది… ఇంటర్నెట్లో… వెతికి చదవగలరు… ఆయన ప్లేస్ లో Min Aung Hlaing అనే ఆయన మిలిటరీ అధిపతి అయ్యారు.
అంతర్జాతీయంగా pressure పెరిగేసరికి మిలిటరీ నే ఒక party ని (USDP) ని స్థాపించి మిలిటరీ వాళ్ళని ఆ పార్టీ లో మెంబెర్స్ గా చేసి అధికారం ఆ పార్టీ చేతిలో పెట్టింది… నామమాత్రం గ జరిగిన 2010 ఎన్నికల్లో NLD పోటీ చెయ్యలేదు..
మొత్తం హవా మిలిటరీ దే. ఏ ప్రభుత్వ ఆఫీస్ లో చూసినా మిలిటరీ నుంచి deputation పై ఉన్నోళ్లే… విపరీతమైన అవినీతి ఎక్కడ చూసినా… మన దేశం కంటే చాలా ఎక్కువ అనుకోవాలి..
2008 లో ఈ Than Shwe అనే ఆయన కొత్త రాజ్యాంగం రచించాడు… పార్లమెంట్ లో 25% సీట్లు మిలిటరీ కి reserve చేసేసారు… మిలిటరీ నామినేట్ చేస్తుంది అన్నమాట… elections జరిగినా మిగతా 75% వరకే… ఇంకెప్పుడైనా రాజ్యాంగం లో మార్పులు చెయ్యాలంటే 76% మద్దతు అవసరం అని రూల్ కూడా పెట్టారు.. So ఏ పెద్ద చట్టం అయినా సరే మిలిటరీ మద్దతు లేకుండా పార్లమెంట్ లో pass కాదు..
మధ్యలో 2012 లో జరిగిన By elections లో Aung San Su Kyi పోటీ చేసి పార్లమెంట్ లో కూచుంది… ఆ తర్వాత 2015 లో జరిగిన ఎన్నికల్లో NLD 60% పైగా సీట్లు వచ్చాయి. ఈ ఐదేళ్ళలో దేశం పెద్ద బావుకుందేమీ లేదు… కొన్ని foreign company లు రావడం వలన ఉద్యోగాలు పెరిగాయి.. మిగతా అంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే…. అసలే సరిగా చదువురాని జనాలు.. స్వేచ్ఛ కి పెద్ద అర్థం తెలియని వాళ్లలో మార్పు ఎలా వస్తుంది..
మొన్న 2020 లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి.. ఈసారి NLD కి 80% పైగా సీట్లు వచ్చాయి… అసలేమీ చెయ్యకపోయినా ఇన్ని సీట్లు వచ్చాయి అంటే అంతకుముందు మిలిటరీ ని ఎంత అసహ్యించుకున్నారో… ఈ పరిస్థితి Min Aung Haling ఊహించిందే… ఈ ఎన్నికలు ఒప్పుకోము అని ప్రకటన ఇప్పించాడు… మొన్న మళ్ళీ Su Kyi ని ఇంట్లో అరెస్ట్ చేసేసి.. అధికారం తీసేసుకున్నాడు.. అధికారం ఎవ్వరికి చేదు…
ఇలా స్వాతంత్య్రం వచ్చాక మిలిటరీ గుప్పిట్లో ఉండడం ఆ దేశానికి కొత్త కాదు.. 2021 లో కూడా ఇలా జరగడం కొంత ఆశ్చర్యమే కానీ పెద్ద వింత ఏమీ కాదు… ప్రపంచం మొత్తం మీద మళ్ళీ వ్యక్తి పాలన (Monarchy) వైపు ఆసక్తి పెరుగుతోంది.. ఇండియా తో సహా…
మియన్మార్ లో చాలా smooth గా coup జరగడానికి కారణం – అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న మిలిటరీ వాళ్ళే… వాళ్ళే మొత్తం control చేస్తూ వచ్చారు..
ఇలా మిలిటరీ rule ఉన్నాకూడా జన జీవనానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇంటర్నెట్ కొద్ది సేపు ఆపేసి మళ్ళీ మొదలెట్టారు. చేవ చచ్చిన జనాలు, “ముఖ్యంగా యువత”, ఉద్యమాలు ఏం చేయలేరని మిలిటరీ వాళ్లకి తెలుసు..
పక్కనే ఉన్న చైనా బాగా సపోర్ట్ చేస్తుంది మిలిటరీని.. మిగతా పక్క చిన్న దేశాలు పెద్ద పట్టించుకోవు. ఇండియా గురించి మియన్మార్ పెద్ద లెక్క చెయ్యదు.. చైనా influence ఎక్కువ..
రెండు రోజులు పేపర్ లో వచ్చి అదే ఆగిపోతుంది. నా లోకల్ మియన్మార్ మిత్రులు అంత బాగా వేడిగా ఉన్నారు.. కానీ రోడ్డు మీదకు వచ్చి చచ్చేంత మాత్రం కాదు…
Share this Article
Ads