Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో నెవ్వర్..! ఆ ఇద్దరితో విజయశాంతి మళ్లీ సినిమాలు చేయదు…!!

April 22, 2025 by M S R

.

ఓ వార్త కనిపించింది… విజయశాంతి అఖండ-2లో కనిపించబోతోంది అని..! బాలయ్యకు ఈ సినిమా మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి… సేమ్ అఖండలోలాగే ఇందులో కూడా డ్యుయల్ రోల్ అట…

బోయపాటి ఫుల్ కాన్సంట్రేషన్ అట… విజయశాంతి కూడా ఈ టీమ్‌లో చేరితే ఫుల్ బజ్ వచ్చి సినిమా అఖండకన్నా హిట్ అవుతుందని ఆశిస్తున్నారట… కానీ..?

Ads

విజయశాంతి ప్రస్తుత ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే ఈ వార్తకు అంత సీన్ లేదని తేలిపోతుంది… ఎందుకంటే..? ఈమధ్య అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ సీనిమా టీమ్‌తోపాటు…

అందులో ఇంటర్వ్యూయర్ అడుగుతోంది… ‘‘చిరంజీవితో 19, బాలకృష్ణతో 17 సినిమాలు చేశావట, మళ్లీ చేస్తావా..? ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు… చెరో సినిమా చేసి, తరువాత మంత్రివైపోయి ఆ బిజీలో తిరుగు’’ అని… దాన్ని మరో మాట లేకుండా కొట్టిపడేసింది విజయశాంతి… (అసలు ఆమెకు వేసిన ఆ ప్రశ్నే అసంబద్ధం అనిపించింది)…

‘‘చాన్స్ లేదు, ఎమ్మెల్సీగానే టైమ్ సరిపోదు…’’ అని చెప్పింది… ఎమ్మెల్సీ ఎలాగూ అయిపోయింది, మంత్రిని కూడా అవుతాననే నమ్మకం ఉన్నట్టుంది… ఏమో, ఢిల్లీ భరోసా ఇచ్చిందేమో కూడా..!

నిజానికి అది కాదు సమస్య… అప్పట్లో ఏదో సినిమాకు సంబంధించి చిరంజీవికీ విజయశాంతికీ నడుమ దూరం పెరిగింది… ఇప్పటికీ ఆ దూరం అలాగే ఉన్నట్టుంది… సో, టైమ్ పుష్కలంగా ఉన్నాసరే చిరంజీవితో ఆమె సినిమా చేయదు… చిరంజీవి కూడా పెద్దగా ఎంటర్‌టెయిన్ చేయడు…

విజయశాంతి

ప్లస్… వాళ్లతో ఈక్వల్ స్టేటస్ అనుభవించిందామె ఓ దశలో… ఇప్పుడు ఎలాగూ స్టెప్పులు గట్రా రొటీన్ హీరోయిన్ వేషం ఎలాగూ వేయదు… వాళ్లకు తల్లిగానో అత్తగానో అసలు చేయదు… తనకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇతరత్రా రోల్ ఉంటే తప్ప చేయదు… చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో వాళ్లు తప్ప మరో ఈక్వల్ స్టేటస్ రోల్ ఇతరులకు ఉండదు… సో, విజయశాంతి ఒప్పుకోదు…

అప్పట్లో మహేశ్‌బాబుతో ఓ సినిమా చేసింది, ఇప్పుడు కల్యాణరామ్‌తో మరో సినిమా… ఇవి అంగీకరించడానికి ముందు ఆమె ఎమ్మెల్సీ కాదు, మంచి రోల్స్ దొరికితే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిద్దామనే అనుకుంది… కానీ ఇప్పుడు మారిపోయింది…

ఆల్రెడీ తను తెలంగాణ ప్రభుత్వంలో ఓ కీలక రోల్‌కు వచ్చేసినట్టే అనుకుంటోంది… ఇదే సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ… ‘‘దుష్టశక్తులు ఈ సినిమా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి… సినిమాను చంపేసే ఈ కుట్రల్ని నేను క్షమించను’’ అని హెచ్చరించింది… ఏ హోదాలో క్షమించదు, ఏం చేస్తుంది..? ఏమో, తను ఏమనుకుంటుందో మరి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘బ్రదర్ కొంత కరెంటు సర్దుతావా..? వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తా…’’
  • రెడ్ బుక్ సరే… పింక్ బుక్ సరే… అసలు ఈ బ్లూ బుక్ ఏమిటో తెలుసా..?
  • ట్రోలర్‌కు చెప్పుతో కొట్టినట్టు కౌంటర్… మీకు బూమ్రా-సంజనా కథ తెలుసా…
  • కేటీఆర్ ఇలా ట్వీటాడో లేదో… కవిత నుంచి కౌంటర్ పడింది…
  • త్రిష మళ్లీ హర్టయింది..! సీత మాజీ భర్తకు స్ట్రాంగ్ కౌంటర్ ..!
  • అసలే జలపాతం చలి… కేవలం బికినీ… అప్పటి క్రేజీ లిరిల్ యాడ్ కథ…
  • హోరెత్తిన ఇండియా..! మురిపెంగా T20 వరల్డ్ కప్ ముద్దాడిన ఈ క్షణం..!!
  • అమెరికా తాజా ప్రేలాపనలకు విదేశాంగ మంత్రి జైశంకర్ జవాబు…
  • సూర్యకుమార్ కెప్టెన్సీ వైఫల్యాలు కాటేయకపోతే… గెలుపు మనదే…
  • అరవయ్యేళ్ల ఆ మహిళ ఎవరామె..? కాస్త సీరియస్‌గా చదవండి…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions